Camels
-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి విన్నారా..?. ఈ ఫ్యాబ్రిక్ ఒక మీటర్ ఖరీదే దాదాపు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. ఇది మార్కెట్లో దొరకడం కూడా కష్టమే. ఖరీదు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. ఏంటి ఈ ప్యాబ్రిక్ విశిష్టత..?. ఎందుకంత ఖరీదు అంటే..ఈ ఫ్యాబ్రిక్ ఉన్నిని దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో ఉండే వికునా అనే ఒక విధమైన ఒంటె నుంచి సేకరిస్తారట. అందువల్లే ఈ ఫ్యాబ్రిక్‌ని వికునా అని పిలుస్తారు. దీనితో టానీ అనే కోటులు డిజైన్ చేస్తారట. ఏదో గొర్రెల మాదిరి పెంపుడు జంతువుగా ఈ ఒంటెలను పెంచడం సాధ్యం కాదట. అలాగే ఈ ఒంటె నుంచి ఉన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సేకరించగలరట.అలాగే ఇవి తక్కువ ఉన్నినే ఉత్పత్తి చేస్తాయట. ఆండియాన్ ఎత్తైన పర్వతాల్లో ఉండే చలి నుంచి రక్షణగా ఆ ఒంటెలపై ఈ మృదువైన ఉన్ని ఉంటుందట. ఇది గాలిని ఏ మాత్రం చొరబడనీయకుండా శరీరానికి హత్తుకుపోయేల వెచ్చగా ఉంచుతుందట. అలాగే వికునాల నుంచి ఉన్నిని సేకరించడానికి చాలా సమయం పడుతుందట కూడా. అత్యంత జాగ్రత్తలు తీసుకుని చాలా ఓపికతో ఆ జంతువు నుంచి ఉన్నిని సేకరించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఎవరు ధరిస్తారంటే..రాయల్టీకి చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్‌ని ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు ధరిస్తారు. అయితే ప్రస్తుతం స్పానిష్ ఆక్రమణతో ఈ జంతువుల అంతరించిపోయే జంతువులు జాబితాలో చేరిపోయిందని చెబుతున్నారు ప్యాషన్ నిపుణులు. అదీగాక ఈ జంతువుల పెంపకం సాధ్యం కానీ పని అయితే వాటి నుంచి ఉన్నిని సేకరించడం అనేది కూడా అత్యంత క్లిష్టమైన పని అందువల్లే ఈ ఉన్ని ఒక మీటరు ముక్క ధర సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందని చెబుతున్నారు ఫ్యాషన్ ఔత్సాహికులు.ఇప్పటి వరకు అత్యం లగ్జరియస్ ఫ్యాబ్రిక్‌లు అయిన మెరినో, కష్మెరె వంటి ఉన్ని దుస్తులు కంటే ఇదే అత్యంత ఖరీదైనది. అయితే మెరినో, కష్మెరె వంటివి అందుబాటులో ఉన్నంత ఈజీగా ఈ వికునా ఫ్యాబ్రిక్ ఉన్ని దొరకడం బహు కష్టం. ఈ ఉన్నితో చేసిన కోటు ధర రూ. 17 లక్షలకు పైనే ఉంటుందట. లోరో పియానా, బ్రియోని, కిటాన్తో సహా పలు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ హౌస్‌ల్లో ఈ వికునా కలెక్షన్స్ ఉంటాయట.(చదవండి: మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!) -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్‌లోని ఈ ల్యాబ్‌లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
The island of Hydra: ఇచట కార్లకు ప్రవేశం లేదు!
అక్కడ అడుగు పెడితే కాల స్పృహ కనుమరుగవుతుంది. అసలు కాలమే వెనక్కు వెళ్తుంది. కార్లన్నవి మచ్చుకు కూడా కానరాని కాలం కళ్ల ముందు కనిపిస్తుంది. గుర్రపు బగ్గీలే అక్కడ ప్రధాన ప్రయాణ సాధనాలు. కొండొకచో గాడిదలు, కంచర గాడిదలు బరువులు మోస్తూ కనిపిస్తుంటాయి. కనుచూపు మేరా ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, దానికి దీటుగా పోటీ పడుతూ పరిశుభ్రత కనువిందు చేస్తాయి. ఎక్కడిదా ప్రాంతం? ఏమా కథ...?! గ్రీస్ దేశంలో అనగనగా అదో ద్వీపం. పేరు హైడ్రా. అక్కడి ఎజియన్ సముద్రంలోని ద్వీపాల్లో ఒకటి. వాటి మాదిరిగానే స్వచ్ఛమైన జలాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. కళ్లు చెదిరే అందాలకు, ఆహ్లాదకర వాతావరణానికి, పచ్చదనానికి కాణాచి. కాకపోతే వాటిల్లో దేనికీ లేని ప్రత్యేకత హైడ్రా దీవి సొంతం. ఆ కారణంగానే అది కొన్నేళ్లుగా అంతర్జాతీయ పర్యాటకుల నోళ్లలో తెగ నానుతోంది. అదేమిటంటే... అక్కడ కార్లు తదితర మోటారు వాహనాలు పూర్తిగా నిషేధం. గుర్రాలు, కంచర గాడిదలు మాత్రమే ప్రయాణ, రవాణా సాధనాలు. ఆ మేరకు కఠిన నిబంధనలు ఏర్పాటు చేసుకోవడమే గాక వాటిని తూచా తప్పకుండా పాటిస్తోంది కూడా. అంబులెన్సులు, అగి్నమాపక వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు. హైడ్రా దీవిలో అడుగు పెట్టగానే మనల్ని పలకరించేది గుర్రాలు, కంచర గాడిదలే. స్థానికుల్లో ఎవరిని చూసినా వాటి మీదే చకచకా సాగిపోతూ కనిపిస్తారు. దక్షిణాన అందాలకు ఆలవాలమైన కమీనియ అనే కుగ్రామం మొదలు పశి్చమాన అత్యంత పారదర్శకమూ, పరిశుభ్రమైన సముద్ర జలాలలో అలరారే మండ్రాకి దాకా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ కాలపు దీవి హైడ్రా మనల్ని పాత కాలానికి తీసుకెళ్లి కట్టి పడేస్తుందని అంటారు హారియట్ జర్మన్. స్థానికంగా హార్స్ ట్రెక్కింగ్ కంపెనీ నడుపుతున్న ఆమె 24 ఏళ్ల క్రితం అనుకోకుండా అమ్మతో పాటు అక్కడికి విహార యాత్రకు వచ్చారు. ఆ ప్రాంతం ఎంతగా నచి్చందంటే, అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారు! తర్వాత పదేళ్ల క్రితం గ్రీస్‌ను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం కారణంగా తనకు ప్రాణప్రదమైన గుర్రం క్లోను అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో హార్స్ ట్రెక్కింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుందామే. ఇప్పుడు గుర్రాల సంఖ్య 12కు పెరిగింది. ‘కార్లు లేవు గనుక ఇక్కడ అందరి జీవితాలూ హడావుడికి దూరంగా, నింపాదిగా గడుస్తుంటాయి‘ అంటూ నవ్వుతారామె. చరిత్రే కారణం హైడ్రా దీవి 18, 19వ శతాబ్దం దాకా ప్రముఖ సముద్ర వర్తక కేంద్రంగా ఓ వెలుగు వెలిగింది. 20వ శతాబ్దంలో మోటార్ వాహనాల శకం రాకతో ఆ వైభవం వెనకపట్టు పట్టింది. ఇరుకు సందులు, రాళ్ల ప్రాంతం కావడంతో హైడ్రాలో మోటార్ వాహనాల రాకపోకలు ఎప్పుడూ కష్టతరంగానే ఉంటూ వచ్చాయి. దాంతో, వాటిని పూర్తిగా నిషేధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన స్థానిక యంత్రాంగానికి పుట్టుకొచ్చింది. అదే ఇప్పుడు ఆ దీవిని ప్రత్యేకంగా నిలిపింది. వీఐపీలకు విశ్రామ స్థలం హైడ్రా దీవి అందచందాలు, కార్ల జాడే లేని ప్రత్యేకత ఎందరెందరో వీఐపీలను ఆకర్షిస్తోంది. అప్పుడెప్పుడో 1950ల్లోనే ప్రముఖ ఇటాలియన్ నటి సోఫియా లారెన్ హైడ్రాలో షూటింగ్ చేసే క్రమంలో ఆ దీవితో ప్రేమలో పడ్డారు. అక్కడే స్థిరపడ్డారు. బ్రైస్ మార్డన్, అలెక్సిస్ వెరోకస్, పనగియోసిస్ టెట్సిస్, జాన్ క్రాక్స్టన్ వంటి ప్రఖ్యాత చిత్రకారుల నుంచి హెన్రీ మిల్లర్ వంటి ప్రముఖ రచయితల దాకా ఎందరెందరో హైడ్రాలో ఆరామ్‌గా జీవిస్తున్నారు. కెనేడియన్ గాయకుడు, పాటల రచయిత లియోనార్డ్ కోహెన్ రాసిన అజరామర గీతం ’బర్డ్ ఆన్ ద వైర్’కు హైడ్రా దీవే స్ఫూర్తి! ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా భూలోక స్వర్గమే అంటారాయన. నేషనల్ డెస్్క, సాక్షి -
అశ్వాలేవీ..? లొట్టిపిట్టలెక్కడ
దేశంలో మొత్తంగా పశు సంపద కొంతమేర పెరిగినా.. ఒంటెలు, గుర్రాల వంటి జంతువుల సంఖ్యలో 9 శాతం క్షీణత నమోదైంది. 2.90 లక్షల గుర్రాలు తగ్గిపోగా.. 1.50 లక్షల ఒంటెలు కనుమరుగయ్యాయి. గాడిదలు, పందుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంకర జాతి పశువుల సంఖ్య 26.9 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 6.60 లక్షల గ్రామాలు.. 89 వేల పట్టణాల్లోని 27 కోట్లకు పైగా గృహాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన 20వ పశుగణన నివేదిక ఈ విషయాల్ని తేటతెల్లం చేసింది. పశుగణన ఏం తేల్చిందంటే.. ► 2012 – 2019 మధ్య మొత్తం పశువుల జనాభాలో 4.6 శాతం పెరుగుదల నమోదైంది. ► దేశంలో ఒంటెలు 84 శాతం రాజస్థాన్‌లో ఉండగా.. 11 శాతం గుజరాత్లో ఉన్నాయి. ► 2012 నుంచి 2019 సంవత్సరం నాటికి దేశంలో ఒంటెల జనాభా 4 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గింది. ► ఇక 2012 నుంచి 2019 మధ్య గుర్రాల సంఖ్య 6.3 లక్షల నుంచి 3.4 లక్షలకు తగ్గింది. ► ఇతర దేశాలకు చెందిన, సంకర జాతి పశువుల జనాభా 2012తో పోలిస్తే 2019లో 26.9 శాతం పెరిగింది. ► 2012తో పోలిస్తే దేశీయ (దేశవాళీ) పశువులలో 6 శాతం క్షీణత ఉంది. ► గత గణనతో పోలిస్తే.. 2019లో దేశంలో మొత్తం పౌల్ట్రీ 851.81 మిలియన్లకు చేరటం ద్వారా 16.8 శాతం వృద్ధి నమోదు చేసింది. ► 2012తో పోలిస్తే 2019 నాటికి దేశంలో పెరటి కోళ్ల పెంపకం 48.8 శాతం పెరిగి.. 317.07 మిలియన్లకు చేరింది. తగ్గుదలకు కారణాలివీ.. ► ఒంటెలు, గుర్రాల సంఖ్య తగ్గిపోవడానికి వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తగ్గటమే కారణమని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ► గతంలో రవాణాకు ఒంటెలను వినియోగించే వారు. ఇది క్రమంగా తగ్గుతోంది. ► రాజస్థాన్‌లో మేత భూములు తగ్గడంతో వాటి పెంపకం కష్టంగా మారింది. ► ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాల పోషణకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. దీంతో వీటి పెంపకం ఆర్థికంగా సాధ్యం కావడం లేదు. ► దేశీయ గుర్రపు జాతులను ఎక్కువగా పోలీస్ సేవలు లేదా వినోదాల కోసమే ఉపయోగిస్తున్నారు. – గుర్రాల పెంపకానికి పేరొందిన గుజరాత్లో తప్ప ఇతర రాష్ట్రాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ► అయితే ఒంటె జాతిని రక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించి పలు రక్షణ చర్యలు చేపట్టింది. అలాగే గుజరాత్ ప్రభుత్వం వాటి రక్షణకు చర్యలు తీసుకుంది. కచ్ ప్రాంతంలో ఒంటె పాల సేకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దేశంలో పశు జనాభా ఇలా.. (మిలియన్లలో) ఏపీలో 15.79 శాతం వృద్ధి రాష్ట్రంలో పశు సంపదలో 15.79 శాతం వృద్ధి నమోదైంది. 2012 పశుగణనలో 2.94 కోట్ల పశు సంపద ఉండగా.. 2019 నాటికి 3.40 కోట్లకు పెరిగింది. పౌల్ట్రీ రంగంలోనూ భారీగా వృద్ధి నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 80.6 మిలియన్ పౌల్ట్రీ జనాభా ఉంటే.. 2019 గణన నాటికి 107.9 మిలియన్లకు చేరింది. అంటే 33.85 శాతం వృద్ధి నమోదైంది. గొర్రెల జనాభాలోనూ 30 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 13.6 మిలియన్లు గొర్రెలు ఉండగా.. 2019 నాటికి 17.60 మిలియన్లకు పెరిగాయి. అయితే గేదెల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012లో 6.50 మిలియన్లు గేదెలుంటే.. 2019 నాటికి 6.20 మిలియన్లకు తగ్గాయి. – సాక్షి, అమరావతి -
అందం హిందోళం.. అధరం తాంబూలం
అందంలో మనకు ఐశ్వర్యరాయ్ ఎలాగో.. ఒంటెల్లో ఇదలాగన్న మాట.. ఖతర్‌లో అటు ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీలు జరుగుతున్న సమయంలోనే ఇటు ఈ ఒంటెల అందానికి సంబంధించిన ప్రపంచ కప్ పోటీలూ జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందమైన ఆడ ఒంటెలు ఈ పోటీల్లో తమ హొయలను ప్రదర్శించాయి. ఈ చిత్రంలోని ఒంటె.. మొదటి స్థానాన్ని గెలుచుకుని.. రూ.44 లక్షల బహుమతిని గెలుచుకుంది. ఇందులో గెలవడం అంత ఈజీ కాదు.. ముందుగా ఈ ఒంటెలకు వైద్యుల పర్యవేక్షణలో ఎక్స్‌రేలు వంటివి తీస్తారు. ఎందుకంటే.. అందాన్ని ఇనుమడింపజేయడానికి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్ ఇంజెక్షన్లు వంటివి వాటికి ఇచ్చారా అన్నది తెలుసుకోవడానికట. సహజ సౌందర్యరాశికే పట్టం కట్టాలన్నది తమ లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. గత పోటీల్లో వైద్య పరీక్షల్లో పట్టుబడిన 47 ఒంటెలపై అనర్హత వేటు వేశారట. పోటీల్లో భాగంగా.. వాటి చెవులు, ముక్కు.. పెదాలు ఇలా అన్నిటినీ నిశితంగా పరీక్షించి.. జడ్జీలు మార్కులేస్తారు. Spectators watch a camel beauty contest in Ash-Shahaniyah, Qatar 📸 @reuterspictures pic.twitter.com/0wQ3WCyQBm — Reuters (@Reuters) November 30, 2022 -
FIFA WC: ఖతర్‌ను కలవరపెడుతున్న 'క్యామెల్ ప్లూ' వైరస్
ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఖతర్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌ను లైవ్‌లో వీక్షించడానికి విశ్వవ్యాప్తంగా 1.2 మిలిమన్ అభిమానులు ఖతర్ వెళ్లినట్లు సమాచారం. వీరంతా తమకు ఇష్టమైన ఫిఫా వరల్డ్‌కప్‌ను ఎంజాయ్ చేస్తూనే అరబ్ దేశాల్లో ఒకటైన ఖతర్ అందాలను వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పరిశోధనా బృందం పెద్ద బాంబు పేల్చింది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్యామెల్ ప్లూ(Camel Flu Virus) అనే వైరస్ కలవరం సృష్టిస్తుందన్నారు. వరల్డ్‌కప్‌ను వీక్షించడానికి వచ్చినవారిలో కొంతమంది అభిమానులు క్యామెల్ ప్లూ వైరస్‌తో భాదపడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. క్యామెల్ ప్లూ వైరస్ అనేది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS) వ్యాధితో బాధపడేలా చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇక క్యామెల్ ప్లూ వైరస్ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమని.. ఈ వైరస్‌ను తొలుత 2012లో సౌదీ అరేబియాలో గుర్తించినట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా దాటికి ప్రపంచంలోని దేశాలన్ని లాక్డౌన్ విధించుకున్నాయి. ఇప్పటికే ఆ మహమ్మారి వదలడం లేదు. మెర్స్ వ్యాధి లక్షణాలు కరోనా లక్షణాలుగానే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోస ఇబ్బంది లాంటి సహజ లక్షణాలతోనే వ్యాధి ప్రారంభమవుతుంది. నుమోనియా లక్షణాలు కూడా దీనిలో అంతర్భాగం. ఈ వ్యాధికి గురైన వారు రోజురోజుకు మరింత వీక్‌గా మారిపోతుంటారు. విరేచనాలు, గ్యాస్ ట్రబుల్‌తో ఇబ్బంది పడుతుంటారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు హెచ్చరించారు. ఇక క్యామెల్ ప్లూ వైరస్ ద్వారా సంక్రమించే మెర్స్ వ్యాధితో మరణాల రేటు 35 శాతం ఉందని హెచ్చరించారు. సాధారణంగా అరబ్ దేశాల్లో ఒంటెలతో అక్కడి జనజీవనం ముడిపడి ఉంటుంది. క్యామెల్ ప్లూ.. పేరులోనే ఒంటె పేరు కనిపిస్తుండడంతో ఈ వైరస్ ఒంటెల ద్వారా సంక్రమిస్తున్నట్లు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యామెల్ రైడ్స్.. సఫారీ ఖతర్ ప్రజలకు జీవనాధారంగా ఉంది. అక్కడికే వచ్చే పర్యాటకులు క్యామెల్ రైడ్స్.. సఫారీ చేస్తుంటారు. క్యామెల్ ప్లూ వైరస్ కారణంగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ చూడడానికి వచ్చే ఫుట్‌బాల్ అభిమానులు ఒంటెలను నేరుగా తాకకూడదని ఇంతకముందే హెచ్చరించారు. ఇది తెలియని కొంత మంది అభిమానులు ఒంటెలను ముట్టుకోవడం.. వాటిపై సఫారీ చేయడం వల్ల క్యామెల్ ప్లూ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. క్యామెల్ ప్లు అనేది జంతువుల నుంచి జంతువులకు.. జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అది నేరుగా లేదా ఇన్‌డైరెక్ట్‌గా వైరస్ అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ఫిఫా వరల్డ్‌కప్ 2022ను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో క్యామెల్ ప్లూ వైరస్ బాధితులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం తమను కలవరపెడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి: FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ? మెక్సికోపై గెలుపు.. షర్ట్ విప్పి రచ్చ చేసిన మెస్సీ -
బాప్రే!...ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!!
Camels get disqualified: ఇటివల కాలంలో మంచి శరీరాకృతికోసం సెలబ్రిటీలు, ప్రముఖులు, అందాల పోటీల్లో పాల్లోనేవారు రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడటం గురించి ఉన్నాం. అంతెందుకు మంచి శారీరక ధారుడ్యం కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి కటకటాల పాలైన వాళ్ల గురించి కూడా విని ఉన్నాం. కానీ అచ్చం అదే తరహాలో సౌదీఅరేబియన్ వాసులు జంతువుల అందంగా ఆకర్షణీయంగా ఉండట కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి వాటిని హింసకు గురి చేశారు. (చదవండి: బిపిన్ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!) అసలు విషయంలోకెళ్లితే...సౌదీ రాజధాని రియాద్‌కు ఈశాన్యంలో ప్రసిద్ధ కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ఏటా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అంతే కాదు ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు రూ. 500 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చి సత్కరిస్తుంది. అయితే నిర్వాహకులు ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఫేస్ లిఫ్ట్‌లు వంటి ఇతర సౌందర్య సాధనాలను వినియోగించుకూడదనే ఒక నియమం విధించారు. ఈ మేరకు ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఒంటెల పోటీల్లో మోసపూరిత చర్యలను అరికట్టే నిమిత్తం అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. దీంతో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు. చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లు నిర్వాహకులు గుర్తించి ఆయా ఒంటెలకు అనర్హత వేటు విధించడమే కాక పెంపకందారులకు కఠిన జరిమాన కూడా విధించినున్నట్లు తెలిపారు. (చదవండి: పక్షిలా షి‘కారు’) -
ఎడారి బాట పట్టిన బడిపంతుళ్లు.. మీ సేవకు సలాం!
జైపూర్: కరోనా మహమ్మారి చాలా రంగాల్లో మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆన్లైన్ క్లాస్‌లు మొదలయ్యాయి. అయితే తాజాగా ఫోన్లు, మొబైల్ నెట్‌వర్క్‌లు లేని విద్యార్థుల కోసం రాజస్థాన్‌లోని ఉపాధ్యాయులు ఎడారి బాట పట్టారు. ఎడారి ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల కోసం బార్మెర్లోని ఉపాధ్యాయులు ఒంటెలపై ప్రయాణించి అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రాజస్థాన్ విద్యా శాఖ డైరెక్టర్ సౌరవ్ స్వామి మాట్లాడుతూ.. “రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థులలో చాలామందికి మొబైల్ ఫోన్లు లేవు. దీంతో ఉపాధ్యాయులు వారానికి ఓసారి 1 నుంచి 8 తరగతులు, వారానికి రెండుసార్లు 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధించాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.” అని అన్నారు. ఇక భీమ్తాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ రూమ్ సింగ్ జఖర్ మాట్లాడుతూ.. "కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సకాలంలో నోట్స్ అందించడానికి కృషి చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల బృందానికి నా వందనం, కృతజ్ఞతలు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి.” అని అన్నారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ ఉపాధ్యాయుల కృషిని చేతులెత్తి వందనం చేస్తున్నాను. వారి కృషి అభినందనీయం.’’ అంటూ కామెంట్ చేశారు. Rajasthan | Teachers in Barmer travel by camel to the homes of students in desert areas or which have limited access to mobile networks. "I salute & thank this team of teachers. This should be continued further," says Roop Singh Jhakad, Principal, Govt Higher Sr School, Bhimthal pic.twitter.com/hLfg0dUnvI — ANI (@ANI) July 9, 2021 -
అన్ని ఒంటెలెలా వచ్చాయి?
