వృద్ధురాలి హత్య..! | Old Woman Murdered In Vizianagaram District | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య..!

Published Mon, Sep 2 2019 10:44 AM | Last Updated on Mon, Sep 2 2019 10:46 AM

Old Woman Murdered In Vizianagaram District - Sakshi

సాక్షి, సాలూరు రూరల్‌: బంగారం కోసం వృద్ధురాలి ని హతమార్చిన సంఘటన ఆదివారం తెల్లవా రుఝామున సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దాసరివీధిలో గెంబలి శకుంతల (68) ఒంటరిగా నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు విశాఖలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మరో కుమారు డు త్రినాథరావు సాలూరులోనే ఓ టైర్ల దుకా ణంలో పనిచేస్తున్నాడు. త్రినాథరావు సాలూరులో వేరేగా ఉంటుండడంతో శకుంతల ఒంటరి గా నివశిస్తోంది. ఇదిలా ఉంటే త్రినాథరావు కుమారుడు తేజవిజయ్‌ (17) ఆదివారం కావడంతో నాన్నమ్మను చూసేందుకు తెల్లవారు 6 గంటలకు ఇంటికెళ్లి తలుపుకొట్టాడు. నాన్న మ్మ స్పందించకపోవడంతో తలుపు తీసుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉంది. వెం టనే విజయ్‌ తండ్రికి ఫోన్‌ చేయగా.. త్రినాథరావు హుటాహుటిన ఇంటికి చేరుకుని వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ గౌతమీశాలి సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు.

బంగారం కోసమేనా..?
బంగారం కోసమే దుండగులు వృద్ధురాలిని హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఒంటి మీద ఉండాల్సిన 8 తులాల ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ, హత్య, తదితర కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. అలాగే సమీపంలో ఉండే సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామన్నారు.

వివరాల సేకరణలో క్లూస్‌టీమ్‌..
హంతకుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు క్లూస్‌ టీమ్‌ సభ్యులతో పాటు జాగిలాన్ని రంగంలోకి దించారు. జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి మెయిన్‌ రోడ్డు వరకు వెళ్లి ఆగిం ది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో సీఐ సింహాద్రినాయుడు, పట్టణ ఎస్సై శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement