బీపీఎల్ కథ కంచికేనా? | BPL kancikena story? | Sakshi
Sakshi News home page

బీపీఎల్ కథ కంచికేనా?

Published Sun, Mar 15 2015 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

BPL kancikena story?

రామగుండంలోని ప్రతిపాదిత బీపీఎల్ (బిటిష్ ఫిజికల్ లాబోరేటరీ) పవర్‌ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఒకే అంటే.. ఇక్కడ విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు బీపీఎల్ అన్ని వనరులతో సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ గతంలో బీపీఎల్‌కు అప్పగించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం, తర్వాత ఉపసంహరించుకోవడం, ఉన్నతాధికారుల అత్యవసర భేటీలు తదితర పరిణామాల నేపథ్యంలో మరోసారి బీపీఎల్ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
రామగుండం : 2001వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయూం లో రామగుండం కేంద్రంగా 520 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు బీపీఎల్‌తో ఒప్పం దం జరిగింది. ఇందుకోసం బీపీఎల్ 1200 ఎకరాల ప్రైవేట్ భూమి, 600 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి ప్లాంట్ ఏ ర్పాటుకు రంగం సిద్ధం చేసింది. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) ఎక్కువగా ఉందంటూ ఒప్పం దాన్ని నిరాకరించింది.

అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు బీపీఎల్‌కు తలనొప్పిగా మారాయి. అరుునప్పటికీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు సాధించి, ప్లాంట్ నిర్మాణానికి డిజైన్ పూర్తి చేసుకొని, పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అప్పటికే భూ సేకరణ, ప్రాజెక్టు డిజైన్, ఇతర పనుల కోసం రూ.300 కోట్లకు పైగా వెచ్చించింది. వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రాజెక్టుకు రాజకీయ గ్రహణం పట్టడంతో పనులను అంతటితోనే నిలిపివేసింది.
 
కొత్త ప్లాంట్ల నిర్ణయంతో మళ్లీ తెరపైకి..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎదురవుతున్న విద్యుత్ కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లు.. మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవర్‌ప్లాంట్ నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. దీంతో మరోసారి బీపీఎల్ విద్యుత్ కేంద్రం అంశం తెరమీదకొచ్చింది.

పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు బీపీఎల్ జాప్యం చేసినందున ఆ సంస్థపై నమ్మకం లేక ప్రభుత్వం ఎన్టీపీసీ వైపు మొగ్గుచూపింది. బీపీఎల్‌కు సంబంధించిన భూములను ఎన్టీపీసీకి కేటారుుంచేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న ఐదు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంది. దీనిపై బీపీఎల్ కోర్టును ఆశ్రరుుంచింది. ఈ వ్యవహారంలో కోర్టులో చుక్కెదురవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం భూముల విషయంలో వెనక్కు తగ్గింది. దీంతో ఎన్టీపీసీకి మళ్లీ భూసేకరణ కష్టాలు మొదలయ్యూరుు.
 
తప్పుకుంటే నిండా మునగాల్సిందే..
విద్యుత్ కేంద్రం ఏర్పాటు నుంచి బీపీఎల్ తప్పుకుంటే ఇప్పటిదాకా చేసిన వ్యయమంతా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీపీఎల్ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే.. వాటికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కగట్టి డబ్బులు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా లేదని తెలుస్తోంది. పదిహేనేళ్ల క్రితం బీపీఎల్ చెల్లించిన భూసేకరణ ధరనే ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అప్పుడు ప్రైవేట్ భూములకు ఎకరానికి రూ.30 వేల దాకా బీపీఎల్ చెల్లించింది. అవే భూములకు ప్రస్తుత మార్కెట్ ధర రూ.4-5లక్షలు పలుకుతోంది. దీంతో భూములను సర్కారు అప్పగిస్తే భారీ నష్టపోవాల్సి వస్తుందని బీపీఎల్ భావిస్తోంది. దీంతో ప్రభుత్వం అనుమతిస్తే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకే ఆ సంస్థ మొగ్గుచూపుతోంది.
 
22 నెలల్లో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం
గతేడాది నవంబర్‌లో అప్పటి జారుుంట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బీపీఎల్, ఎన్టీపీసీ అధికారులతో స్థానిక జెన్‌కో కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని రెండు సంస్థలను అడిగారు. తాము పబ్లిక్ హియరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని, 22నెలల్లో ప్లాంట్ నిర్మించి విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామని బీపీఎల్ ప్రతినిధి స్పష్టం చేశారు.

ఎన్టీపీసీ అధికారులు మాత్రం తమకు ప్రభుత్వం సహకరించి, ఆయూ ప్రక్రియల్లో జాప్యం జరుగకుంటే 48 నెలల్లో ప్లాంట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరితగతిన విద్యుత్ ఉత్పత్తి చేసే వారికి అప్పగించాల్సి ఉన్నప్పటికీ బీపీఎల్‌ను విస్మరించడంలో ప్రభుత్వ వైఖరి ఏమిటోనని పలువురు చర్చించుకుంటున్నారు.
 
బీపీఎల్ ప్రణాళిక ఇదీ..
విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 1,817.03 ఎకరాల భూమిని సేకరించగా.. మల్యాలపల్లి, కుందనపల్లి, రామగుండం శివారు పరిధిలో ప్రధాన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 441.48 ఎకరాలు, రాయదండి, రామగుండం శివారులో యాష్‌పాండ్ ఏర్పాటుకు 597.58 ఎకరాలు, బ్రాహ్మణపల్లిలో రా వాటర్ రిజర్వాయర్‌కు 662.35 ఎకరాలు, ఐదు గ్రామాల మీదుగా పైపులైన్ ఏర్పాటుకు 65.20 ఎకరాలు, ఆపరేటర్స్ కాలనీకి 45.15 ఎకరాలు, రిహాబిలిటేషన్‌కు 2.32 ఎకరాలతో బీపీల్ ప్రణాళిక సిద్ధం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement