chased by police
-
అర్ధరాత్రి మాటువేసి.. మహిళా ఎస్ఐని టార్గెట్ చేసి..
భువనేశ్వర్: మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో వెంబడించారు. విధులు నిర్వహించుకుని పోలీసు స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇలా జరిగింది. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. ఈ మేరకు భువనేశ్వర్‌లోని సహీద్నగర్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ శుభశ్రీ నాయక్(36) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా నగరంలోని రిజర్వ్ బ్యాంక్ సమీపంలో కొందరు దుండగులు ఆమెను వెంబడించారు. చేతిలో కత్తులు, తల్వార్లతో ఆమెను వారు ఫాలో చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ క్రమంలో వారిబారి నుంచి ఎస్ఐ శుభశ్రీ నాయక్ తప్పించుకున్నారు. అనంతరం, ఈ ఘటనపై భువనేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు.. ఎస్ఐ శుభశ్రీ నాయక్‌కి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. అంతేకాకుండా కరోనా సమయంలో కూడా ఎస్ఐ శుభశ్రీ పలువురికి సాయం అందించారు. లాక్డౌన్ సమయంలో అవసరం ఉన్నవారిని భోజనం అందించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన హీరోలు కూడా ఆమెను అభినందించారు. Stringent action should be taken against the culprits @odisha_police NB : During COVID lockdown MegaStar @KChiruTweets appreciate SI Subhashree Nayak for her commendable social work #Odisha https://t.co/HX9G0FUa2i — BIKASH KUMAR ROUTRAY (@Bikash_Media) January 4, 2023 So delighted to chat with #Shubhasri ji ,the Odisha Cop who cares for citizens like her own.Salute her compassion. @CMO_Odisha @Naveen_Odisha @DGPOdisha pic.twitter.com/15ZURVUITc — Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020 -
ఎరక్కపోయి ఇరుక్కున్నారుగా!.. సినిమాను తలపించే సీన్
చండీగఢ్: ఆయుధాలతో హల్చల్ చేస్తున్న క్రిమినల్స్‌కు పోలీసులు ఎదురుపడ్డారు. ఇరువురి ఎస్యూవీ వాహనాలు ఎదురుపడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. పోలీసులను గమనించిన క్రిమినల్స్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు.ఈ సంఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ సంఘటనలో క్రిమినల్ రికార్డ్ ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. క్రిమినల్స్ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు బయలుదేరారు. అమృత్‌సర్‌లోని ఓ మార్కెట్లోని ఇరుకు రోడ్డులో ఇరువురి వాహనాలు ఎదురుపడ్డాయి. పోలీసులను గమనించిన వెనుక సీటులోని వ్యక్తి ముందుగా దిగి పరారయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ సైతం పరుగులు పెట్టాడు. వారిని పట్టుకునేందుకు సుమారు ఆరుగురు పోలీసులు ఛేజ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఓ అధికారి తిరిగి వచ్చి వాహనంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని తనిఖీ చేశారు. ఛేజింగ్ తర్వాత వివరాలు వెల్లడించారు పోలీసులు. ఇద్దరు క్రిమినల్స్ రవి, రాబిన్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ‘ఇరువురిపై 5-6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారి నుంచి 5 ఆయుధాలు, లైవ్ క్యాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నాం. తదుపరి విచారణ చేపట్టాం.’ అని అమృత్సర్ పోలీసు కమిషనర్ జస్కరన్ సింగ్ తెలిపారు. #WATCH | Punjab Police arrested two criminals in Amritsar and recovered 5 weapons and live cartridges from them. (CCTV footage confirmed by police) pic.twitter.com/vqo1czNWHR — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. కమల్‌నాథ్ వీడియో వైరల్ -
హాలీవుడ్ మూవీ రేంజ్.. స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు అర్ధరాత్రి ఛేజ్ చేసి పట్టుకున్నారు. దొంగలను పట్టుకునేందు పోలీసులు.. హాలీవుడ్ మూవీ రేంజ్లో రోడ్డుపై లారీని ఛేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. ఐదుగురు పశువుల స్మగ్లర్లు గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు ఢిల్లీ బోర్డర్ నుండి గురుగ్రామ్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు లారీని ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఛేజింగ్ చేసిన తర్వాత వారిని పట్టుకున్నారు. Cow Smugglers for Illegal Slaughter Perpetrators: TASLIM, SHAHID, KHALID, BALLU Thanks to Gurugram Police for catching these thieves. https://t.co/JnlW8cfOV9 — शुद्ध | Shuddha (@ShuddhaWorld) April 10, 2022 ఛేజ్ చేసే క్రమంలో పోలీసులు.. స్మగ్లర్ల లారీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్ల్లో లారీ టైర్ పేలిపోయినప్పటికీ వారు వాహనాన్ని మాత్రం ఆపలేదు. కాగా, లారీ పట్టుకున్న తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లారీలో తనిఖీలు చేపట్టగా అందులో తుపాకులు, బుల్లెట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆవుల స్మగ్లర్లు గురుగ్రామ్‌లో భీభత్సం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. హర్యానా ప్రభుత్వం ఆవుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించినప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పశువుల అక్రమ రవాణా పెరుగుతూనే ఉంది. -
కారు డ్రైవరే నిందితుడు..!!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధురాలి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఒంటిపై ఉన్న నగల కోసమే హత్య జరిగినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్, అతని స్నేహితుడిని నిందితులుగా తేల్చారు. వివరాలు.. జయశ్రీ (65) అనే వృద్ధురాలు కారులో మార్కెట్‌కు వెళ్లింది. ఆమెను మార్కెట్లో దింపేసిన డ్రైవర్ శ్రీనివాస్ తన స్నేహితుడు నజీర్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. జయశ్రీని చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకోవాలని పథకం పన్నారు. జయశ్రీని ఎక్కించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను కారులోనే హత్య చేశారు. ముందుసీట్లో కూర్చున్న జయశ్రీపై వెనక కూర్చున్న నజీర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎన్టీఆర్ నగర్‌లోని చింతచెట్ల సమీపంలో పడేశారని పోలీసులు తెలిపారు. ఏసీపీ పృథ్వీదర్ రావు, సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు. -
ఆవేశంతోనే హత్య
జాగిలం క్లూస్‌తో హత్య మిస్టరీ ఛేదించిన పోలీసులు గూడూరు :వారిద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. మద్యం మత్తులో ‘వాడ్ని వేసేయండ్రా’ అని ఆవేశంగా అన్న మాట ఓ దారుణ హత్యకు దారి తీసింది. హత్యచేసి ఆనవాలు గుర్తించకుండా దహనం చేసిన సంఘటలో నిందితుడిని పోలీస్ జాగిలం ఇచ్చిన క్లూస్ ఆధారంగా మిస్టరీని ఛేదించినట్లు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో హత్యకు దారితీసిన ఉదంతాన్ని వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి నాయుడుపేట సమీపంలోని తుమ్మూరులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆపై ఆనవాలు గుర్తించకుండా దహనం చేసిన ఘటన పోలీసులకు సవాల్‌గా నిలిచింది. నాయుడపేట సీఐ రత్తయ్యతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పీవీ నారాయణ, రవినాయక్, మారుతీకృష్ణ దర్యాప్తు చేపట్టారన్నారు. ఇందుకూరుపేట మండలం నరుకూరుకు చెందిన పాలెపు హజరత్ (29) తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఊరూరా తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో తుమ్మూరులోని తన మామ పుల్లయ్య ఇంటికి కొద్ది రోజుల క్రితం వచ్చాడు. హజరత్ ఈ నెల 19వ తేదీ రాత్రి కొందరితో కలిసి పూటుగా మద్యం సేవించాడు. అక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న హజరత్ సమీపంలో ఉన్న ఓ పూరి గుడిసెలో పడి నిద్రపోయాడు. ఆ గుడిసె అదే ప్రాంతానికి చెందిన దేవిరెడ్డి నాగూరుయ్య కుమారుడు నాగరాజుది. నాగరాజు అక్కడే ఉంటూ పెయింట్ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. నాగరాజు పనులు పూర్తి చేసుకుని వచ్చేసరికి తన గుడిసెలో మద్యం మత్తులో నిద్రపోతున్న హజరత్ కనిపించాడు. కోపోద్రేకానికి గురైన నాగరాజు అతన్ని గుడిసెలోంచి బయటకు లాగేశాడు. దీంతో హజరత్తో ఉన్నవారు సర్ది చెప్పారు. హజరత్ మద్యం మత్తులో ఉండి ‘ఆడ్ని వేసేయండిరా’ అని అన్నాడు. అది విన్న నాగరాజు ఆవేశంతో హజరత్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొంత సేపటికి హజరత్‌ను పక్కనే ఉన్న మూసేసిన బంక్ వద్ద పడుకోబెట్టి ఎవరి ఇళ్లుకువారెళ్లిపోయారు. అది గమనిస్తూ ఉన్న నాగరాజు పక్కనే ఉన్న సిమెంట్ కాంక్రీట్ రాయితో మోది హజరత్‌ను చంపేశాడు. మృతుడి ఆనవాలు కనిపెట్టకుండా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి తనకు విరోధి అయిన చంద్రకళ అనే మహిళకు చెందిన ఇంటి ముందు ఉంచి కాల్చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో సీఐ, ఎస్సైలు పోలీస్ జాగిలాన్ని ఇచ్చిన క్లూస్ ఆధారంగా మిస్టరీని ఛేధించి, నిందుతుడు నాగరాజును సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిస్టరీని ఛేదించిన సిబ్బందికి రివార్డులకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. -

జాగిలం క్లూస్‌తో హత్య మిస్టరీ ఛేదించిన పోలీసులు గూడూరు :వారిద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. మద్యం మత్తులో ‘వాడ్ని వేసేయండ్రా’ అని ఆవేశంగా అన్న మాట ఓ దారుణ హత్యకు దారి తీసింది. హత్యచేసి ఆనవాలు గుర్తించకుండా దహనం చేసిన సంఘటలో నిందితుడిని పోలీస్ జాగిలం ఇచ్చిన క్లూస్ ఆధారంగా మిస్టరీని ఛేదించినట్లు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో హత్యకు దారితీసిన ఉదంతాన్ని వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి నాయుడుపేట సమీపంలోని తుమ్మూరులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆపై ఆనవాలు గుర్తించకుండా దహనం చేసిన ఘటన పోలీసులకు సవాల్‌గా నిలిచింది. నాయుడపేట సీఐ రత్తయ్యతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పీవీ నారాయణ, రవినాయక్, మారుతీకృష్ణ దర్యాప్తు చేపట్టారన్నారు. ఇందుకూరుపేట మండలం నరుకూరుకు చెందిన పాలెపు హజరత్ (29) తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఊరూరా తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో తుమ్మూరులోని తన మామ పుల్లయ్య ఇంటికి కొద్ది రోజుల క్రితం వచ్చాడు. హజరత్ ఈ నెల 19వ తేదీ రాత్రి కొందరితో కలిసి పూటుగా మద్యం సేవించాడు. అక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న హజరత్ సమీపంలో ఉన్న ఓ పూరి గుడిసెలో పడి నిద్రపోయాడు. ఆ గుడిసె అదే ప్రాంతానికి చెందిన దేవిరెడ్డి నాగూరుయ్య కుమారుడు నాగరాజుది. నాగరాజు అక్కడే ఉంటూ పెయింట్ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. నాగరాజు పనులు పూర్తి చేసుకుని వచ్చేసరికి తన గుడిసెలో మద్యం మత్తులో నిద్రపోతున్న హజరత్ కనిపించాడు. కోపోద్రేకానికి గురైన నాగరాజు అతన్ని గుడిసెలోంచి బయటకు లాగేశాడు. దీంతో హజరత్తో ఉన్నవారు సర్ది చెప్పారు. హజరత్ మద్యం మత్తులో ఉండి ‘ఆడ్ని వేసేయండిరా’ అని అన్నాడు. అది విన్న నాగరాజు ఆవేశంతో హజరత్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొంత సేపటికి హజరత్‌ను పక్కనే ఉన్న మూసేసిన బంక్ వద్ద పడుకోబెట్టి ఎవరి ఇళ్లుకువారెళ్లిపోయారు. అది గమనిస్తూ ఉన్న నాగరాజు పక్కనే ఉన్న సిమెంట్ కాంక్రీట్ రాయితో మోది హజరత్‌ను చంపేశాడు. మృతుడి ఆనవాలు కనిపెట్టకుండా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి తనకు విరోధి అయిన చంద్రకళ అనే మహిళకు చెందిన ఇంటి ముందు ఉంచి కాల్చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో సీఐ, ఎస్సైలు పోలీస్ జాగిలాన్ని ఇచ్చిన క్లూస్ ఆధారంగా మిస్టరీని ఛేధించి, నిందుతుడు నాగరాజును సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిస్టరీని ఛేదించిన సిబ్బందికి రివార్డులకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు.