వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యాత్ర
శ్రీకాకుళం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యాత్ర విజయవంతం కావాలని ఆ పార్టీ జిల్లా నాయకులు సోమవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడాన్ని తట్టుకోలేక చనిపోయిన బాధితుల కుటుంబాలను ఓదార్చేందుకే షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు అన్నారు. ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో కూడా వై.ఎస్.అంటే ప్రాణంపెట్టిన అభిమానులు ఎంతోమంది ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తానన్న జగనన్న మాటకు కట్టుబడి షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి పాదయాత్ర చేపడుతున్నారన్నారు.
భవిష్యత్తులో రాజన్న రాజ్యం రావాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని ఆదిత్యుని ఆలయంలో వేదపండితులు అనివెట్టి మంటపంలో ఆశీర్వచనాలు అందించినట్టు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా అలివేలు మంగ, మండవిల్లి రవి, టి.కామేశ్వరి, శిమ్మ వెంకట్రావు, తెలుగు సూర్యనారాయణ, కోరాడ రమేష్, కిల్లి నర్సింహులు, అబ్దుల్ రెహమాన్, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదరరావు, పాలిశెట్టి మధుబాబు, గుంట జ్యోతి, పొట్నూరు సౌజన్య, కర్నేని పద్మావతి, బరాటం ఈశ్వరరావు, ఊన్న వెంకట రమేష్, వైశ్యరాజు కృష్ణంరాజు, మాధవరావు, అలపాన అప్పోజీరెడ్డి, ట్రేడ్ యూనియన్ భాస్కరరావు, బుడ్డి గణేష్, ఎన్.రమణయ్య, కె.విజయ్‌కుమార్, కర్నేని హరి, కార్యకర్తలు పాల్గొన్నారు.