చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్‌.. ఒకే ఒక్కడు | Pak Vetaran Shoaib Malik achieves rare feat | Sakshi
Sakshi News home page

#Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్‌.. ఒకే ఒక్కడు

Published Sun, Jan 21 2024 7:39 AM | Last Updated on Sun, Jan 21 2024 10:46 AM

Pak Vetaran Shoaib Malik achieves rare feat - Sakshi

పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులు మైల రాయిని అందుకున్న తొలి ఏషియన్‌ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో మాలిక్‌ రెండో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌(14562) ఉన్నాడు. 

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్‌ ఈ ఘనతను నమోదు చేశాడు. ఈ లీగ్‌లో రంగాపూర్‌ రైడర్స్‌కు మాలిక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. షోయబ్‌ మాలిక్‌ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడయ్యాడు. పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ను షోయబ్‌ పెళ్లి చేసుకున్నాడు. దీంతో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా- మాలిక్‌ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్‌ కార్డ్‌ పడింది. ఈ విషయాన్ని సానియా- మాలిక్‌ ఇద్దరూ దృవీకరించారు. కాగా వీరిద్దరికి 2010లో వివాహం జరిగింది.
చదవండి: U19 World Cup 2024: వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా.. 84 పరుగులతో బంగ్లా చిత్తు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement