సాలూరు : అసెంబ్లీ సమావేశాల్లో రుణమాఫీ, పింఛన్ల పంపిణీ, ఎస్సీ, ఎస్టీ రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికా రులు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పని చేయాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. రాజకీయ వ్యవస్ధలో మార్పులు వస్తున్నా.. అధికారులు మాత్రం విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలని చెప్పారు. కానీ సాలూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ఇందుకు ఇటీవల ప్రభు త్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణే ఉదాహరణ అని చెప్పారు. ముఖ్యంగా పింఛన్ల కేటాయింపులో అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లోనయ్యా రన్నారు.
వారి తీరు వల్ల అర్హులైన వారికి పింఛన్లు అందకుండా పోయాయన్నారు. అలాగే దళితులు, గిరిజనులకు మంజూరు చేసే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ట్రైకార్ రుణాల ఎంపిక కమిటీలో గిరిజనేతరులకు స్థానం కల్పించి, అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వమైనా అర్హులకు పథకాలు అందివ్వాలన్న లక్ష్యంతో పని చేస్తుంది. కానీ మాకు వస్తున్న ఫిర్యాదుల మేరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారికే రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అలాగే రుణమాఫీపై కూడా ప్రభు త్వం అనుసరించిన విధానం సరిగ్గా లేదన్నారు. దీనిపై శాసనసభలో ప్రభుత్వాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారని చెప్పారు. పింఛన్ల నిలిపివేతపై ఇప్పటికే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని, రుణాల మంజూరు విషయంలో కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పది మందికి పథకాలు అందించాలని భావిస్తే వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటారని, ఆ పదీ తమ అనుకూలురికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే మిగిలిన 9, 990 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారని చెప్పారు.
ఫైలేరియా నిర్మూలనకు కృషి
ప్రతి ఒక్కరూ ఫైలేరియా నిర్మూలనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ ైఫైలేరియా వారోత్సవాల ప్రారంబోత్స వం సందర్భంగా వెలమపేట రామమందిరం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫైలేరియా వ్యాధి బారిన పడితే తగ్గేందుకు అవకాశం లేదన్నారు. అందువల్ల ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడడమే మార్గమన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోన్న మాత్రలను ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలని సూచించారు.మలేరియా నివారణాధికారి సంగమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్, ఇన్‌చార్జి ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ సంజీవనాయుడు, స్థానిక నాయకులు అక్యాన అప్పచ్చి, ఎర్ర దాలినాయుడు, జె. సీతారాం తదితరులు పాల్గొన్నారు. అలాగే సాలూరు మండలంలోని మా మిడిపల్లిలో కూడా జాతీయ పైలేరియా వారోత్సవాలను ప్రారంభించా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోని ఈశ్వరమ్మ, మామిడిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి సురేష్‌చంద్రదేవ్, టీడీపీ నాయకుడు డొంక శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
Published Mon, Dec 15 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement
Advertisement