సాలూరు నుంచి షర్మిల సమైక్య శంఖారావం
శ్రీకాకుళం : షర్మిల పూరించిన సమైక్య శంఖారావానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోమవారం ఉదయం ఆమె శ్రీకాకుళం జిల్లా సాలూరు నుంచి బస్సుయాత్రను ప్రారంభించారు. కాగా సెప్టెంబర్2న ప్రారంభమైన సమైక్య శంఖారావం నేటితో ముగియనుంది. సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల ..80 నియోజకవర్గాలు, 115 మండలాలు, 32 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 34 మీటింగ్‌లు నిర్వహించారు. సెప్టెంబర్2న బస్సు యాత్ర చేపట్టిన షర్మిల..2,245 కిలో మీటర్లు పయనించారు.
సమైక్య శంఖారావం పేరిట షర్మిల నిర్వహిస్తున్న బస్సు యాత్ర సోమవారం ఉదయం జిల్లాలోకి ప్రవేశించి.. సాయంత్రం ఇక్కడే ముగుస్తుంది. ఉదయం 10 గంటలకు రాజాంలో, సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలో జరిగే సభల్లో రాష్ట్ర విభజన వల్ల వాటిల్లే నష్టాలతోపాటు, సమైక్య రాష్ట్రం కోసం వైఎస్‌ఆర్‌సీపీ అనుసరిస్తున్న వైఖరిని షర్మిల ప్రజలకు వివరిస్తారు.