సాలూరు; రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో అవసరమైన ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నుంచి జరపతలపెట్టిన నిరాహార దీక్షను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదాకోసం చంద్రబాబు చేయాల్సిన పోరాటాన్ని, బాధ్యతగల ప్రతిపక్షనేతగా జగన్ నిర్వర్తిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దుర్మార్గమని విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విపక్షనేతలు ఇలా అన్నివర్గాలవారు పెదవి విరుస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలిసిరావాల్సింది పోయి కుట్రచేస్తారా..?;
కేంద్రం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయలేని స్థితిలో ఉంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోరాడేందుకు ముందుకు వస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని పోకుండా, పోరాటానికి మోకాలడ్డడం దారుణం. ఇలాంటి చర్యల కారణంగానే రాష్ట్రప్రజలు చంద్రబాబును గతంలో 10ఏళ్లపాటు అధికారానికి దూరం చేశారన్న విషయం గుర్తుంచుకోవడం మంచిది.
- ఎన్‌వై నాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాలూరు
స్వేచ్ఛను హరిస్తారా..?;
మనం ఉన్నది ప్రజాస్వామ్యదేశంలోనా..?, రాచరికపాలనలోనా..?, రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడే ప్రత్యేక హోదా సాధనకు జగన్ నిరారహార దీక్షకు పూనుకుంటే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటుండడం దారుణం. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇవ్వవచ్చు, అవసరమైతే నిరుద్యోగ భృతి ఇవ్వవచ్చు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా సాధించలేక, ప్రతిపక్షనేతగా జగన్ చేపట్టిన పోరాటాన్ని అడ్డుకోవడం దారుణం.
- పీడిక రాజన్నదొర,
సాలూరు ఎమ్మెల్యే
ఇదేం దిక్కుమాలిన తీరు;
రాష్ట్రం అన్నివిదాలుగా సంక్షోభంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి యువత ఉపాధి బాట పట్టాలన్నా, ఉద్యోగావకాశాలు రావాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా, ప్రత్యేక హోదా అవసరం. దానికోసం పోరాడలేని టీడీపీ ప్రభుత్వం, జగన్ పోరాటాన్ని అడ్డుకోవడం సరికాదు. ఇదేం దిక్కుమాలిన నిర్ణయం. జగన్‌ను చూసి భయంతోనే అడ్డుకుంటున్నారు.
- గొంప ప్రకాశరావు,
భారతీయ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సాలూరు
జగన్ దీక్షను ‘ప్రత్యేక’ంగా అడ్డుకుంటారా..?
Published Sat, Sep 26 2015 12:33 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement