old woman murder
-
వృద్ధురాలి హత్య..!
సాక్షి, సాలూరు రూరల్: బంగారం కోసం వృద్ధురాలి ని హతమార్చిన సంఘటన ఆదివారం తెల్లవా రుఝామున సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దాసరివీధిలో గెంబలి శకుంతల (68) ఒంటరిగా నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు విశాఖలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మరో కుమారు డు త్రినాథరావు సాలూరులోనే ఓ టైర్ల దుకా ణంలో పనిచేస్తున్నాడు. త్రినాథరావు సాలూరులో వేరేగా ఉంటుండడంతో శకుంతల ఒంటరి గా నివశిస్తోంది. ఇదిలా ఉంటే త్రినాథరావు కుమారుడు తేజవిజయ్ (17) ఆదివారం కావడంతో నాన్నమ్మను చూసేందుకు తెల్లవారు 6 గంటలకు ఇంటికెళ్లి తలుపుకొట్టాడు. నాన్న మ్మ స్పందించకపోవడంతో తలుపు తీసుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉంది. వెం టనే విజయ్ తండ్రికి ఫోన్ చేయగా.. త్రినాథరావు హుటాహుటిన ఇంటికి చేరుకుని వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ గౌతమీశాలి సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. బంగారం కోసమేనా..? బంగారం కోసమే దుండగులు వృద్ధురాలిని హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఒంటి మీద ఉండాల్సిన 8 తులాల ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ, హత్య, తదితర కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. అలాగే సమీపంలో ఉండే సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామన్నారు. వివరాల సేకరణలో క్లూస్‌టీమ్.. హంతకుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు క్లూస్ టీమ్ సభ్యులతో పాటు జాగిలాన్ని రంగంలోకి దించారు. జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి మెయిన్ రోడ్డు వరకు వెళ్లి ఆగిం ది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో సీఐ సింహాద్రినాయుడు, పట్టణ ఎస్సై శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
కారు డ్రైవరే నిందితుడు..!!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధురాలి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఒంటిపై ఉన్న నగల కోసమే హత్య జరిగినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్, అతని స్నేహితుడిని నిందితులుగా తేల్చారు. వివరాలు.. జయశ్రీ (65) అనే వృద్ధురాలు కారులో మార్కెట్‌కు వెళ్లింది. ఆమెను మార్కెట్లో దింపేసిన డ్రైవర్ శ్రీనివాస్ తన స్నేహితుడు నజీర్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. జయశ్రీని చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకోవాలని పథకం పన్నారు. జయశ్రీని ఎక్కించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను కారులోనే హత్య చేశారు. ముందుసీట్లో కూర్చున్న జయశ్రీపై వెనక కూర్చున్న నజీర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎన్టీఆర్ నగర్‌లోని చింతచెట్ల సమీపంలో పడేశారని పోలీసులు తెలిపారు. ఏసీపీ పృథ్వీదర్ రావు, సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు. -
వృద్ధురాలి హత్య, దోపిడీ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఒంటరిగి నిద్రిపోతున్న వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండుగులు దోచుకెళ్లారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన గురువారం తెల్లవారు జామున బీవీ నగర్‌లోని ఉçప్పుకట్లవారి వీధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. బీవీనగర్ రైల్వేగేటు సమీపం ఉప్పుకట్లవారి వీధిలో మహబూబ్‌జానీ (68) నివాసం ఉంటుంది. భర్త అబ్దుల్ రెహమాన్ ఏడాది క్రితం చనిపోవడం, వీరి పిల్లలు రఫి, ఖాజారహంతుల్లా, హనీసా, దిల్షాద్, షంషాద్, నౌషాద్ వేర్వేరుగా ఉండటంతో ఆమె ఒంటరిగానే ఉంటుంది. మహబూబ్‌జానీకి ఉప్పుకట్లవారి వీధిలో ఉన్న మరో మూడు ఇళ్లను అద్దెకు ఇచ్చింది. అయితే కొంత కాలంగా గాంధీనగర్‌లో ఉంటున్న పెద్ద కుమారుడు రఫి వద్ద ఉంటుంది. నెలకోసారి మహబూబ్‌జానీ బీవీనగర్‌లోని ఇంటికి వచ్చి రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ఇళ్ల అద్దెలు వసూలు చేసుకుని వెళ్తుండేది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె అద్దె వసూలు చేసుకుని వస్తానని కుమారుడు రఫికి చెప్పి వచ్చి, కుమార్తె నౌషాద్ ఇంటికి వెళ్లి భోజనం తీసుకుని బీవీనగర్‌కు చేరుకుంది. అక్కడ తన ఇళ్లలో అద్దెకు ఉంటున్న కరిముల్లాతో కొద్దిసేపు మాట్లాడి, కాసేపు తర్వాత ఇంట్లోకి వెళ్లి నిద్రపోయింది. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు పక్కనే ఉన్న మూడు ఇళ్ల తలుపులకు గడియలు బిగించి మహబూబ్‌జానీ ఇంటి తలుపు గడియలను కమ్మితో తొలగించి లోనికి ప్రవేశించారు. నిద్రిస్తున్న ఆమె గొంతు నులిమి హతమార్చారు. ఆమె ఒంటిపై ఉన్న రూ.1.25 లక్షలు విలువ చేసే నాలుగున్నర సవర్లు (బంగారు చైన్, చెవి కమ్మలు, ఉంగరం) ఆభరణాలను దోచుకెళ్లారు. ఉదయం పక్క ఇంట్లో అద్దెకు ఉంటున్న ప్రమీల తన ఇంటి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా అది రాలేదు. బయట గడియ పెట్టిన విషయాన్ని గుర్తించిన ప్రమీల వెనుక కిటికి తెరచి రోడ్డు మీద వెళుతున్న వారిని పిలిచి గడియ తీయమని చెప్పింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని మూడు ఇళ్ల గడియలు తెరిచారు. అనంతరం వృద్ధురాలి ఇంటి తలుపులు తెరచి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా మహబూబ్‌జానీ మృతి చెంది ఉంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులకు, ఐదో నగర పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. డాగ్‌స్క్వాడ్ పరిశీలన వృద్ధురాలి హత్యపై సమాచారం అందుకున్న ఐదో నగర ఇన్స్పెక్టర్ జి. మంగారావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఘటనా ఆధారాల కోసం గాలించారు. క్లూస్‌టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్ వృద్ధురాలి ఇంటి నుంచి మెయిన్‌రోడ్డు వద్దకు వెళ్లి అక్కడ నుంచి వృద్ధురాలి ఇంటి వెనుక భాగం కొంతదూరం పరిశీలించి తిరిగి వృద్ధురాలి ఇంటి వరకు చేరుకుంది. దీన్ని బట్టి వృద్ధురాలిని హతమార్చి బంగారు దోచుకెళ్లిన దుండగులు స్థానికంగా ఉన్న వారేనని పోలీసులు భావిస్తున్నారు. పక్కా రెక్కీ వేసి వృద్ధురాలు ఒంటరిగా ఉన్న విషయంను గుర్తించి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం„ý నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి కుమారుడు షేక్ ఖాజారహంతుల్లా ఫిర్యాదు మేరకు ఐదో నగర ఇన్స్పెక్టర్ జి. మంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య
కదిరి అర్బన్ : మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో గురువారం తెల్లవారుజామున లక్ష్మమ్మ (65) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాతిని తలపై మోది దారుణంగా హత్య చేశారు. మృతురాలు యాచకవృత్తి చేసుకుని జీవించేంది. రాత్రి పూట రోడ్డుపక్కనున్న షాపుల వద్ద వరండాలో నిద్రిస్తుండేది. ఇంత దారుణంగా వృధ్దురాలిని హత్య చేశారంటే అది ఆమె దగ్గర ఉన్న డబ్బును లాక్కునేందుకా..లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. దుండగుల ఆచూకీ తెలుసుకునేందుకు పట్టణ సీఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలో దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తల్లి మృతి చెందడంతో కుమార్తె రమణమ్మ కన్నీరు మున్నీరైంది. రూరల్ మండల ఎస్సై వెంకటప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ జగదాంబ జంక్షన్లో దారుణం!
విశాఖపట్నం: జగదాంబ జంక్షన్లో ఓ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొందరు దుండగులు ఇల్లు అద్దెకు కావాలని జగదాంబ జంక్షన్లో ఒక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంట్లో హఫీజ్ మున్నీసా బేగం అనే వృద్ధ మహిళ ఉన్నారు. దుండగులు చేతి రుమాలును ఆ వృద్ధురాలి పీకకు చుట్టి బిగించి హత్య చేశారు. ఆ తరువాత వారు పారిపోవడానికి ప్రయత్నించారు. దుండగులలో ఒకరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. -
నగల కోసం వృద్ధురాలి పీకనొక్కారు
విశాఖపట్నం: కొందరు దుండగులు నగల కోసం ఓ వృద్ధురాలి పీక నొక్కి హత్య చేశారు. అక్కయ్యపాలెం అబిద్ నగర్లో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు రిటైర్డ్ రైల్వే హెడ్ నర్సు ఆండాలమ్మ పీక నొక్కి హత్య చేసి, ఆమె మెడలోని నగలను తీసుకువెళ్లారు. విషయం తెలిసిన వెంటనే నాలుగవ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
గొంతు నులిమి వృద్ధురాలి హత్య:కొడుకుపై అనుమానం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సూరంగల్లో దారుణం జరిగింది. ఓ వృద్దురాలిని గొంతు నులిమి హత్య చేశారు. ఆమె కుమారుడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. -
93 ఏళ్ల తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య
రీమ్స్(ఫ్రాన్స్): కాటికి కాళ్లు చాచుకున్న వయసులో ఓ తాతయ్య ప్రేమించాలంటూ ఓ వృద్దురాలిని హత్య చేసి కటకటాల పాలయ్యాడు. అతని ప్రేమ అభ్యర్థనను ఆమె తిరస్కరించడంతో చివరికి హత్యచేసి జైలు పాలయ్యాడు. ఫ్రాన్స్‌లోని రీమ్స్ పట్టణంలో జరిగిన ఈ ప్రేమ హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు మార్సెల్ తాతయ్యగా పిలుచుకునే మార్సెల్ గిల్లాట్(93) సెయింట్ గిల్లెస్ గ్రామానికి చెందిన నికోల్ ఎల్ డిబ్(82) అనే ముసలమ్మపై మనసు పారేసుకున్నాడు. ఆమెతో స్నేహం చేశాడు. తర్వాత ప్రేమించమని అడిగాడు. కానీ ఆమె తిరస్కరించింది. దీంతో ఓ రోజు బామ్మ ఇంటికెళ్లిన మార్సెల్ ఆమెను తీవ్రంగా గాయపర్చి హతమార్చాడు. ఎల్ డిబ్ పొలం పక్కన ఉన్న కాలువలో ఛిద్రమైన ఆమె మృతదేహాన్ని తర్వాత పోలీసులు కనుగొన్నారు. బామ్మ ఇంట్లో ఓ గడియారంపై మార్సెల్ రక్తం మరకలకు డీఎన్ఏ పరీక్ష చేయడంతో అసలు విషయం తెలిసింది. అయితే ఆమె తన గర్ల్‌ఫ్రెండ్ అని, ఆమెను నేనెందుకు చంపుతానంటూ తాతయ్య కోర్టులో వాదించినా.. అతడు ఉద్దేశపూర్వకంగానే హత్యకు పాల్పడ్డాడని, పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదని ప్రాసిక్యూషన్‌వారు తేల్చారు. దీంతో 2011లో చేసిన ఈ హత్యకు రీమ్స్ కోర్టు ఆ తాతయ్యకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.