చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. గుడ్లతో ప్రతీరోజూ వంటకాలు చేసుకునేవారు ఉన్నారు. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? వాటికి అంత ధర ఎందుకు ఉంటుందో తెలిస్తే ఎవరూ ఒక పట్టాన నమ్మలేరు.
ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా తినే ఆహారాలలో గుడ్డు ఒకటి. సాధారణంగా అందరూ తెల్లని గుడ్లు తింటారు. వీటి ధర రూ.5 నుంచి రూ.10 మధ్య ఉంటుంది. అయితే కాస్త డబ్బులు అధికంగా ఉండేవారు దేశీ గుడ్లను తింటుంటారు. ఇవి కాస్త గులాబీరంగులో ఉంటాయి. వీటి ధర రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. మరికొందరు వివిధ పక్షుల గుడ్లను కూడా తింటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు.. రోత్స్‌చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ గుడ్లు. ఈ గుడ్డు ధర రూ. 9.6 మిలియన్ డాలర్లు. దీని ధర భారత కరెన్సీలో చూస్తే రూ. 78 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వికీపీడియాలోని సమాచారం మేరకు ఈ గుడ్డుపై పూర్తిస్థాయిలో వజ్రాలను పొదిగారు. ఇది బంగారు కవర్ కలిగివుంటుంది. అయితే ఈ గుడ్డు తినేందుకు కాదు. అలంకరణ కోసం తీర్చిదిద్దారు. పైగా ఇది ఆర్టిఫిషియల్ గుడ్డు.
ఖరీదైన గుడ్ల పరంగా చూస్తే రెండవ స్థానంలో మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ధర 8.4 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీనిని చూస్తే రూ. 69 కోట్లకు సమానం. 18 కేరెట్ల బంగారంతో రూపొందించిన ఈ గుడ్డును వేయి వజ్రాలతో అలంకరించారు. ఈ గుడ్డును చూసే వారికి అది గుడ్డు సైజులో ఉన్న వజ్రం అని అనిపిస్తుంది.
మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ఖరీదు సుమారు రూ. 82 లక్షలు. ఈ గుడ్డు 65 సెంటీమీటర్ల పొడవు కలిగివుంటుంది. ఈ గుడ్డునుకొనాలంటే మీ కున్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. ఈ గుడ్డు చూసేందుకు చాక్లెట్ మాదిరిగా ఉంటుంది. ఈ గుడ్డు పైభాగంలో వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు దీనిని బంగారంతో రూపొందించారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే..
Comments
Please login to add a commentAdd a comment