ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్‌ ఏకంగా.. | This Is The Worlds Most Expensive Fabric One Meter Piece Will | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్‌ ఏకంగా..

Published Wed, Nov 13 2024 1:31 PM | Last Updated on Wed, Nov 13 2024 7:03 PM

This Is The Worlds Most Expensive Fabric One Meter Piece Will

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్‌ గురించి విన్నారా..?. ఈ ఫ్యాబ్రిక్‌ ఒక మీటర్‌ ఖరీదే దాదాపు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. ఇది మార్కెట్‌లో దొరకడం కూడా కష్టమే. ఖరీదు కూడా కళ్లు చెదిరే రేంజ్‌లో ఉంటుంది. ఏంటి ఈ ప్యాబ్రిక్‌ విశిష్టత..?. ఎందుకంత ఖరీదు అంటే..

ఈ ఫ్యాబ్రిక్‌ ఉన్నిని దక్షిణ అమెరికాలోని ఆండిస్‌ పర్వతాల్లో ఉండే వికునా అనే ఒక విధమైన ఒంటె నుంచి సేకరిస్తారట. అందువల్లే ఈ ఫ్యాబ్రిక్‌ని వికునా అని పిలుస్తారు. దీనితో టానీ అనే కోటులు డిజైన్‌ చేస్తారట. ఏదో గొర్రెల మాదిరి పెంపుడు జంతువుగా ఈ ఒంటెలను పెంచడం సాధ్యం కాదట. అలాగే ఈ ఒంటె నుంచి ఉన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సేకరించగలరట.

అలాగే ఇవి తక్కువ ఉన్నినే ఉత్పత్తి చేస్తాయట. ఆండియాన్‌ ఎత్తైన పర్వతాల్లో ఉండే చలి నుంచి రక్షణగా ఆ ఒంటెలపై ఈ మృదువైన ఉన్ని ఉంటుందట. ఇది గాలిని ఏ మాత్రం చొరబడనీయకుండా శరీరానికి హత్తుకుపోయేల వెచ్చగా ఉంచుతుందట. అలాగే వికునాల నుంచి ఉన్నిని సేకరించడానికి చాలా సమయం పడుతుందట కూడా. అత్యంత జాగ్రత్తలు తీసుకుని చాలా ఓపికతో ఆ జంతువు నుంచి ఉన్నిని సేకరించాలని ఫ్యాషన్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఎవరు ధరిస్తారంటే..
రాయల్టీకి చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్‌ని ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు ధరిస్తారు. అయితే ప్రస్తుతం స్పానిష్‌ ఆక్రమణతో ఈ జంతువుల అంతరించిపోయే జంతువులు జాబితాలో చేరిపోయిందని చెబుతున్నారు ప్యాషన్‌ నిపుణులు. అదీగాక ఈ జంతువుల పెంపకం సాధ్యం కానీ పని అయితే వాటి నుంచి ఉన్నిని సేకరించడం అనేది కూడా అత్యంత క్లిష్టమైన పని అందువల్లే ఈ ఉన్ని ఒక మీటరు ముక్క ధర సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందని చెబుతున్నారు ఫ్యాషన్‌ ఔత్సాహికులు.

ఇప్పటి వరకు అత్యం లగ్జరియస్‌ ఫ్యాబ్రిక్‌లు అయిన మెరినో, కష్మెరె వంటి ఉన్ని దుస్తులు కంటే ఇదే అత్యంత ఖరీదైనది. అయితే మెరినో, కష్మెరె వంటివి అందుబాటులో ఉన్నంత ఈజీగా ఈ వికునా ఫ్యాబ్రిక్‌ ఉన్ని దొరకడం బహు కష్టం. ఈ ఉన్నితో చేసిన కోటు ధర రూ. 17 లక్షలకు పైనే ఉంటుందట. లోరో పియానా, బ్రియోని, కిటాన్‌తో సహా పలు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ హౌస్‌ల్లో ఈ వికునా కలెక్షన్స్‌ ఉంటాయట.

(చదవండి: మిసెస్‌ ఆసియాకు భారత్‌ తరపున మన హైదరాబాదీ..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement