BPL
-
బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూత
ఎలక్ట్రానిక్స్ సంస్థ బీపీఎల్ (బ్రిటిష్ ఫిజికల్ లేబొరేటరీస్ ఇండియా ) గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎమిరిటస్ చైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ (94) గురువారం కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 10.15 గంటల ప్రాంతంలో మరణించారు.టీపీజీగా ప్రసిద్ధి చెందిన ఆయన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కి మామగారు. ఈ వార్తను ధ్రువీకరిస్తూ చంద్రశేఖర్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “బీపీఎల్ గ్రూప్ చైర్మన్, నా మామగారు టీపీజీ నంబియార్ మరణించడం గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం శాంతి.." రాసుకొచ్చారు.నంబియార్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేశారు. “టీపీజీ నంబియార్ భారతదేశ ఆర్థిక బలోపేతాన్ని బలంగా కాంక్షించిన మార్గదర్శక ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త. ఆయన మృతి బాధ కలిగింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13,000 పరుగులు మైల రాయిని అందుకున్న తొలి ఏషియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో మాలిక్ రెండో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(14562) ఉన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఈ లీగ్‌లో రంగాపూర్ రైడర్స్‌కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడయ్యాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మాలిక్ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. ఈ విషయాన్ని సానియా- మాలిక్ ఇద్దరూ దృవీకరించారు. కాగా వీరిద్దరికి 2010లో వివాహం జరిగింది. చదవండి: U19 World Cup 2024: వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా.. 84 పరుగులతో బంగ్లా చిత్తు -
2014కు ముందు సర్వం అవినీత, కుంభకోణాలమయం
భోపాల్: దేశంలో 2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే రాజ్యమేలాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజల హక్కులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ము వారికి చేరకుండా మధ్యలోనే లూటీ చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అరాచకానికి తెరపడిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకే పంపిస్తున్నామని ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ నివేదికను ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏకంగా 13.50 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖ దిగువ(పీబీఎల్) కేటగిరీ నుంచి బయటపడ్డారంటూ నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. పన్నుల సొమ్మును మంచి పనుల కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న నమ్మకం వారిలో కనిపిస్తోందని చెప్పారు. సోమవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. భోపాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘అమృతకాలంలో’ తొలి సంవత్సరం నుంచే సానుకూల వార్తలు రావడం ఆరంభమైందని, దేశంలో సంపద వృద్ధి చెందుతోందని, పేదరికం తగ్గిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసే వారి సగటు వార్షికాదాయం ఆదాయం 2014లో రూ.4 లక్షలు ఉండేదని, ఇప్పుడు అది రూ.13 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రజలు దిగువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గంలోకి చేరుకుంటున్నారని మోదీ తెలిపారు. దేశమంతటా సానుకూల వాతావరణం దేశంలో దాదాపు అన్ని రంగాలు బలోపేతం అవుతున్నాయని, అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రధాని చెప్పారు. 2014లో మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. కొత్తగా నియమితులైన 5,580 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచి్చంది. -
పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన
బెంగళూరు: కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.2,000 సాయంగా అందించనున్నట్లు చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రకటిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు సీఎం బసవరాజ్ బొమ్మై వివరిస్తారన్నారు. ఈ ఏడాది జులై నుంచే పథకం అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉండే మహిళకు ప్రతినెల రూ.2,000ల చొప్పున సంవత్సరానికి రూ.24,000 ఇస్తామని చెప్పారు. ఆ మరునాడే అధికార పార్టీ మంత్రి పేదలకు రూ.2,000 పథకం ప్రకటించడం గమనార్హం. 75 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి అశోక. కర్ణాటకలో మరోమారు తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
షావుకార్ల కక్కుర్తి!
బీఎండబ్ల్యూ, టయోటా, ఫార్చునర్, ఫోర్డ్స్, ఫోక్స్‌వ్యాగన్ తదితర విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న కుటుంబాల వద్ద అంత్యోదయ, బీపీఎల్ రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలు అనేక ఏళ్లుగా ప్రతినెల నిరుపేదలకు అందించే ఉచిత బియ్యం, రాగులు, జొన్నలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన కార్లు కలిగి నిబంధనలకు విరుద్ధంగా బీపీఎల్, అంత్యోదయ కార్డులతో బియ్యం తీసుకుంటున్న 12 వేల కుటుంబాలతో పాటు మరో 3.30 లక్షల కుటుంబాల రేషన్‌కార్డులను ఆహార పౌరసరçఫరాల శాఖ రదు చేసింది. బనశంకరి: రాష్ట్రంలో రేషన్‌కార్డులు పొందిన వేలాదికుటుంబాలు వైట్‌బోర్డు కారు ఉన్నట్లు ఆహార పౌరసరఫరాలశాఖకు సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖను ఆశ్రయించిన పౌరసరఫరాల శాఖ... రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు కారు కొనుగోలు చేసి రిస్ట్రేషన్ చేయించిన వారి సమాచారం అందించాలని కోరింది. రవాణాశాఖ అందించిన సమాచారంతో రేషన్‌కార్డులకు అనుసంధానమైన ఆధార్‌కార్డును పరిశీలించగా 12,584 కుటుంబాలు కార్లు కలిగి ఉన్నప్పటికీ బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నట్లు వెలుగుచూసింది. అందులో కలబుర్గిలో ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ, బెంగళూరు గ్రామాంతర, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, కలబుర్గిలో టయోటా, ఫార్చునర్, చామరాజనగరలో ఫోర్డు, మండ్యలో ఎంజీ మోటార్, హాసనలో ఫోక్స్‌వ్యాగన్, చిక్కమగళూరులో మహింద్రజీప్ కలిగిన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకున్నామని ఆహార పౌరసరఫరాలశాఖ తెలిపింది. కార్లు కలిగిన కార్డుదారుల సంఖ్య కార్లు కలిగిన కుటుంబాలు బీపీఎల్, అంత్యోదయ రేషన్‌కార్డులు తీసుకున్న వారి సమాచారం జిల్లాల వారిగా సేకరించారు. కలబుర్గిలో 2114, చిక్కమంగళూరులో 1912, బెంగళూరు1312, రామనగర 922, ఉత్తరకన్నడ 553, యాదగిరి 517,శివమొగ్గ 522, బీదర్ 554, బెంగళూరుగ్రామాంతర 547,బెంగళూరు పశి్చమ 485, తుమకూరు 307,చిక్కబళ్లాపుర 296,హావేరి 220, బాగల్కోటె 216,విజయపుర 214,బెంగళూరు ఉత్తర 201, మండ్య 137,దక్షిణకన్నడ 130, బళ్లారి 67, బెంగళూరు తూర్పు 89, చిత్రదుర్గ 43, దావణగెరె 62, ధారవాడ 15, గదగ 15, హాసన 86, కొడగు 21, కోలారు 65, కొప్పళ 29, మైసూరు 123, రాయచూరు 39, ఉడుపి 42 మంది నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రేషన్ కార్డులు: మానవవనరుల శాఖ నిర్వహణ వ్యవస్థ(హెచ్ఆర్ఎంఎస్) ఆయా శాఖల నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ మండలి, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల సమాచారం సేకరించింది. వారి ఆధార్‌కార్డులను పరిశీలించగా 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి రేషన్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. వీరికి నోటీస్ జారీచేసి జరిమానా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. జిల్లాల వారీగా రద్దైన కార్డులు నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థ్దికంగా నిరుపేదలమని తీసుకున్న 3,30,024 రేషన్‌కార్డులను పౌరసరఫరాలశాఖ రద్దు చేసింది. వీటిలో అంత్యోదయ 21,679, బీపీఎల్ 3,08,345 బీపీఎల్‌కార్డులు ఉన్నాయి. కొన్ని కార్డులను ఏపీఎల్ గా మార్చారు. అత్యధిక రేషన్‌కార్డులు రద్దుకాబడిన జిల్లాల సమాచారం ఆధారంగా బెంగళూరు 34,705, విజయపుర 28,735, కలబుర్గి 16,945,బెళగావి 16,765, రాయచూరు 16,693, చిత్రదుర్గ 16,537 రేషన్‌కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలశాఖ తెలిపింది. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
ఆ పాత బ్రాండ్లకు ‘భలే’ మంచి రోజులు!
Reliance Retail Brings BPL And Kelvinator: తరాలు తరలిపోతున్న కొద్దీ.. ‘జ్ఞాపకాలు’ మేలనే అభిప్రాయం చాలామందికి కలగడం సహజం. టెక్నాలజీ ఎరాలో ఎన్నో అప్డేట్స్ వెర్షన్లు వస్తున్నా.. పాత వాటికి ఉన్నంత గ్యారెంటీ ఉండట్లేదనే రివ్యూలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి బ్రాండ్లను తిరిగి జనాలకు అందించే ప్రయత్నాలు ఈమధ్యకాలంలో ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్.. బీపీఎల్, కెల్వినేటర్ ఉత్పత్తులను తిరిగి జనాల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎయిటీస్, నైంటీస్ జనరేషన్‌కి బీపీఎల్ టీవీలు, కెల్వినేటర్ స్టెబ్లైజర్, ఫ్రిజ్‌ల లాంటి ప్రొడక్టులతో మంచి అనుభవమే ఉంది. ముఖ్యంగా డబ్బా టైప్ టీవీలు ‘బండ’ బ్రాండ్ అనే అభిప్రాయాన్ని ఏర్పరిచాయి కూడా. ఒకప్పుడు వర్చువల్ ఎంటర్టైన్మెంట్లో బీపీఎల్ టీవీలది అగ్రస్థానం ఉండేది. అయితే మిల్లీనియంలోకి అడుగుపెట్టాక టాప్ టెన్ బ్రాండ్ లిస్ట్ నుంచి కనుమరుగైన బీపీఎల్.. ఇతర కంపెనీల రాక, అటుపై బీపీఎల్‌లో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కారణంగా పతనం దిశగా నడిచింది. ఈ నేపథ్యంలో ‘నమ్మకం’ పేరుతో ప్రచారం చేసుకున్న బీపీఎల్‌ను, కెల్వినేటర్ బ్రాండ్లను రిలయన్స్ రిటైల్ తీసుకురానుంది. క్లిక్: హీరో ఈ-బైక్.. ఇక ఈజీగా! బీపీఎల్.. ది ‘బ్రిటిష్ ఫిజికల్ లాబోరేటరీస్’ 1963 పలక్కాడ్ (కేరళ)లో ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. రిలయన్స్ రిటైల్ ఎలక్ట్రికల్ రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. టీవీ, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, టీవీలు, లైట్ బల్బ్స్, ఫ్యాన్స్ లాంటి ప్రొడక్టుల తయారీతో అమ్మకాలను స్వయంగా నిర్వహించనుంది. ఇప్పటికే కెల్వినేటర్తో ఒప్పందం కుదుర్చుకోగా.. బీపీఎల్‌కు సంబంధించిన ఒప్పందం గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ రెండింటిలతో పాటు మరో రెండు ఓల్డ్ బ్రాండులను సైతం తీసుకొచ్చేందుకు రిలయన్స్ సుముఖంగా ఉంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందించనున్నట్లు సమాచారం. అయితే ఇవి వింటేజ్ మోడల్స్లోనా? లేదంటే అప్డేటెడ్ మోడల్స్లోనా? అనే విషయంపై అధికారిక ప్రకటనల సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: మెగాస్టార్ అద్భుత ప్రయోగం -
సామాన్యుల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ
భారత ప్రభుత్వం ఇప్పటికే పేదల కోసం అనేక సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ఉద్దేశ్యం పేదల జీవితాల్లో వెలుగును తీసుకురావడం. ప్రధానంగా వారికీ సామాజిక భద్రత కల్పించడం. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా “ఆమ్ ఆద్మీ బీమా యోజన” భీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ కింద బీమా చేసిన వ్యక్తికి చాలా ప్రయోజనాలు చేకూర నున్నాయి. ఈ పాలసీ కింద చేరిన వారు భీమా కాలంలో సహజ మరణంతో మరణిస్తే నామినీకి 30 వేల రూపాయలు లభిస్తాయి. యాక్సిడెంటల్ డెత్ కింద మరణిస్తే 75 వేల రూపాయలు అందుతాయి. ఒకవేల ఏదైనా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం కలిగితే 75 వేల రూపాయలు లభిస్తాయి. అలాగే ప్రమాదంలో రెండు కళ్ళు కోల్పోవడం, చేతులు లేదా కాళ్ళు రెండూ కోల్పోయిన వారితో పాటు ఒక కన్ను, ఒక చేయి లేదా కాలు కోల్పోవడంజరిగితే అతనికి 37,500 రూపాయలు లభిస్తాయి. ఈ బీమా పథకం కింద చేరిన తర్వాత పిల్లలకు స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. ఇది అదనపు సేవల కిందికి వస్తాయి. దీని కింద చేరిన వారి ఇద్దరు పిల్లలు 9-12 తరగతుల్లో చదివేటప్పుడు ప్రతి నెలా 100-100 రూపాయలు లభిస్తాయి. ఆరు నెలలకు ఒకసారి జులై, జనవరి మొదటి తేదీల్లో నాలుగు సంవత్సరాల పాటు జమ అవుతాయి. ఈ పథకం కింద కుటుంబంలోని ఒక సభ్యుడిని మాత్రమే భీమా లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి వయస్సు 18-59 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండటం ముఖ్యం. బీమా చేసినవారికి ఏదైనా జరిగితే అప్పుడు డబ్బు నెఫ్ట్ లేదా లబ్ధిదారుని/నామినీ ఖాతాలో జమ అవుతుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం రూ.200 ఇందులో ప్రభుత్వం రూ.100 జమ చేస్తే, బీమా చేసిన వ్యక్తి రూ.100 జమ చేయాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి గ్రామీణ ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే బీడీ కార్మికులు, వడ్రంగి, మత్స్యకారులు, హస్తకళల వంటి 24 రకాల వృత్తుల వారికి వర్తిస్తుంది. చదవండి: ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు 2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం -
మాంసం బాగా తినండి.. హిట్ చేయండి
ఢాకా: ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆ దేశ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా క్రికెటర్ కామెరూన్ డెల్పోర్ట్ ఓ ఉచిత సలహా ఇచ్చేశాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి భారీ హిట్లు రాకపోవడానికి మాంసాహారాన్ని తగినంత తీసుకోలేకపోవడమేనని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్లు మరింత మాంసాహారం తింటే హిట్టింగ్‌కు, ఎక్కువ చెమటోడ్చడానికి ఉపయోగడపడుతుందన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పూర్ రేంజర్స్ తరఫున ఆడుతున్న డెల్పోర్ట్.. ‘క్రికెట్లో మరింత శ్రమించి ఫలితాలు రాబట్టాలంటే మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.బౌండరీ లైన్ పైనుంచి బంతిని హిట్ చేయాలంటే మీరు మాంసాహారం డోస్ పెంచండి. నేను ఫిట్‌గా ఉండటమే కాకుండా బలంగా షాట్లు కొడుతున్నానంటే అందుకు మాంసాహారమే కారణం. బంగ్లాదేశ్‌లో బంతి ఎక్కువగా బౌన్స్ కాదు.. ఎప్పుడూ కింది స్థాయిలోనే వస్తుంది. అదే దక్షిణాఫ్రికాలో అయితే కచ్చితమైన బౌన్స్ ఉంటుంది. మా దక్షిణాఫ్రికా క్రికెటర్లు హిట్టర్లు కావడానికి మా ట్రూ బౌన్సే ఒక కారణం. మరి బౌన్స్లేని బంగ్లాదేశ్‌లో భారీ హిట్లు చేయాలంటే కండరాలకు మరింత శక్తి కావాలి. అది మాంసాహారం వల్లే వస్తుంది. బాగా మాంసం తినండి.. హిట్ చేయండి’ అంటూ బంగ్లాదేశ్ క్రికెటర్ల పేలవ ప్రదర్శనను వేలెత్తి చూపాడు.(ఇక్కడ చదవండి: ఇది మ్యాచ్ ఫిక్సింగ్ బౌలింగా?) -
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ బౌలింగా?
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) బుధవారం ఆరంభం కాగా ఓ బౌలింగ్ వేసిన తీరు నవ్వులు తెప్పించడమే కాదు.. అనేక అనుమానాలకు తావిచ్చింది. వెస్టిండీస్‌కు చెందిన 34 ఏళ్ల ఎడమ చేతి మీడియం పేసర్ క్రిష్‌మర్ సంతోకి బీపీఎల్‌లో సిలెట్ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టాగ్రామ్ చాలెంజర్స్‌తో జరిగిన ప్రారంభపు మ్యాచ్‌లో సంతోకి వేసిన బంతులు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు అతడు ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ.. లెగ్‌సైడ్‌కు అత్యంత దూరంగా ఫుల్‌టాస్ వేయడం గమనార్హం. ఆ బంతి వికెట్‌కు ఎంత దూరంగా వెళ్లిదంటే టెస్ట్‌ల్లోనూ ఆ బంతిని నిస్సందేహంగా వైడ్‌గా ప్రకటించేంతగా. ఆ బంతిని అందుకొనేందుకు కీపర్ ఎడమవైపుకు బాగా డైవ్ కొట్టి మరీ ఆపాడు. ఇక.. క్రిష్‌మర్ వేసిన నోబ్ను చూసి‘ ‘క్రికెట్లో ఇలాంటి నోబాల్ కూడా వేస్తారా?’ అనిపించింది. అతడి కుడికాలు క్రీజ్‌కు చాలా దూరంగా పడింది. దాంతో సంతోకి బౌలింగ్‌పై నెటిజన్లు అనుమానాలు వ్యక్తంజేశారు. సంతోకి అనుమానాస్పద బౌలింగ్‌పై విచారణ చేయాలని బంగ్లా క్రికెట్ బోర్డును కోరామని సిలెట్ థండర్ డైరెక్టర్ తంజిల్ చౌధురి పేర్కొన్నారు. ‘ నో బాల్-వైడ్‌పై విచారణకు ఆదేశించాం. ఓవరాల్‌గా మాకు బరిలోకి దిగే ఎలెవన్ జట్టుపై మా జోక్యం ఉండదు. అది మేనేజ్మెంట్, కోచ్ పని. దీనిపై స్పాన్సర్ల ప్రమేయం ఏమైనా ఉందని అడిగా. కానీ వారు చెప్పలేదు. ఇక ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. సంతోకి ఇలా బౌలింగ్ చేసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డడా అనే అనుమానం కూడా ఉంది. సంతోకి ఇలా చేయడానికి ఎవరి ప్రమేయం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తాం’ అని తంజిల్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో సంతోకి 4 ఓవర్లు బౌలింగ్ వేసి 34 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో సిలెట్ థండర్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిలెట్ థండర్ నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను చట్టాగ్రామ్ చాలెంజర్స్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టీ20 మ్యాచ్‌లో సంతోకి ఒక నోబాల్‌తో పాటు 4 వైడ్లు వేశాడు. దాంతోనే అతని బౌలింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. A no-ball bowled by Krishmar Santokie in the opening match of the Bangladesh Premier league #BPL2019 today. pic.twitter.com/Lvzut5d0Gz — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 -
ఫీజు పెంపుపై కొద్దిగా వెనక్కి
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయంపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వెనక్కి తగ్గింది. ఎలాంటి స్కాలర్షిప్ తీసుకోని పేద(బీపీఎల్) విద్యార్థులకు హాస్టల్ ఫీజు పెంపును తాత్కాలికంగా రద్దుచేసింది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపస్ వెలుపల ఈసీ సమావేశమైంది. ఈ నిర్ణయాన్ని కంటితుడుపు చర్యగా పేర్కొన్న విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించాయి. వర్సిటీ సర్వీస్ చార్జి రూ.1,700 పెంచడంతోపాటు వన్‌టైమ్ మెస్ సెక్యూరిటీ ఫీజును రూ.5,500 నుంచి రూ.12,000 వేలకు పెంచింది. బీపీఎల్‌యేతర విద్యార్థులకు ఉపశమనం కలిగించలేదు. -
సరికొత్తగా టీ20 లీగ్.. ఇవేం రూల్స్‌రా నాయనా..!
ఢాకా : బంగ్లాదేశ్ టీ20 ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలతో విభేదాల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీపీఎల్‌లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అన్ని దేశాలు పాటించిన రూల్స్‌నే అనుసరించిన బంగ్లా క్రికెట్ బోర్డు బీపీఎల్‌ను తన అధీనంలోకి తీసుకుని తాజా నిర్ణయాలను ప్రకటించింది. మేటి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తమ దేశ క్రికెటర్లు టీ20 ఫార్మాట్లో మెరుగ్గా రాణించేందుకు తాజా నిబంధనలు దోహదపడతాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మహబూబల్ అనమ్ చెప్పారు. వచ్చే సీజన్ నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని వెల్లడించారు. కాగా, ఏడు ప్రాంచైజీలు ఉన్న బీపీఎల్‌లో ఆరు జట్ల యజమానులతో బంగ్లా క్రికెట్ బోర్డుకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో బంగ్లా ప్రీమియర్ లీగ్‌ను బంగ్లా బోర్డు అధీనంలోకి తీసుకుంది. అయితే, బీసీబీ కొత్త నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. మోకాలుకు బోడి గుండుకు ముడిపెట్టుగా రూల్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సరుకంతా విదేశాలదైతే బంగ్లా ప్రీమియర్ లీగ్ అనే పేరెందుకుని క్రికెట్ అభిమానులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బంగ్లా టీ20 ప్రీమియర్ లీగ్ తాజా రూల్స్.. ఏడు టీమ్‌లలో ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్ తప్పనిసరి. అతను 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలగాలి టీమ్‌లో ఒక లెగ్ స్పిన్నర్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి జట్టులో ఉన్న మణికట్టు స్పిన్నర్ తప్పనిసరిగా పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేయాలి విదేశీ ప్రధాన కోచ్, ఫిజియోథెరపిస్టు, ట్రెయినర్లే ఉండాలి. స్వదేశానికి చెందిన కోచ్‌లు ఈ ప్రధాన కోచ్‌కు సహాయకుడిగా మాత్రమే ఉంటారు. టీమ్‌లకు డైరెక్టర్‌ను ఎంపిక చేసే అధికారం బీసీబీ డైరెక్టర్‌కు ఉంటుంది. -
‘బిగ్ స్క్రీన్’పై చిన్న బ్రాండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఈడీ టీవీల మార్కెట్లో ‘అఫర్డబుల్’ విభాగం హవా నడుస్తోంది. 24–55 అంగుళాల శ్రేణిలో పెద్ద బ్రాండ్ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ క్రమంగా తన వాటాను పెంచుకుంటోంది. రూ.7 వేలతో మొదలై రూ.35 వేల శ్రేణిలో అతి తక్కువ ధరలతో టీవీల రంగంలో సంచలనానికి కారణమైన అందుబాటు ధరల (అఫర్డబుల్) విభాగం వాటా ప్రస్తుతం 32 శాతంగా ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 65 శాతానికి చేరుతుందనేది మార్కెట్ వర్గాల అంచనా. ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుని వాటాను పెంచుకోవచ్చన్నదే ఈ రంగంలోని కంపెనీల ప్రధాన ధీమా. ఎంఐ, కొడాక్, థామ్సన్, బీపీఎల్, హోమ్, టీసీఎల్, శాన్యో, వ్యూ, రికనెక్ట్, ఒనిడా, షార్ప్, స్కైవర్త్, అకాయ్ వంటి బ్రాండ్లు దిగ్గజాలతో పోటీపడుతూ ‘స్మార్ట్’గా మార్కెట్‌ను కైవసం చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇవి పెద్ద తెరల విభాగంలో (32 అంగుళాలకన్నా ఎక్కువ) క్రమంగా తమ వాటాను పెంచుకుంటున్నాయి. ఇదీ ఎల్ఈడీల మార్కెట్.. దేశవ్యాప్తంగా ఎల్ఈడీ టీవీల రంగంలో 70కిపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఏటా 1.4 కోట్ల యూనిట్ల ఎల్ఈడీ టీవీలు అమ్ముడవుతున్నాయి. ఇందులో అందుబాటు ధరల విభాగానిది 32 శాతం వాటా. వచ్చే అయిదేళ్లలో ఇది 65 శాతానికి చేరడం ఖాయమని భారత్‌లో కొడాక్, థామ్సన్ టీవీ బ్రాండ్ల లైసెన్స్ కలిగి ఉన్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మొత్తం విపణిలో స్మార్ట్ టీవీల వాటా 70 శాతముంది. అలాగే ఆన్లైన్ విక్రయాలు 27 శాతం, ఆఫ్‌లైన్ అమ్మకాలు ఏకంగా 73 శాతం ఉన్నాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాదిరిగా అందుబాటు ధరల్లో, మంచి ఫీచర్లతో విక్రయించే మోడళ్లే ఇటు టీవీల రంగంలోనూ నిలదొక్కుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అఫర్డబుల్ విభాగంలో హెచ్డీ, ఫుల్ హెచ్డీతోపాటు 4కే టీవీలూ వచ్చేశాయి. రూ.22,000 కోట్ల ఎల్ఈడీ టీవీల విపణిలో 43–55 అంగుళాల విభాగం వాటా 30 శాతముంది. ఈ విభాగమే వేగంగా వృద్ధి చెందుతోంది. ఆన్లైన్ ఆసరాగా.. ఆఫ్‌లైన్ విభాగంలో లార్జ్ ఫార్మాట్ స్టోర్లయినా, చిన్న దుకాణమైనా పెద్ద బ్రాండ్ల హవానే నడుస్తోంది. ఆ స్థాయిలో దుకాణాల్లో స్థలాన్ని పెద్ద కంపెనీలు ఆక్రమించేశాయి. చిన్న బ్రాండ్లకు చోటు లేకుండా పోయింది. దీంతో చిన్న కంపెనీలు ఆన్‌లైన్‌ను ఆశ్రయించాయి. అఫర్డబుల్ సెగ్మెంట్ బ్రాండ్ల టీవీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా ఏకంగా 70 శాతముందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘ఉదాహరణకు టీవీ కోసం ఒక కస్టమర్ వెచ్చించే స్థాయి రూ.30 వేలు అనుకుందాం. పెద్ద కంపెనీతో పోలిస్తే అందుబాటు ధరలో లభించే బ్రాండ్‌లో ఈ వ్యయంతో పెద్ద తెరతో టీవీ వస్తుంది. అలాంటప్పుడు వినియోగదారుడు పెద్ద టీవీ వైపే మొగ్గు చూపుతాడు. పైపెచ్చు నాణ్యత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఫీచర్లు అంటారా బోలెడన్ని ఉంటున్నాయి’ అని ఓ విక్రేత వివరించారు. చిన్న బ్రాండ్లు సర్వీసింగ్‌పై మరింత ఫోకస్ చేస్తే అమ్మకాలు అధికం అవుతాయని సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కర్ మూర్తి అభిప్రాయపడ్డారు. అఫర్డబుల్ బ్రాండ్ల టీవీల స్క్రీన్ శాంసంగ్, ఎల్జీ వంటి ప్రముఖ బ్రాండ్లు తయారు చేసినవే ఉంటున్నాయి. -
11 సిక్సర్లు, 10 ఫోర్లతో చెలరేగిపోయాడు!
ఢాకా: బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తమీమ్ ఇక్బాల్.. తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం ఢాకా డైనమేట్స్తో జరిగిన తుది పోరులో ఇక్బాల్ చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 11 సిక్సర్లు, 10 ఫోర్లు సాయంతో అజేయంగా 141 పరుగులు సాధించాడు. దాంతో కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన ఢాకా డైనమేట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్(6) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత అనముల్ హక్‌తో కలిసి ఇక్బాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి రెండో వికెట్ 89 పరుగులు జోడించిన తర్వాత అనముల్(24) ఔటయ్యాడు. ఆపై వెంటనే షమ్సూర్ రెహ్మాన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్న ఇక్బాల్ తన దూకుడుగా మరింత పెంచాడు. క్రీజ్‌లో పాతుకుపోయి ఆకాశమేహద్దుగా విజృంభించాడు. ఈ క్రమంలోనే 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఆటను కడవరకూ కొనసాగించడంతో కొమిల్లా 200 లక్ష్యాన్ని ఢాకా డైనమేట్స్ ముందుంచింది. లక్ష్య ఛేదనలో ఢాకా పరుగుల ఖాతా తెరవకుండానే సునీల్ నరైన్ వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో ఉపుల్ తరంగా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు,, 3సిక్సర్లు)-రోనీ తలుక్దర్(66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో ఢాకా విజయం దిశగా పరుగులు తీసింది.కాగా, ఉపుల్ తరంగా రెండో వికెట్‌గా ఔటైన తర్వాత ఢాకా స్కోరులో వేగం తగ్గింది. రోనికి మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో ఢాకా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఫలితంగా కొమిల్లా 17 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. కొమిల్లా బౌలర్లలోవహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ సైఫుద్దీన్, తిషారా పెరీరాలు తలో రెండు వికెట్లు తీశారు. ఇది కొమిల్లా విక్టోరియన్స్‌కు రెండో టైటిల్. -
అచ్చం ధోనిలానే..!
-
అచ్చం ధోనిలానే..!
చట్టోగ్రామ్: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఎంత చురగ్గా ఉంటాడో అందరికీ విదితమే. ప్రపంచ క్రికెట్లో ధోనిలా ఫీల్డింగ్ చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ధోనికి పెద్ద అభిమాని అయిన అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ షెహజాద్ వికెట్ల వెనుక మెరుపులు మెరిపిస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా చిట్టగాంగ్ వికింగ్స్తో తరఫున ఆడుతున్న షెహజాద్ కనీసం వికెట్లవైపు చూడకుండా ఢాకా డైనమెట్స్ ఓపెనర్ రెహ్మాన్‌ను ఔట్ చేసి తీరు ధోనిని గుర్తు చేసింది. ఈ మ్యాచ్ బుధవార జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నయీమ్ హసన్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి క్రీజ్ బయటకకు వచ్చి షాట్ ఆడబోయిన రెహ్మాన్ బంతిని హిట్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తాకిన బంతి క్రీజుకి సమీపంలో నిలిచిన క్రమంలో రెహ్మన్ పరుగు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో వికెట్ల వెనుక నుంచి దూసుకొచ్చిన షెహజాద్.. బంతిని అందుకున్న మరుక్షణమే వికెట్లను గిరటేశాడు. బ్యాట్ గాల్లో ఉండగానే స్టంప్స్ పడిపోవడంతో రెహ్మాన్ రనౌట్‌గా నిష్క్రమించక తప్పలేదు. దాంతో వికెట్ల వైపు చూడకుండానే బంతిని నేరుగా స్టంప్స్‌పైకి వేయడంలో దిట్ట అయిన ధోనిని గుర్తు చేసుకోవడం అభిమానుల వంతైంది. -
గార్డ్ ఛేంజ్ చేసి మరీ రెచ్చిపోయాడు
సిల్హెట్: బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు అంతర్జాతీయ నిషేధం గురైన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరో రెండు నెలల్లో నిషేధం పూర్తి చేసుకోబోతున్నాడు. మార్చి నెల చివరి వారంతో అతనిపై విధించిన నిషేధం పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలోనే విదేశీ లీగ్‌లో పాల్గొంటూ తన ఫామ్‌ను పునికిపుచ్చుకునే పనిలో ఉన్నాడు డేవిడ్ వార్నర్. ఇప్పటికే కెనడా లీగ్ ఆడిన వార్నర్.. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడుతున్నాడు. బీపీఎల్‌లో సిల్హెట్ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా వ్యహరిస్తున్న వార్నర్ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. రంగాపూర్ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేశాడు. అయితే ఇందులో కొన్ని బంతులు ఆడటానికి తన బ్యాటింగ్ గార్డ్‌ను మార్చుకుని సాధించడం విశేషం. స్వతహాగా ఎడమచేతి వాట బ్యాట్స్‌మన్ అయిన వార్నర్.. గేల్ వేసిన 19 ఓవర్ నాల్గో బంతికి ఉన్నపళంగా గార్డ్ మార్చుకున్నాడు. అంతకుముందు బాల్‌ను హిట్ చేద్దామని ప్రయత్నించిన వార్నర్ విఫలం కావడంతో కుడి చేతి వాటం బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్‌కు తెలిపిన వార్నర్.. రైట్ హ్యాండ్‌తో ఆడిన మొదటి బంతిని సిక్స్‌గా కొట్టాడు. ఆ తర్వాత వరుస రెండు బంతుల్ని రెండు ఫోర్లు కొట్టి మరీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 47 పరుగుల్ని లెఫ్ట్ హ్యాండర్‌గా సాధించగా, 3 బంతుల్లో 14 పరుగుల్ని రైట్ హ్యాండర్‌గా సాధించాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌కు జతగా లిటన్ దాస్(70; 43 బంతుల్లో 9ఫోర్లు 1 సిక్సర్) రాణించడంతో సిల్హెట్ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో రంగపూర్ రైడర్స్ ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి ఓటమి పాలైంది. -
ఆమడ దూరంలో!
సాక్షి, పెద్దపల్లి : రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పట్టణవాసులు మా పరిస్థితి ఇంతేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీ-థర్మల్ పరిరక్షణతో పాటు నూతన విద్యుత్కేంద్రం ఏర్పాటు, బీపీఎల్ భూముల సమస్య, రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చడం, పెద్ద చెరువును మినీట్యాంక్ బండ్‌గా చేయడం.. అంతర్గాం టెక్స్టైల్ కార్మికుల సమస్యలు ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. విస్తరణకు నోచుకోని బీథర్మల్.. రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జూలై 19న శంఖుస్థాపన చేశారు. అప్పుడు రూ. 14.8 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దీనిని జవహర్లాల్ నెహ్రూ థర్మల్ విద్యుత్తు కేంద్రంగా నామకరణం చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడంతో ఆంధ్రాలోనూ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలని తలిచి విజయవాడ సమీపంలో నిర్మించతలపెట్టారు. దీంతో రామగుండం బి-థర్మల్ను 62.5 మెగావాట్లకు సరిపెట్టారు. ఆ తర్వాత బిథర్మల్ కేంద్రం విస్తరణకు నోచుకోలేదు. నేటి పాలకులు రామగుండంను విద్యుత్ హబ్‌గా మార్చుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నిరుపయోగంగా వేలాది ఎకరాలు.. 1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జపాన్)లకు దశలవారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న ఏపవర్‌హౌస్ స్థలం 750 ఎకరాలతో పాటు మరిన్ని అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి రూ. 150 కోట్ల వ్యయమంతో ప్రహరీ నిర్మాణాలు ఎకరాల విలువైన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరికీ పట్టని రాముని గుండాలు.. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన రామగుండం సమీపంలోని రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా రామునిగుండాలు ఉండడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయం కావడంతోనే ప్రపంచ దేశ, రాష్ట్ర చిత్రపటాలలో రామగుండంకు ప్రత్యేక పేరుంది. రామునిగుండాలలో రామలక్ష్మణుడు సంచరించినట్లు ఆనవాళ్లుఉన్నాయి. కొండపై 108 గుండాలున్నాయి. గుట్టపై 200 ఫీట్ల లోతు, 50 ఫీట్ల వెడల్పుతో ఓలోయ ఉంది. లోయకు పైభాగాన ఉన్న బావిలో సీతాదేవి స్నానమాచరించిందని ప్రతీతి. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రికల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరువచ్చింది. 108 గుండాలలో అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా ఉండడం విశేషం. దీనిని ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవికూడా నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆమడదూరం పెద్ద చెరువు.. పట్టణంలోని 210 ఎకరాల విస్తీర్ణంలో నియోజకవర్గ పరిధిలోనే పెద్దచెరువు. ఇందులోకి ఎన్టీపీసీకి చెందిన బూడిద నీరు చేరుతుండడంతో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క పెరగడంతో పాటు కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఇందులో వేయడంతో చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి కలుషితమవుతుంది. దీని కింద సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిని గడిచిన పాలకవర్గం మినీ ట్యాంకుబండ్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ వర్గ విభేధాలతో మరో చెరువును ఎంపిక చేశారు. దీంతో అభివృద్ధికి పుల్‌స్టాప్ పడింది. -
వికెట్ కూడా 'ఔట్' అయ్యింది!
ఢాకా:సాధారణంగా ఫాస్ట్ బౌలర్ వేసిన బంతికి బ్యాట్ ముక్కలవడం కానీ, వికెట్ విరిగి పడటం కానీ చూస్తూ ఉంటాం. అయితే ఒక స్పిన్నర్ వేసిన బంతికి వికెట్ విరిగి ముక్కలవడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ తరహాలో స్పిన్నర్ బౌలింగ్ లో వికెట్ సగానికి విరిగిన ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో చోటు చేసుకుంది. అఫ్ఘనిస్తాన్ స్సిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఓ బంతి బ్యాట్స్ మన్ వెనుక ఉన్న మిడిల్ స్టంప్ ను బలంగా తాకింది. దీంతో ఆ వికెట్ ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం చిట్టగాంగ్-కొమిల్లా విక్టోరియా మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. దానిలో భాగంగా ఈ టోర్నీలో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌ఖాన్ 16 వ ఓవర్ వేసేందుకు కు బంతిని అందుకున్నాడు. రషీద్ వేసిన రెండో బంతిని చిట్టగాంగ్ కు ఆడుతున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ మునవీర ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతిని బ్యాట్స్‌మెన్ తప్పుగా అంచనా వేయడంతో అది వేగంగా వెళ్లడమే కాకుండా నేరుగా వెళ్లి మిడిల్ వికెట్ ను తాకింది. దీంతో మధ్యలో ఉన్న వికెట్ ముక్కలైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది, రషీద్ వేసిన గూగ్లీకి బ్యాట్స్‌మెన్‌తో పాటు వికెట్ కూడా ఔట్ అయింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అఫ్ఘాన్ సంచలనమైన రషీద్ ఖాన్ గడిచిన ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. -
స్పిన్నర్ వేసిన బంతికి వికెట్ విరిగింది
-
కిరోసిన్‌కు ‘పొగ’
- ఈ నెల కోటాలో కోత - జిల్లాకు ఇవ్వాల్సింది 1800 కిలోలీటర్లు.. ఇచ్చింది 1224 కిలోలీటర్లు - దానినే చౌక దుకాణాలకు సర్దుబాటు చేసిన అధికారులు - చివరిలో వచ్చే కార్డుదారులకు మొండిచేయే.. కాకినాడ సిటీ : చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై ఇస్తున్న కిరోసిన్‌కు ‘పొగ’ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ కార్డులపై ఇస్తున్న ఒకటి రెండు లీటర్ల కిరోసిన్‌ను రెండు మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తోంది. రాష్ట్రాన్ని పొగ రహితంగా ప్రకటించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో జిల్లాకు కిరోసిన్ కేటాయింపులను ఆలస్యం చేసింది. మామూలుగా ప్రతి నెలా 20వ తేదీలోగానే చౌకదుకాణాలకు తరువాతి నెల సరుకుల కేటాయింపులు పూర్తయ్యేవి. కానీ ఈ నెలలో కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభించిన మూడు రోజులకు ప్రభుత్వం జిల్లాకు కిరోసిన్ కోటా కేటాయింపులు ఇచ్చింది. అది కూడా ఇవ్వాలిన కోటాలో కోత పెట్టింది. జిల్లాలోని మొత్తం 2,647 చౌక దుకాణాల పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, తెల్ల కార్డుదారులు 16,11,494 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్లు, ఉన్నవారికి ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. దీని ప్రకారం జిల్లాకు 1800 కిలోలీటర్ల కిరోసిన్ కావాలి. కానీ ప్రభుత్వం కోత పెట్టడంతో 1224 కిలోలీటర్ల కిరోసిన్ మాత్రమే ఇంతవరకూ వచ్చింది. అరకొర కేటాయింపులే.. చాలీచాలకుండా వచ్చిన ఆ కిరోసిన్‌ను సర్దుబాటు చేసేందుకు పౌర సరఫరాల అధికారులు తర్జనభర్జన పడ్డారు. చివరకు జిల్లాకు అరకొరగా వచ్చిన కిరోసిన్‌ను ఒక్కో చౌక దుకాణానికి 75 శాతం చొప్పున కేటాయించారు. దీని ప్రకారం హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లు రేషన్ దుకాణాలకు సరుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సగంమంది రేషన్ డీలర్లకు మాత్రమే కిరోసిన్ అందించారు. మిగిలినవారికి పూర్తి స్థాయిలో ఇవ్వడానికే మరో రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు. దీనినిబట్టి కార్డుదారులకు కిరోసిన్ చేరడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం మంది కార్డుదారులు కిరోసిన్ లేకుండానే ఉన్న సరుకులు తీసుకుని వెళ్లిపోయారు. అరకొర కేటాయింపుల కారణంగా ముందుగా వచ్చేవారికి తప్ప చివరిలో వచ్చేవారికి కిరోసిన్ దొరకని పరిస్థితి ఏర్పడనున్నది. భారమన్న ఉద్దేశంతోనే.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని భారంగా భావిస్తున్న ప్రభుత్వం దానిని ఎలాగోలా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్రం చక్కెర సబ్సిడీని తొలగించడంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలకు ఈ నెల పంచదారను విడుదల చేయలేదు. గోదాంలలో ఉన్న అరకొర నిల్వలనే జిల్లా అధికారులు చౌక దుకాణాలకు సర్దుబాటు చేశారు. కిరోసిన్ విషయానికి వస్తే.. పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు గతంలో ఇస్తున్న 4 లీటర్ల కిరోసిన్‌ను గత నెల నుంచి 2 లీటర్లకు ప్రభుత్వం కుదించింది. తాజాగా ఈ నెల కేటాయింపుల్లోనే కోత పెట్టింది. కిరోసిన్ పంపిణీ చేపట్టాం జిల్లాలోని కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేపట్టాం. కేటాయింపులు ఆలస్యం కావడంతో పంపిణీలో జాప్యం జరిగింది. గత నెల సీబీ, ఈ నెల కేటాయించిన కోటా కలుపుకుని చౌకదుకాణాలకు కిరోసిన్‌ను సర్దుబాటు చేశాం. -
ఫ్లిప్‌కార్ట్ కు భారీ ఎదురుదెబ్బ
ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు కంపెనీలు పడుతున్న పోటాపోటీ మనకు తెలిసిందే. పోటీ తీవ్రతరమవుతున్న క్రమంలో దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు జరిపే, వైట్ గూడ్స్ తయారీ సంస్థ బీపీఎల్ అమెజాన్ ప్లాట్ ఫామ్ పైకి వెళ్లింది. గురువారం నుంచి అమెజాన్ పై తమ ఉత్పత్తులను ఎక్స్ క్లూజివ్ గా అమ్మనున్నట్టు ఈ కంపెనీ ప్రకటించింది. 1990లో మోస్ట్ పాపులర్ టెలివిజన్ బ్రాండ్స్ లో ఒకటిగా బీపీఎల్ ఉండేది. తర్వాత ఈ కంపెనీ 2006లో ఎలక్ట్రానిక్స్ ను విక్రయించడం ఆపివేసింది. కానీ గతేడాదే ఆ కంపెనీ మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద ఉపకరణాల అమ్మకాల్లో ఈ కంపెనీకి చెందిన ఉత్పత్తులే సుమారు 12 శాతం పైగా ఉన్నాయని బీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అజిత్ నాంబియార్ చెప్పారు. ఈ ప్లాట్ ఫామ్ పై సుమారు 175 కోట్ల మేర విలువైన ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనాలున్నట్టు తెలిపారు. కానీ ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలపై నాంబియార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ విక్రయాలు మరింత పెంచుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో కంపెనీ అమెజాన్ ప్లాట్ ఫామ్ కు మరలినట్టు తెలిపారు. అమెజాన్ తో దీర్ఘకాలిక వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యం కోరుకుంటున్నామని నాంబియార్ చెప్పారు. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు, ఎక్కువగా దేనికోసం సెర్చ్ చేస్తుంటారు వంటి సమాచారాన్ని ఎప్పడికప్పుడూ అమెజాన్ షేరు చేస్తుందని, కొత్త ఉత్పత్తుల లాంచింగ్ లో ఇది ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అమెజాన్ ప్లాట్ ఫామ్ పై ఈ కంపెనీ వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్స్ ను లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ టర్నోవర్ గతేడాది 550 కోట్ల రూపాయలుగా ఉంది. మెడికల్ డివైజ్ తయారీలో ఇది అతిపెద్ద వ్యాపారాలను కలిగి ఉంది. ఈ వ్యాపారాలే కంపెనీకి 350 కోట్ల మేర ఉన్నాయి. -
త్వరలో బీపీఎల్ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు
హైదరాబాద్: బీపీఎల్ కంపెనీ త్వరలో మైక్రో వేవ్ ఓవెన్లు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కూలర్లు, ఏసీలను అందించనున్నది. ప్రస్తుతం తామందిస్తున్న ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని బీపీఎల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ అంచనాలను మించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఆర్జించబోతున్నామని బీపీఎల్ సీఎండీ అజిత్ నంబియార్ పేర్కొన్నారు. కొత్తగా అందించనున్న ఓవెన్లు, ఏసీలు తదితర ఉత్పత్తులతో మూడేళ్లలో రూ.500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రస్తుతం 4 రకాల ఎల్ఈడీ టీవీలను, సెమీ, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. -
‘ఇంటి’గుట్టు రట్టు!
తాడేపల్లిగూడెం రూరల్ : ఇళ్లు నిర్మించుకోవడానికి రుణాలు ఇప్పిస్తామంటూ పలువురు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాలయం వీధిలో నివాసముంటున్న పలువురు పేదలు ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి ఇంటి స్థలం ఉంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ యడల సత్యనారాయణరాజుతో పాటు డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్‌లో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వంగా సంజీవ వరప్రసాద్, ప్రైవేట్ సర్వేయర్ షేక్ రామ్కఫిర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులు పేదల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణమంతా వ్యాపించి చివరకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెవిన పడటంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్ బీహెచ్ సంగీతరావు, పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘరానా మోసగాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారు, బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఎంత మంది మోసపోయారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగవలసి ఉంది. కాగా, నిందితులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. కల్లబొల్లి మాటలు నమొ్మద్దు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ చెప్పే కల్లబొల్లి మాటలను నమొ్మద్దని మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ సూచించారు. బాధితులు ఎంత మంది ఉన్నారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. చీటింగ్ కేసు నమోదు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ యడాల సత్యనారాయణరాజు, వంగా సంజీవ వరప్రసాద్, షేక్ రామ్ కఫీర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులపై బాధితుడు పైడికొండల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఉసూరుమనిపించారు ఇంటి నిర్మాణానికి రుణం కోసం దరఖాస్తు చేశా. రుణం మంజూరైంది బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్థలం పట్టా, రూ.వెయ్యి తీసుకుని రమ్మన్నారు. తీరా అన్ని తీసుకుని వచ్చే సరికి ఇక్కడి పరిస్థితి మరోలా ఉంది. రుణం మంజూ రైందని ఎంతో సంతోషించా...అంతలోనే ఆనందం ఆవిరైపోయింది. – కొండే వెంకాయమ్మ -
క్రికెటర్ హోటల్ రూమ్‌కు 'మహిళా అతిథి'!
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు తన హోటల్ గదికి మహిళా అతిథిని పిలిపించుకొని దొరికిపోయాడు. దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు స్పోర్ట్స్కీడ వెబ్సైట్ వెల్లడించింది. అయితే ఆల్‌రౌండర్ అయిన సదరు క్రికెటర్ పేరును అధికారులు వెల్లడించలేదు. ఆయన గారు హోటల్ గదికి పిలిపించుకున్న విదేశీ మహిళ అవినీతి నిరోధక శాఖ అధికారుల జాబితాలో ఉందని, దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఒప్పందంలో ఉండటం వల్ల ఈ చర్యకుగాను అతనిపై అధికారులు చర్య తీసుకోలేదని, కానీ మహిళా అతిథులను హోటల్ గదులకు పిలించుకోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా అతనిపై ప్రవర్తనపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్లు షబ్బీర్ రహ్మాన్, ఆల్ అమిన్ హుస్సేన్ కూడా ఇలాగే తమ హోటల్ గదులకు అమ్మాయిలను పిలిపించుకొని అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని తీవ్రంగా మందలించిన అధికారులు భారీగా జరిమానాలు విధించారు. ఐపీఎల్ తరహాలో జరుగుతున్న బీపీఎల్ టీ-20 టోర్నమెంటులో దాదాపు 18మంది పాక్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. -
క్రిస్‌గేల్ రికార్డు బద్దలైంది!
మిర్పూర్: వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. బంగ్లాదేశ్ ప్లేయర్ షబ్బీర్ రహమాన్ అద్భుత శతకంతో పాటు గేల్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అదిగమించాడు. బంగ్లా ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరిసాల్ బుల్స్ ప్రత్యర్థి జట్టు రాజ్షాహి కింగ్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యఛేదనకు దిగిన రాజ్షాహి కింగ్స్ ఆటగాడు, షబ్బీర్ రహమాన్ 9 సిక్సర్లు, 4 ఫోర్లతో కేవలం 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. గతంలో బీపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్ (112 పరుగులు) పేరిట ఉండేది. ఈ మ్యాచ్ ద్వారా గేల్ రికార్డును అధిగమించిన షబ్బీర్ మాట్లాడుతూ.. తనశైలికి టీ20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుందన్నాడు. త్వరలోనే తన రికార్డును మరో క్రికెటర్ బ్రేక్ చేస్తాడని షబ్బీర్ అభిప్రాయపడ్డాడు.