పని చేసిన అభివృద్ధి మంత్రం
సాలూరు, న్యూస్‌లైన్: సాలూరులో అభివృద్ధి మంత్రం బాగా పని చేసింది. తమ ప్రాంతాలను అభివృద్ధి చేసిన పీడిక రాజన్నదొరపై గిరిజన ప్రజలు నమ్మకం ఉంచారు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళే ఇందుకు ఉదాహరణ. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గిరిజన గ్రామాల్లో బూత్‌ల వారీగా పోలైన ఓట్లను పరి శీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. సాలూరు, పాచిపెంట మండలాల్లో అత్యధిక గిరి జన గ్రామాలున్నాయి. అందులో వైఎస్‌ఆర్ సీపీకి సా లూరు మండలంలో 3,100, పాచిపెంట మండలంలో 3వేల ఓట్లు ఆధిక్యం లభించింది.
దీంతో సాలూరు మున్సిపాలిటీలో భంజ్‌దేవ్‌కు వచ్చిన దాదాపు 4వేల ఓట్ల ఆధిక్యతను రాజన్నదొర అధిగమించగలిగారు. మక్కువ మండలంలోని గిరిజన ఓటర్లు సైతం రాజన్నదొరను ఆదరించారు. నియోజకవర్గంలోని కొఠియా పోలింగ్ స్టేషన్‌లో అత్యల్పంగా 272 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అయినా ఆ పోలింగ్ కేంద్రంలో 158 ఓట్ల ఆధిక్యత రాజన్న వశమైంది. అలాగే కురుకుట్టి, సారిక, తోణాం, కందులపదం, పందిరిమామిడివలస, పి.కోనవలస, చెరకుపల్లి ఆలూరు, నూరువరహాలపాడు, కొండతాడూరు ఇలా గిరిజన గ్రామాల్లో మెజార్టీ ఓట్లు రాజన్నకే దక్కాయి. దీంతో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి రాజన్నదొర హ్యాట్రిక్ గెలుపు సాధ్యమైంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ధనాన్ని నమ్ముకోగా, వైఎస్సార్ సీపీ మాత్రం జనాన్ని నమ్ముకుంది. దానికి తగ్గట్టే ప్రజ లు కూడా రాజన్నదొరపై నమ్మకం ఉంచి మరోసారి కుర్చీ ఎక్కించారు.