ఆహార సలహా సంఘాల జాడెక్కడ ? | Jadekkada communities dietary advice | Sakshi
Sakshi News home page

ఆహార సలహా సంఘాల జాడెక్కడ ?

Published Sun, May 1 2016 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

Jadekkada communities dietary advice

సాలూరు : ప్రభుత్వం రాయితీపై  బీపీఎల్ కుటుంబాలకు అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆహార సలహా సంఘాలపై ఉంది. పంపిణీలో సమస్యలు తలెత్తినా, కేటాయింపుల్లో కోతలు విధించినా ప్రభుత్వానికి తక్షణమే నివేదిక పంపి సమస్య పరిష్కారమయ్యేలా సభ్యులు చూస్తారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి కలెక్టర్, జేసీకి, పౌరసరఫరాల శాఖాధికారులతో పాటు సంబంధిత మంత్రికి కూడా తీర్మాణాలు పంపించి లబ్ధిదారులు, డీలర్ల ప్రయోజనాలు దెబ్బతినకుండా తమవంతు కృషి చేస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆహార సలహా సంఘాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.  
 
 ప్రతి నెలా సమావేశం
 ప్రతి మండలానికి ఒక సలహా సంఘం ఉండాలి. వారు ప్రతి నెలా సీఎస్‌డీటీ ఆధ్వర్యంలో సమావేశమై సరుకుల పంపిణీపై ఆరా తీయూలి. అరుుతే జిల్లాలో ఏ మండలంలో చూసినా సుమారు రెండేళ్లుగా సమావేశాలు జరుగుతున్న దాఖాలాలే లేవు.
 
 జేసీకి ప్రతిపాదనలు పంపాం
 ఈ విషయమై తహశీల్దార్ కేడీవీ ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా, ఆరు నెలల కిందటే సాలూరుకు సంబంధించి సలహా సంఘ నియూమకం కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. ఇంతవరకు అనుమతి రాలేదని చెప్పారు.
 
 ప్రశ్నిస్తారన్న భయంతోనే..
 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రేషన్ సరుకుల పంపిణీలో పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని ఆహార సలహా సంఘ సభ్యులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ఏర్పాటు వ్యవహారాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేపట్టడంతో సరుకుల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అలాగే అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలకు బదులు ఐదు కిలోల బియ్యం ఇస్తున్నారు. అలాగే ఐరిష్, వేలిముద్రలు పడక చాలా మందికి నిత్యావసర సరుకులు పంపిణీ కావడం లేదు. ఇలాంటి సమయంలో ఆహార సలహా సంఘ సమావేశాలు జరిగినా, నూతన కమిటీలు ఏర్పాటు చేసినా తమకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశం నాయకుల్లో ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement