వీరఘట్టం (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో రూ.30 లక్షల విలువజేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రెండు ఇళ్లు, రెండు గోదాములపై పోలీసులు దాడులు నిర్వహించగా గుట్కాలు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేష్, శ్రీధర్ అనే ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒడిశా నుంచి గుట్కాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు.