రాజస్థాన్ లో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు! | Camel made Rajasthan's state animal to check its decreasing number | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ లో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు!

Published Sat, Sep 20 2014 5:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

రాజస్థాన్ లో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు!

రాజస్థాన్ లో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు!

జైపూర్: ఇక రాజస్థాన్ రాష్ట్రంలో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు లభించనుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర జంతువుగా కృష్ణజింక ఉండగా, ఒంటెను కూడా అదే జాబితాలో చేర్చారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా ఒంటెకు గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒంటెలను మాంసం కోసం వధిస్తూ ఉండడం, అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండడంతో ఆ జాతి సంతతి క్రమేపీ తగ్గిపోతోంది. దీంతో వాటిని పరిరక్షణకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

గత జూలై నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో థార్ అడవిల్లో కనిపించే ఒంటెలను క్రమేపీ వేరే ప్రాంతాలకు తరలిస్తుండటంతో ఆ జాతి మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement