సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధురాలి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఒంటిపై ఉన్న నగల కోసమే హత్య జరిగినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్, అతని స్నేహితుడిని నిందితులుగా తేల్చారు. వివరాలు.. జయశ్రీ (65) అనే వృద్ధురాలు కారులో మార్కెట్‌కు వెళ్లింది. ఆమెను మార్కెట్లో దింపేసిన డ్రైవర్ శ్రీనివాస్ తన స్నేహితుడు నజీర్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. జయశ్రీని చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకోవాలని పథకం పన్నారు. జయశ్రీని ఎక్కించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను కారులోనే హత్య చేశారు. ముందుసీట్లో కూర్చున్న జయశ్రీపై వెనక కూర్చున్న నజీర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎన్టీఆర్ నగర్‌లోని చింతచెట్ల సమీపంలో పడేశారని పోలీసులు తెలిపారు. ఏసీపీ పృథ్వీదర్ రావు, సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు.
Comments
Please login to add a commentAdd a comment