Camels get disqualified: ఇటివల కాలంలో మంచి శరీరాకృతికోసం సెలబ్రిటీలు, ప్రముఖులు, అందాల పోటీల్లో పాల్లోనేవారు రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడటం గురించి ఉన్నాం. అంతెందుకు మంచి శారీరక ధారుడ్యం కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి కటకటాల పాలైన వాళ్ల గురించి కూడా విని ఉన్నాం. కానీ అచ్చం అదే తరహాలో సౌదీఅరేబియన్ వాసులు జంతువుల అందంగా ఆకర్షణీయంగా ఉండట కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి వాటిని హింసకు గురి చేశారు.
(చదవండి: బిపిన్ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!)
అసలు విషయంలోకెళ్లితే...సౌదీ రాజధాని రియాద్‌కు ఈశాన్యంలో ప్రసిద్ధ కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ఏటా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అంతే కాదు ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు రూ. 500 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చి సత్కరిస్తుంది. అయితే నిర్వాహకులు ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఫేస్ లిఫ్ట్‌లు వంటి ఇతర సౌందర్య సాధనాలను వినియోగించుకూడదనే ఒక నియమం విధించారు.
ఈ మేరకు ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఒంటెల పోటీల్లో మోసపూరిత చర్యలను అరికట్టే నిమిత్తం అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. దీంతో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు. చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్‌లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లు నిర్వాహకులు గుర్తించి ఆయా ఒంటెలకు అనర్హత వేటు విధించడమే కాక పెంపకందారులకు కఠిన జరిమాన కూడా విధించినున్నట్లు తెలిపారు.
(చదవండి: పక్షిలా షి‘కారు’)
Comments
Please login to add a commentAdd a comment