93 ఏళ్ల తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య | 93 year old man jailed for murdering 82 year old friend | Sakshi
Sakshi News home page

93 ఏళ్ల తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య

Published Sun, Mar 30 2014 12:32 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

93 ఏళ్ల  తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య - Sakshi

93 ఏళ్ల తాతయ్య.. ప్రేమించాలంటూ హత్య

రీమ్స్(ఫ్రాన్స్): కాటికి కాళ్లు చాచుకున్న వయసులో ఓ తాతయ్య ప్రేమించాలంటూ ఓ వృద్దురాలిని హత్య చేసి కటకటాల పాలయ్యాడు. అతని ప్రేమ అభ్యర్థనను ఆమె తిరస్కరించడంతో చివరికి హత్యచేసి  జైలు పాలయ్యాడు. ఫ్రాన్స్‌లోని రీమ్స్ పట్టణంలో జరిగిన ఈ ప్రేమ హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు మార్సెల్ తాతయ్యగా పిలుచుకునే మార్సెల్ గిల్లాట్(93) సెయింట్ గిల్లెస్ గ్రామానికి చెందిన నికోల్ ఎల్ డిబ్(82) అనే ముసలమ్మపై మనసు పారేసుకున్నాడు. ఆమెతో స్నేహం చేశాడు. తర్వాత ప్రేమించమని అడిగాడు. కానీ ఆమె తిరస్కరించింది. దీంతో ఓ రోజు బామ్మ ఇంటికెళ్లిన మార్సెల్ ఆమెను తీవ్రంగా గాయపర్చి హతమార్చాడు. ఎల్ డిబ్ పొలం పక్కన ఉన్న కాలువలో ఛిద్రమైన ఆమె మృతదేహాన్ని తర్వాత పోలీసులు కనుగొన్నారు. బామ్మ ఇంట్లో ఓ గడియారంపై మార్సెల్ రక్తం మరకలకు డీఎన్‌ఏ పరీక్ష చేయడంతో అసలు విషయం తెలిసింది.

అయితే ఆమె తన గర్ల్‌ఫ్రెండ్ అని, ఆమెను నేనెందుకు చంపుతానంటూ తాతయ్య కోర్టులో వాదించినా.. అతడు ఉద్దేశపూర్వకంగానే హత్యకు పాల్పడ్డాడని, పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదని ప్రాసిక్యూషన్‌వారు తేల్చారు. దీంతో 2011లో చేసిన ఈ హత్యకు  రీమ్స్ కోర్టు ఆ తాతయ్యకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement