అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష రూపాయలు విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.
సాలూరు (విజయనగరం జిల్లా) : అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష రూపాయలు విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. మున్సిపాలిటీకి చెందిన మోహన్‌రావు ఇంట్లో అక్రమంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో అతని ఇంట్లో సోదాలు జరిపి లక్ష రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.