సాక్షి, హైదరాబాద్: ఎడారి ప్రాంతం కాని తెలంగాణలోకి 71 ఒంటెలు ఎలా వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒంటెల తరలింపును అడ్డుకోవడంతోపాటు ప్రస్తుతం ఉన్న ఒంటెల సంరక్షణకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలపాలని సర్కారును ఆదేశించింది. ఒంటె మాంసం విక్రేతలపై చర్యలు చేపట్టాలని, ఒంటెలను వధించకుండా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ కె.శశికళ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. రాజస్తాన్ నుంచి ఒంటెలను తరలించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. అక్రమంగా ఇక్కడికి తరలించిన ఒంటెలను సైతం తిరిగి రాజస్తాన్‌కు తరలించామని తెలిపారు. ఒంటెల తరలింపును అడ్డుకునేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కఠిన చర్యలు తీసుకుంటున్నాం.. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయించే వారిపై జీహెచ్ఎంసీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు ఒంటె మాంసం విక్రేతలపై, వాటి మాంసాన్ని అమ్మకుండా తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రంజాన్ మాసంలో ఒక వర్గం ప్రజలు ఒంటె మాంసాన్ని భుజించడం ఆచారంగా వస్తోందని వెటర్నరీ విభాగం డైరెక్టర్ లక్ష్మారెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
ఆ ఒంటెల కథ
అది 1606 సంవత్సరం. డచ్ అన్వేషకుడు విలియమ్ జాన్స్జూన్ మొదటిసారిగా ఆస్ట్రేలియా దేశాన్ని కనుగొన్న యూరోపియన్‌గా చరిత్రకెక్కాడు. అప్పట్లో ఆ దేశంలో ఆయనకి ఒక్క ఒంటె కూడా కనిపించలేదు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం 2020 సంవత్సరం. ఒంటెలతో విసిగి వేసారిపోయిన ఆస్ట్రేలియా వాటిని సామూహికంగా కాల్చి చంపే ఆపరేషన్ చేపట్టింది. అయిదు రోజుల్లోనే 10వేలకు పైగా మూగజీవాలను హెలికాప్టర్ నుంచే కాల్చి చంపేసింది. అసలు ఆ ఒంటెలు ఎలా వచ్చాయి ? ఎందుకు వచ్చాయి ? మెల్బోర్న్: కార్చిచ్చులతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియాలో ఒంటెల హనన కాండ ప్రపంచ దేశాల గుండెల్ని పిండేస్తున్నాయి. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియా తమకు ఈ ఒంటెలు మోయలేని భారంగా మారాయంటూ హెలికాప్టర్ల నుంచి గురి చూసి కాల్చి చంపేస్తోంది. వివిధ దేశాలకు చెందిన జంతు ప్రేమికులు ఆస్ట్రేలియా ప్రభుత్వం చేస్తున్న పనిని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ ఆ దేశం వినిపించుకునే స్థితిలో లేదు. దానికి కారణం ఒంటె అక్కడి స్థానిక జంతువు కాదు. అదీ వలస జంతువే. భారత్ సహా ఎన్నో దేశాల నుంచి ఆస్ట్రేలియా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలనలోనే ఉండేది. అప్పట్లో బ్రిటీషియన్లు తమ రవాణా సౌకర్యాల కోసం ఈ ఒంటెల్ని వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గం ద్వారా తీసుకువచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పొడి వాతావరణం కలిగిన ప్రాంతం. ఆ వాతావరణంలో గుర్రాలు సరిగ్గా పరిగెత్తలేకపోయేవి. కానీ ఒంటెలు అలా కాదు. అలాంటి వాతావరణమే ఒంటెలకు అనుకూలం. అంతేకాదు రెండు, మూడు వారాలు నీళ్లు తాగకపోయినా ఒంటెలు ప్రయాణించగలవు. అందుకే బ్రిటిష్ పాలకులు ఒంటెల్ని తీసుకురావాలని అనుకున్నారు. 18వ శతాబ్దంలో మొదటిసారి భారత్, అఫ్గానిస్తాన్, అరబ్ దేశాల నుంచి ఒంటెల్ని తెచ్చారు. స్థానిక రవాణా అవసరాల కోసం ఒంటెల్ని వినియోగించేవారు. అలా అలా ఆ ఒంటెలు ఆస్త్రేలియన్ల జీవనవిధానంలో ఒక భాగమైపోయాయి. అనూహ్యంగా పెరిగిపోయిన సంతతి 19వ శతాబ్దంలో రవాణా అవసరాల కోసం మోటార్ వాహనాలపై ఆధారపడ్డాక ఒంటెల అవసరం ప్రజలకి తీరిపోయింది. దీంతో వాటిని పెంచడం మానేశారు. ఆ ఒంటెలు చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్లిపోయాయి. ఆస్ట్రేలియా వాతావరణం ఒంటెలు పెరగడానికి అనుకూలంగా ఉండడంతో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. 1969లో కేవలం 20 వేలు మాత్రమే ఉండే ఒంటెలు, 1988 నాటికి 43 వేలకి చేరుకున్నాయి. 2001–08 మధ్య కాలంలో వాటి సంఖ్య ఏకంగా 10 లక్షలకు చేరుకుంది. ఒంటెలు పెరిగిపోతూ ఆహారం కోసం, నీళ్ల కోసం జనావాసాలపై పడడం, పంటపొలాల్ని నాశనం చేస్తూ ఉండడంతో ఆస్త్రేలియా ప్రభుత్వం ఒంటెల్ని చంపే కార్యక్రమం చేపట్టింది. 2012లో ఏకంగా ఏడాదికి 75 వేల ఒంటెల్ని కాల్చేసింది. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఆహారానికి, నీటికి కటకటగా ఉంది. అందుకే వాటిని చంపేయడమే పనిగా పెట్టుకుంది ఆస్ట్రేలియా. అలా వాటి సంఖ్యను తగ్గించుకుం టూ వస్తోంది. పాపం ఆ మూగజీవాలు, అప్పుడెప్పుడో వలస పాలకులు తమ అవసరం కోసం చేసిన పని ఇప్పుడు వాటికి పెనుశాపమైంది. ► ప్రస్తుతం ఒంటెల సంఖ్య: దాదాపు 3 లక్షలు ► ఆక్రమించిన ప్రాంతం: ఆస్ట్రేలియా భూభాగంలో 37 % ► కలిగిస్తున్న నష్టం: పంట పొలాల ధ్వంసం, సాంస్కృతిక, చారిత్రక కట్టడాల విధ్వంసం, ఒంటెల సంతతి పెరిగిపోతూ ఉండడంతో దెబ్బ తింటున్న జీవ వైవిధ్యం ► దేశానికి కలిగిస్తున్న నష్టం: ఏడాదికి కోటి డాలర్ల నష్టం -
నీటి కటకట.. ఒంటెల కాల్చివేత
సిడ్నీ: కరవుతో అల్లాడుతున్న ఆస్ట్రేలియాలో నీళ్లు ఎక్కువగా తాగే పదివేల ఒంటెలను కాల్చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. నీళ్లకోసం వెంపర్లాడుతున్న ఈ మూగజీవాలు గుంపులుగా మానవ ఆవాసాల వద్దకు వచ్చేస్తున్నాయని, ఫలితంగా అక్కడి గిరిజన తెగల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. భారీ సంఖ్యలో ఉండే ఒంటెల మందలు నీటి కోసం వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయని, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా.. ఆహారం, నీళ్లను వాడేస్తున్నాయని దక్షిణ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. ఆస్ట్రేలియాలో కనివినీ ఎరుగని రీతిలో వేడి వాతావరణం కొనసాగుతూండటంతో కొన్ని చోట్ల నీళ్లు అడుగంటిపోయి కార్చిచ్చులు పెచ్చరిల్లిపోతున్న విషయం తెలిసిందే. కరవు కారణంగా జంతువులను రక్షించుకోవడమూ కష్టమవుతోందని నీటికోసం పోటీపడే క్రమంలో కొన్ని ఒంటెలు తొక్కిసలాటలో మరణించగా... మరికొన్ని నీళ్లులేక మరణించాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నిచోట్ల మృతదేహాల కారణంగా తాగునీరు కలుషితమైన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. -
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం
సిడ్నీ : ఆస్ట్రేలియాలో అంటుకున్న కార్చిచ్చు ప్రస్తుతం ఆ దేశాన్ని అతలాకుతులం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలుసా.. అయిదు రోజుల ప్రచారంలో భాగంగా ఆస్ట్రేలియాలోని 10వేల ఒంటెలను చంపాలని నిర్ణయించారు. కాగా బుధవారం నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం కార్చిచ్చుతో పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో వేడిని భరించలేక ఒంటెలు ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నాయి. అందుకే వాటిని చంపేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒంటెలను చంపడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇదే అంశమై అనంగు పిజంజజరా యకుంనిజజరా(ఏపీవై) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ మరీటా బేకర్ స్పందిస్తూ.. ‘కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడిపోతుంది. దీనికి తోడు కార్చిచ్చు ద్వారా వస్తున్న వేడి , అసౌకర్య పరిస్థితులతో కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాము. ఒంటెలు మా కంచెలను పడగొట్టి ఇళ్ళలోకి ప్రవేశించి విచ్చలవిడిగా నీరు తాగడంతో పాటు ఏసీలను పాడు చేసి అందులోని నీటిని తాగుతూ తమ దాహర్తిని తీర్చుకొని వెళ్లిపోతున్నాయి. ఈ సమయంలో ఒంటెలు విడుస్తున్న వ్యర్థాల వల్ల వచ్చే దుర్వాసనను మేము భరించలేకపోతున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.(కార్చిచ్చు ఆగాలంటే.. వర్షం రావాల్సిందే) గత నవంబర్‌లో కార్చిచ్చు అంటుకొని ఆస్ట్రేలియాలో పరిస్థితి అతలాకుతులమయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు కనీస నీటి అవసరాలు మిగల్చకుండా ఇళ్లపై దాడి చేస్తూ ఒంటెలు నీళ్లు తాగుతున్నాయి. అందుకే చట్ట బద్ద ప్రణాళికంగానే 10వేల ఒంటెలను చంపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపానికి 12 మందికి పైగా తమ ప్రాణాలు పోగొట్టుకోగా, 480 మిలియన్ల జంతువులు కార్చిచ్చుకు బలైనట్లు తమ పరిశోధనలో తేలిందని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశధకులు అభిప్రాయపడ్డారు. -
మూపురాల జాతర
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఒంటెల సంతతి పెరుగుతూ ఉంటే ఒక్క భారతదేశంలో తరుగుతూ ఉంది. ప్రమాదకరమైన ఈ పరిణామం మధ్య ఈసారి పుష్కర్‌లో జరుగనున్న ప్రపంచ ప్రఖ్యాత ‘ఒంటెల మేళా’ ఒంటెల గురించి కాసింతైన స్పృహను కలిగించాల్సిన అవసరం ఉంది. ఊళ్లోకి ఏనుగు వచ్చినా ఒంటె వచ్చినా పిల్లలకు వింత. పెద్దలకు సరదా. రెండూ మన ప్రాంతంలో విస్తృతంగా కనిపించే జంతువులు కావు. ఒంటె ఎడారి జంతువు. అందుకే దానిని ఎడారి ఓడ అంటారు. ‘లొటిపిట్ట’ అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రాజస్థాన్‌లో ఒంటె లేకుండా సామాన్య జీవనం జరగదు. ఒక అంచనా ప్రకారం దేశంలోని ఎనభై శాతం ఒంటెలు రాజస్థాన్‌లోనే ఉన్నాయి. అందుకే అక్కడ ఒంటెను ఇక్కడ ఎద్దులా ఇంటి పశువు అనుకుంటారు. కుటుంబంలో భాగం చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి పుష్కర్‌లో మహా మేళా నిర్వహించి ఒంటెల కొనుగోలు, అమ్మకం జరుపుకుంటారు. కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ మేళా జరుగుతుంది. ఈసారి ఈ మేళా నవంబర్ 5 నుంచి 12వ తేదీ వరకు జరుగుతోంది. తరలి వచ్చే సంచారజాతులు సంవత్సరం పొడవునా ఒంటెలను మేపుతూ ఎడారుల్లో తిరిగే, చిన్న చిన్న ఆవాసాల్లో నివసించే సంచార జాతులవారు పుష్కర్ మేళా కోసం వేచి చూస్తారు. తేదీలు దగ్గర పడగానే తమ వద్ద ఉన్న ఒంటెలను తీసుకొని, కుటుంబాలతో, వంట సామాగ్రితో, గుడారాలతో పుష్కర్ మేళాకు తరలి వస్తారు. వీరు తమను తాము ఒంటెలకు బంట్లుగా భావిస్తారు. శివుడు ఒంటెలను చూసుకోమని తమను పుట్టించాడని వీరి విశ్వాసం. పుష్కర్ రాజస్థాన్‌లో ఉన్న ముఖ్య పుణ్యక్షేత్రం. పంచ సరోవరాల్లోని ఒకటైన ‘పుష్కర్ సరోవరం’ ఈ పట్టణంలోనే ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఈ సరోవరంలో భక్తులు విశేషంగా పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా వచ్చిన పర్యాటకలు ఒంటెల మేళాను కూడా ఉత్సాహంగా వెళ్లి తిలకిస్తారు. పుష్కర్ అజ్మీర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆరావళి పర్వతాల పహారా కాస్తుంటే ఈ ఊరు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక మేళా జరుగుతున్న రోజుల్లో అయితే దేశ,విదేశ పర్యాటకులతో కళకళలాడిపోతుంది. అనేక రకాలు ఎద్దుల్లో, గేదెల్లో రకాలు ఉన్నట్టే ఒంటెల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వాటి విలువ ఉంటుంది. మనం ఒంటెలన్నీ ఒకటే అనుకుంటాం కానీ కాదు. అందంగా నాజూకుగా తెలివిగా ఉండే ‘సాచోరి’ జాతి ఒంటె ఒక్కోటి లక్షన్నర పలుకుతుంది. ఇది వ్యవసాయానికి, బండి లాగడానికి, నృత్యానికి పనికి వస్తుంది. ఇక బరువులు మోసే జాతి అయిన ‘బాడ్మెరి’ ఒక్కోటి యాభై వేలు పలుకుతుంది. రేసులలో గెలవాలంటే మాత్రం ‘జైసల్మేరి’ జాతికి చెందిన ఒంటె తప్పని సరి. దీని వెల ముప్పై వేల నుంచి మొదలవుతుంది. పుష్కర్ మేళాలో వీటిని వేలాదిగా తీసుకొచ్చి అమ్మడం, కొనడం చేస్తారు. ఇవి కాకుండా ‘గీర్’ అని, ‘నాగేరి’ అని అనేక రకాలు ఉన్నాయి. తరుగుతున్న సంఖ్య ప్రపంచ దేశాలలో పోలిస్తే మన దేశంలో ఒంటెల సంఖ్య దారుణంగా పడిపోతోంది. దీనిని గమనించి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెల కాపరులకు ప్రతి ఒంటె పిల్ల జననానికీ పది వేల రూపాయల నజరానా ప్రకటించింది. ఒంటెల పెంపకం, మేత కష్టంతో కూడుకున్న పని. ఒంటెల సంతతి ఒంటెల కాపరుల మీద ఆధార పడి ఉంటుంది. జానా బెత్తెడుగా ఉన్న కాపరి వృత్తి నుంచి క్రమంగా చాలామంది తప్పుకుంటూ ఉండటంతో సంతతి పడిపోతోంది. ఒంటె పాల అమ్మకాల గురించి చేసిన ప్రయత్నాలు కూడా అంతంత మాత్రం ఉండటం మరో కారణం. తప్పనిసరిగా చూడాల్సిన వేడుక ఈ సమస్యలు ఎలా ఉన్నా జీవితంలో ఒక్కసారైనా ఈ ఒంటెల మేళాను చూడాలి. వేలాదిగా ఉండే ఒంటెల సౌందర్యం, వాటి అలంకరణ, వాటి సవారి చూడతగ్గవి. పర్యాటకుల ఆకర్షణ కోసం అక్కడ ప్రభుత్వం అనేక కళా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీ వరకు ఈ మేళా జరుగనుంది కనుక ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేసుకొని వెళ్లి చూసి రావచ్చు. ఆంజనేయ స్వామి వాహనం ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం అరుదు. కాని అది ఆంజనేయస్వామి వాహనం అని నమ్మే వారున్నారు. దానికి కథ కూడా ఉంది.రావణుని బావమరిది దుందుభిని వాలి వధించి అతడి మృతదేహాన్ని రుష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని ఇది చూసి వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి వాలి చంపడానికి వెంటపడినప్పుడు సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. అందుకు సుగ్రీవుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం. -
మనిషెందుకు ఇలా చేస్తాడు?!
తల్లి ఒంటె, పిల్ల ఒంటె విశ్రాంతిగా ఉన్నాయి. ‘‘అమ్మా.. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా?’’ అంది పిల్ల ఒంటె. ‘‘తప్పకుండానమ్మా... అడుగు, చెప్తాను’’ అంది తల్లి ఒంటె. ‘‘వీపు పైన మనకు ఎందుకిలాగా ఉంది?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘దీన్ని మూపురం అంటారు. ఇందులో నీళ్లు నిలువ ఉంటాయి. అవసరం అయినప్పుడు వాటితో దాహం తీర్చుకోవచ్చు. ఎడారిలో నీళ్లు దొరకవు కాబట్టి దేవుడు మనకు ఈ ఏర్పాటు చేశాడు’’అని చెప్పింది తల్లి ఒంటె. ‘‘మరి మన కాళ్లు ఎందుకు ఇంత పొడవుగా, పాదాలు ఇంత గుండ్రంగా ఉన్నాయి?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘ఎడారిలో నడిచేందుకు వీలుగా దేవుడు మనకీ ఏర్పాటు చేశాడమ్మా.’’ అని చెప్పింది తల్లి ఒంటె. ‘‘మరి కనురెప్పలు ఎందుకమ్మా ఇంత పెద్దవిగా ఉన్నాయి?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘ఎడారి గాలుల నుంచి, ఇసుక తుపాన్ల నుంచీ ఈ కనురెప్పలు మన కళ్లను, చూపును కాపాడేందుకు దేవుడు మనకీ ఏర్పాటు చేశాడమ్మా..’’ అని చెప్పింది తల్లి ఒంటె. పిల్ల ఒంటె అలా ఒక్కో ప్రశ్నా అడుగుతుంటే తల్లి ఒంటె ఉత్సాహంగా సమాధానాలు చెబుతోంది. పిల్ల ఒంటె కొద్దిసేపు మౌనంగా ఉండి, మళ్లీ ఒక ప్రశ్న అడిగింది. ‘‘ఎడారిలో జీవించడానికి కదా అమ్మా.. దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు. మరి ఇక్కడ ఎందుకున్నాం.. ఈ ‘జూ’ లో..’’ అని అడిగింది పిల్ల ఒంటె. తల్లి ఒంటె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. పిల్ల ఒంటెను దగ్గరకి తీసుకుని హత్తుకుంది. ‘దేవుడు అలా చేస్తే, మనిషి ఇలా ఎందుకు చూస్తాడో’ అనుకున్నట్లుగా ఆలోచనలో పడిపోయింది. నేర్పు, నైపుణ్యం, తెలివి, అనుభవం.. ఇవన్నీ అనువైన చోట మాత్రమే ఉపయోగపడతాయి. అనువుకాని చోట వాటి వల్ల ప్రయోజనం ఉండదు. -
ఒంటెలతో సరిహద్దు పహారా!
సాక్షి, చండీగఢ్ : లడఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అరికట్టేందుకు భారత్ మరో వ్యూహాత్మక ప్రయోగానికి తెరతీస్తోంది. లడఖ్ నియంత్రణ రేఖనుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నాలు గతంలో అధికంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. ఆ ప్రాంతంలో ఒంటెలను గస్తీ కోసం ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరిహద్దుల్లో పహారాతో పాటూ, సైనికులకు ఆయుధాలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఈ ఒంటెలను ఆర్మీ ఉపయోగించుకోవాలని యోచన చేస్తోంది. ప్రయోగాత్మక దశలో రెండు మూపురాలున్న ఒంటెలను ఇందుకు వినియోగించుకోవాలని ఆర్మీ నిర్ణయం తీసుకుంది. రెండు మూపురాలున్న ఒంటెలు అలవోకగా 180 నుంచి 200 కిలోల బరువును మోసుకెళ్లగలవు. అంతేకాక ఇవి రెండుగంటల వ్యవధిలో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని అనాయాసంగా ప్రయాణించగలవు. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే సైన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన జంతువులకన్నా.. రెండు మూపురాలున్న ఒంటెలు ఎడారిలో అత్యంత వేగంగా ప్రయాణించగలవు. ఇదిలావుండగా.. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా సైన్య శిక్షణ ఇస్తుందని తెలుస్తోంది. అంతేకాక సైన్యంలోని వివిధ అవసరాలకు ఒంటెలను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. -
ఒంటెలు సరఫరా చేస్తుందెవరు..?
ప్రజలు మాంసాహారం తీసుకోవడాన్ని బాగా ఇష్టపడుతున్నారు. ప్రజల డిమాండ్‌కి తగినట్లుగా స్థానికంగా మాంసం లభించకపొవడంతో ఆ వ్యాపారం చేసే వారు.. అక్రమ పద్ధతుల ద్వారా మాంసం సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన మాంసాన్ని స్టార్ హోటల్స్, రెస్టారెంట్లతో పాటు మాంసం ప్రియులకు వివిధ రకాల జంతువుల పేర్లు చెప్పి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాధిస్తున్నారు. గతంలో అడవి పందులు, జింకలను కొసి విక్రయించే వ్యాపారులు డిమాండ్ పెరగడంతో భారీ జంతువులపై కన్నెశారు. మునుగోడు : భారీ జంతువుల్లో ఒకటైన ఒంటెని కొస్తే అధిక మొత్తంలో మాంసం వస్తుందని వ్యాపారులు భావించారు. ఎడారి ప్రాంతాలైయినా హర్యానా, గుజరాత్, రాజాస్థాన్ ప్రాంతాల నుంచి వయస్సు మీదపడిన ఒంటెలను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి మాంసంగా మార్చుతున్నారు. ఒంటెలను అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రవాణా చేస్తున్నారు. ఎంతకు విక్రయిస్తున్నారు.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఉన్నా అవి ఎలా హైదరాబాద్‌కి వస్తున్నాయనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఊకొండిలో ఒంటెలను కొస్తూ పట్టుబడిన దుండగులు సైతం ఆ ప్రాంతాలకు వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి ఫోన్లలో బేరాలు చేసుకుని.. డబ్బు ఆన్లెన్ ద్వారా వారి ఖాతాల్లో జమచేసి ఒంటెలు తీసుకుంటున్నట్లు సమచారం. కానీ ఈ దందా ఎప్పటి నుంచి సాగుతోంది.. అలా అమ్మేవాళ్లు ఎవరు.. అనే విషయాలను పోలీసులు రాబట్టలేక పోయారు. పోలీసులు లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మాంసం విక్రయించేదెక్కడో? ఒక ఒంటెను కోస్తే 350 నుంచి 400ల కేజీల మాంసం వస్తుంది. ఇక్కడ ఒకేసారి 25 నుంచి 30కిపైగా ఒంటెలను కోస్తుండడంతో దాదాపు 10 నుంచి 15 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుంది. ఈ మాంసాని ఎక్కడా విక్రయిస్తారు. ఎంతకు విక్రయిస్తారనేది ఇప్పటికీ తేలలేదు. హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు నిందితులు చెబుతున్నా అందులో నిజం లేదనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఒకే రోజు 10 టన్నుల మాంసాని విక్రయించడం చాలా కష్టం. ఆ మాంసం మొత్తం ఇతర రాష్ట్ర, దేశాలకు సరఫరా చేస్తున్నారనే.. ఆరోపణలు అనేకం ఉన్నాయి. మాంసాన్ని ఎక్కడకు సరఫరా చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారనే విషయంపై విచారిస్తే.. వ్యాపారంలో ఉన్న బడా బాబుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒంటెల సరఫరా, మాంసం విక్రయంపై నిఘా పెడితే దందా గుట్టు రట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25మంది రిమాండ్ మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో ఒంటెల వధ కేసులో 25మందిని స్థానిక పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చండూరు సీఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరబాద్‌కు చెందినా మహ్మ ద్ ఖాజ కురేష్, అబ్జల్ కురేష్లు..పశుమాంసం వ్యాపారులు. ప్రస్తుతం ఒంటె మాంసానికి బాగా డిమాండ్ ఉండటంతో వాటిని అప్పుడప్పుడు కొస్తూ ఉండేవారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒంటెల మాంసం విక్రయాలపై పోలీసులు దాడులు చేయడంతో..సదరు వ్యాపారులు మునుగోడుకు చెందిన మాంసం వ్యాపారి ఖయ్యూంతో పరిచయం ఏర్పర్చుకున్నారు. ఒంటెలను కోసేందుకు నిర్మానుష్యమైన వ్యవసాయ భూమి కావాలని అడగగా, ఊకొండి గ్రామానికి చెందినా మాజీ సర్పంచ్ నిమ్మ ల స్వామిని సంప్రదించాడు. అతను తన భూమిని నెలకు రూ.2500 చొప్పున లీజుకు ఇచ్చాడు. దీంతో వ్యాపారులు బుధవారం రాత్రి 28 ఒంటెలని తీసుకొని ఊకొండికి వచ్చారు. వాటిని కోసేందుకు 19 మంది కూలీలను వెంటతెచ్చుకున్నారు. ఒంటెలను కోస్తుండగా గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారించి శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. -
మూడు పంది పిల్లలు – తోడేలు
అనగనగా ఒక అడవి. అడవి ప్రక్కన ఒక గ్రామం. ఆ గ్రామంలో మూడు పంది పిల్లలు వాళ్ళ అమ్మనాన్నలతో హాయిగా జీవించేవి. అవి పెద్దవయ్యాక వాళ్ళ ఇల్లు సరిపోకపోవడంతో తల్లిదండ్రులు వాటిని వేరేగా మంచి ఇల్లు కట్టుకుని ఉండమన్నాయి. అప్పుడవి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళాయి. ఒక రావి చెట్టు దగ్గర మంచి ప్రదేశం చూసుకున్నాయి. అక్కడ ఇల్లు ఎలా కట్టుకోవాలా అనుకుంటుండగా ఆ దారినే పోతున్న ఒక ఒంటె ఈ పంది పిల్లలని చూసి సంగతేంటని అడిగింది. ‘‘మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఇల్లు దేనితో కట్టుకోవాలో తెలియడంలేదు’’ అన్నాయవి. అప్పుడా ఒంటె ‘‘ఏమీ దిగులు పడకండి. నాకు ఇటుకల బట్టీ ఉంది. బాగా కాల్చిన ఇటుకలు ఇస్తాను. వాటితో కట్టుకోండి’’ అంది. అవి ఒంటెకి ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి కావలసినన్ని ఇటుకలు తెచ్చుకుని, ఇల్లు కట్టుకుని అక్కడ ఉండసాగాయి. ఒకరోజు ఈ మూడు పందులని గమనించిన ఒక తోడేలు ఎలాగైనా వాటిని పట్టి తినాలనుకుంది. అది పందులున్న ఇంటి దగ్గరకొచ్చి ‘‘ఏయ్, మురికి పందులూ, నన్ను లోపలకి రానివ్వండి’’ అంది. ‘‘నిన్ను మేము రానివ్వం. రానిస్తే మమ్మల్ని తింటావని మాకు తెలుసు’’ అన్నాయి పందులు. ‘‘మీరు రానివ్వకపోతే మీ ఇల్లు ఊదేస్తాను, ఇంటిని పీకేస్తాను, మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’‘ అని అరిచాయి లోపల నుండి పందులు. తోడేలు ‘హఫ్, హుఫ్, హఫ్, హుఫ్’ అని ఊదింది. ఇటుకలని పీకడానికి ప్రయత్నించింది. ‘‘అబ్బ! ఈ ఇల్లుగట్టిగా ఉందే’’ అని, ‘‘సరే ఇçప్పుడు చీకటి పడింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం సుత్తితో వస్తాను. తలుపు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంటూ వెళ్ళిపోయింది. ‘‘వద్దు, వద్దు. మా ఇంటినేం చేయొద్దు’’ అరిచాయి పందులు. తెల్లవారింది. మూడు పందులకి ఏం చేయాలో పాలుపోక ఏడుçస్తూ కూర్చున్నాయి. అప్పుడు ఆ దారిలో పోతున్న నిప్పు కోడి విషయం తెలుసుకుని.. ‘‘ఏడవకండి, నా దగ్గర పట్టుకుంటే షాక్కొట్టే తాళాలు ఉన్నాయి. వాటిని బిగించండి. ఆ తోడేలు వచ్చినప్పుడు స్విచ్ వేయండి. పట్టుకుంటే షాక్కొట్టి అల్లంత దూరాన పడుతుంది. ఇక మీ జోలికిరాదు’’ అంది. మూడు పందులూ నిప్పుకోడికి కృతజ్ఞతలు చెప్పుకుని కరెంటు తాళాలు తెచ్చి తలుపులకు బిగించాయి. సాయంత్రమైంది. సుత్తితో తోడేలు వచ్చింది. ‘‘ఏయ్, మురికి పందులూ.. మీ తాళాన్ని పీకేస్తాను, తలుపులని పగలగొట్టి, లోపలకొచ్చి మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’’ అని అరిచి గబగబా స్విచ్చి వేశాయి. స్విచ్చి వేయగానే తాళాలన్నీ ఎర్రగా మండసాగాయి. తోడేలు సుత్తి తీసుకుని తాళం పగలగొట్టబోయింది. షాక్కొట్టి ఎగిరి అవతలపడింది. ‘‘ఓ, కరెంటు తాళాలు వేశారా, సరే రేపు వస్తాను, డ్రిల్లింగ్ మిషిన్ తెస్తాను, తాళాలు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంది కోపంగా. ‘‘వద్దు, వద్దు.’’ అరిచాయి పందులు. తెల్లవారింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాయి పందులు. అప్పుడా దారిలో పోతున్న సీతాకోకచిలుకల గుంపు ఈ పందుల దగ్గర వాలి ‘‘ఎందుకేడుస్తున్నారు?’’ అని అడిగాయి. విషయం చెప్పగానే ‘‘మేము చెప్పినట్లు చేయండి. ముందుగా అదిగో ఆ ప్రక్కనున్న చెరువులో స్నానం చేసిరండి’’ అంది ఒక తెల్లని సీతాకోకచిలుక. అవి స్నానం చేసి వచ్చాయి. ‘‘ఇంటి ముందు పూల చెట్లతో అలంకరించండి’’ అన్నాయి ఎరుపు, నలుపు, నీలం రంగు సీతాకోక చిలుకలు. మూడు పందులూ గబగబా రకరకాల రంగుల పూల చెట్లను తెచ్చి నాటాయి. ‘‘ఇంటిపైకి పాకేలా పూల తీగలని నాటండి’’ అన్నాయి పసుపు సీతాకోక చిలుకలు. పందులు పూల తీగలను తెచ్చి ఇంటి పైకి పాకించాయి. ఇల్లు అందంగా తయారయింది. ‘‘ఆహా! మీ ఇల్లు ఎంత బాగుంది?’’ అంటూ సీతాకోక చిలుకలన్నీ ఇంటి ముందు పుప్పొడితో రంగవల్లులు వేసి వెళ్ళిపోయాయి. పందులు సీతాకోక చిలుకలకి వీడ్కోలు పలికాయి. ‘‘ఆహా! మన ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకున్నాయవి. అలిసిపోయిన అవి హాయిగా పడుకుని నిద్రపోయాయి. సాయంత్రమయింది. తోడేలు డ్రిల్లింగ్ మిషెన్తో వచ్చింది. ‘‘పందులుండే ఇల్లు ఇది కాదే, దారితప్పానా?’’ అనుకుంది. సరిగ్గా చూసింది. ‘‘ఆహా! ఇదే కాని ఈ ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకుంటూ వచ్చి ‘‘పందులూ, శుభ్రంగా ఉన్న పందులూ మీ ఇల్లు ఎంత బాగుంది, ఎంత సువాసనగా ఉంది? నన్ను లోపలకి రానివ్వండి’’ అని చిన్నగా అడిగింది. ‘‘రానిస్తాం, కాని నువ్వు మమ్మల్ని ఎందుకు తినాలనుకుంటున్నావ్? మా దగ్గర బోలెడన్ని దుంపలు, తేనె ఉంది. నీకు అవి ఇస్తాం. నువ్వు మాతో స్నేహం చేస్తే నీకు చాలా ఆటలు కూడా నేర్పుతాం!’’ అన్నాయవి. ‘‘ఓ! అలాగే, నేను మీతో స్నేహం చేస్తాను. మీరు పెట్టినవే తింటాను, మీతో ఆటలాడతాను, లోపలకి రానివ్వండి. మీ ఇంటిని చూస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని తింటానని బెదిరించినందుకు క్షమించండి’’ అంది తోడేలు. ‘‘ఇప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము’’ అంటూ పందులు తలుపు తీశాయి. తోడేలు లోపలకి వెళ్ళింది. శుభ్రంగా ఉన్న పందులనీ, ఇంటినీ చూసి చాలా ఆనందపడింది. అన్నీ చక్కగా చేతులు కడుక్కుని దుంపలుతిని, తేనెని తాగాయి.ఇంటి వెనుకనున్న తోటలో అవన్నీ కలసిమెలసి సంతోషంగా ఆటలాడుకున్నాయి. రావిచెట్టు మీద వాలి ఇదంతా చూస్తున్న సీతాకోక చిలుకలు కిలకిలా నవ్వాయి. – రాధ మండువ -
ఒంటెపై కాలు వేసి తొక్కి..
సాక్షి,సిటీబ్యూరో: రాజస్థాన్ నుంచి వచ్చిన యువకులు.. తమతో తీసుకు వచ్చిన ఒంటెలకు ముకుతాడు వేస్తున్న దృశ్యం. ఈ మూగజీవి మెడపై కాలు వేసి తొక్కి.. ముకుతాడు వేయడాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించాయి. గుడిమల్కాపూర్‌లో ఈ చిత్రం ‘సాక్షి కెమెరాకు చిక్కింది. - చిత్రం: అనిల్ కుమార్ -
రాజస్థాన్ లో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు!
జైపూర్: ఇక రాజస్థాన్ రాష్ట్రంలో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు లభించనుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర జంతువుగా కృష్ణజింక ఉండగా, ఒంటెను కూడా అదే జాబితాలో చేర్చారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా ఒంటెకు గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒంటెలను మాంసం కోసం వధిస్తూ ఉండడం, అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండడంతో ఆ జాతి సంతతి క్రమేపీ తగ్గిపోతోంది. దీంతో వాటిని పరిరక్షణకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత జూలై నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో థార్ అడవిల్లో కనిపించే ఒంటెలను క్రమేపీ వేరే ప్రాంతాలకు తరలిస్తుండటంతో ఆ జాతి మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది. -
అరణ్యం: ఒంటెకు చెమట పడుతుందా?
ఒంటెలు నీళ్లు తాగకుండా రెండు నెలల వరకూ ఉండగలవు. అయితే నీరు కనుక దొరికితే ఇవి ఒక్కసారి దాదాపు ఏడు లీటర్ల నీటిని తాగేస్తాయి! ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటెలకు చెమట పట్టదు. ఒంటెలు తమ కడుపులో ఉండే సంచిలో నీటిని నిల్వ చేసుకుంటాయని, అందువల్లే కొన్నాళ్ల పాటు నీళ్లు లేకపోయినా ఉండగలుగుతాయని, ఎంతటి వేడిమినైనా తట్టుకుంటాయని అనుకుంటూ ఉంటారు. అది ఎంతమాత్రం నిజం కాదు. ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉంటుంది. ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది! ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమే. ఎందుకంటే, ఒంటె కాళ్లు చాలా బలంగా ఉంటాయి. పైగా అది నాలుగు కాళ్లతోనూ తన్నగలదు! ఇసుక తుఫాన్ల సమయంలో కూడా ఒంటెలు స్పష్టంగా చూడగలుగుతాయి. ఎందుకంటే వాటి కనురెప్పలు రెండు పొరలుగా ఉంటాయి. అవి కళ్లను కాపాడతాయి. ముక్కు రంధ్రాల నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుకోగలిగేట్లుగా ఉంటుంది కాబట్టి వాటికి ఏ ఇబ్బందీ ఉండదు! శత్రువులు దాడి చేసినప్పుడు ఒంటెలు మొదట చేసే పని... ఉమ్మడం! ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఊస్తాయివి. ఆ జిగురును వదిలించుకోవడం, ఆ వాసనను భరించడం చాలా కష్టం! ఈ గుర్రం నిజంగా లేదా? మిస్టర్ ఎడ్... ఇది ఓ గుర్రం పేరు. నిజానికి ఆ గుర్రం నిజంగా లేదు. వాల్టర్ ఆర్ బ్రూక్స్ కథల్లో మాత్రమే ఉంది. అది మాట్లాడుతుంది. సాహసాలు చేస్తుంది. వాల్టర్ దాని పాత్రని ఎంత బాగా తీర్చిదిద్దాడంటే... చదివినవారంతా ఎడ్ నిజంగానే ఎక్కడో ఉందనుకున్నారు. ఆ కథల ఆధారంగా టీవీ సీరియళ్లు, సినిమాలు కూడా రావడంతో... ఎడ్ పాత్ర కాదు, ప్రాణమున్న జీవి అని అందరూ ఓ వింత నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. తెరమీద కనిపించిన గుర్రం ఎడ్ అని, అది నిజంగానే మాట్లాడుతోందని అనుకున్నారు. కొందరైతే దాన్ని చూడాలని ఆయా ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్లిపోయారట కూడా. ఇప్పటికీ చాలామంది ఎడ్ అనే గుర్రం ఉండేదనే అనుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు... ఆ పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో! కొరికి చంపేస్తుంది! చేపలకు ముళ్లుంటాయని తెలుసు కానీ, ఇంతింత పళ్లుంటాయా? ఎందుకుండవూ... పిరానా జాతి చేపలకు ఉంటాయి. దక్షిణ అమెరికాలోని మంచి నీటి చెరువుల్లో ఉంటాయి పిరానాలు. వీటికి ఏ జీవి అయినా దొరికిందా... క్షణాల్లో హాం ఫట్ అయిపోవాల్సిందే! వీటికి ఆకలి చాలా ఎక్కువ. గంటకోసారయినా ఆహారం కావాలి. అందుకే ఏదైనా కనబడితే పళ్లతో కొరికి చంపి తినేస్తాయి. ఇవి కనుక గుంపుగా దాడి చేస్తే, అవి చేసే గాయాలకు ఎంతటి పెద్ద జీవి అయినా విలవిల్లాడాల్సిందే. అందుకే వీటిని అత్యంత ప్రమాదకరమైన చేపగా పేర్కొంటారు జీవ శాస్త్రవేత్తలు. మరో విషయం ఏమిటంటే... రెండు పిరానా చేపల్ని ఓ చోట ఉంచితే అవి రకరకాల శబ్దాల ద్వారా కబుర్లు చెప్పేసుకుంటాయని పరిశోధనలో తేలింది!