కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో పాన్ దుకాణాలపై సోమవారం సాయంత్రం పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్‌లోని రెండు దుకాణాల్లో సోదాలు జరిపి రూ.5 లక్షల విలువైన గుట్కా, పాన్‌పరాగ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.