‘మూడేళ్లుగా ఆమెతో రిలేషన్‌లో షోయబ్‌.. భర్తకు తెలియకుండా అలా’ | Is Shoaib Malik Had 3 Year Relation With Sana Explosive Claim From Pakistan, Deets Inside - Sakshi
Sakshi News home page

Shoaib Malik-Sana Javed: ‘ఆమెతో మూడేళ్లుగా రిలేషన్‌లో షోయబ్‌.. భర్తకు తెలియకుండా..’

Published Fri, Jan 26 2024 7:59 PM | Last Updated on Fri, Jan 26 2024 9:44 PM

Is Shoaib Malik Had 3 Year Relation With Sana Explosive Claim From Pakistan - Sakshi

సనా జావెద్‌తో షోయబ్‌ (PC: Sana Javed Insta)

పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. విడాకులు- మూడో పెళ్లి- అద్భుత టీ20 రికార్డు- మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఇలా వరుస ఘటనలతో అతడి పేరు పాక్‌ మీడియాలో మారుమ్రోగి పోతోంది.

తాజాగా ఈ ఆల్‌రౌండర్‌ గురించి స్థానిక టీవీ చానెల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ సంగతేంటి??... భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా 2010లో షోయబ్‌ మాలిక్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా
అప్పటికే డివోర్సీ అయిన షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హైదరాబాదీ 2018లో కుమారుడు ఇజహాన్‌కు జన్మనిచ్చింది. ఈ జంట దుబాయ్‌లో నివాసం ఉండేది. ఇక గతేడాది ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత కుటుంబానికే సమయం కేటాయించిందట సానియా.

ఈ క్రమంలో తన భర్త గురించి కొన్ని చేదు నిజాలు ఆమెకు తెలిశాయని.. అందుకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. వాటినే నిజం చేస్తూ ఇటీవలే తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు షోయబ్‌ మాలిక్‌.

తానే విడాకులు ఇచ్చింది
పాక్‌ నటి, మోడల్‌ సనా జావేద్‌ను వివాహమాడిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. తమ కూతురు ఏకపక్షంగా భర్తకు విడాకులిచ్చిందని ప్రకటన విడుదల చేసింది.

ఆ తర్వాత సానియా కూడా ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో.. ‘‘తనపై వస్తున్న విమర్శలను లెక్కచేయక షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియాకు అతడు ద్రోహం చేసినా.. ఆమె ఎవరిపైనా నిందలు వేయకుండా హుందాగా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ పాక్‌ మీడియా సానియా మీర్జాకు మద్దతుగా నిలవడం విశేషం.

భర్తకు తెలియకుండా మూడేళ్లుగా
ఈ క్రమంలో సామా టీవీ షోయబ్‌ మాలిక్‌- సనా జావేద్‌ బంధంపై సంచలన ఆరోపణలు చేస్తూ పాడ్‌కాస్ట్‌ రిలీజ్‌ చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘గత మూడేళ్లుగా వాళ్లిద్దరు సంబంధం కొనసాగిస్తున్నారు.

భార్యాభర్తల బంధంలో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. కానీ ఈ విషయాలు ఉమైర్‌(సనా మొదటిభర్త)కు తెలియదు. అయితే,  సానియా.. ఆమె కుటుంబానికి గతేడాదే షోయబ్‌- సనాల గురించి తెలిసింది.

మాలిక్‌ ఫ్యామిలీకి కూడా విషయం తెలిసింది. అంతా కలిసి పరిస్థితిని చక్కదిద్ది షోయబ్‌- సానియాల బంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ.. షోయబ్‌ ఎవరి మాటా వినేందుకు ఇష్టపడలేదు’’ అంటూ సామా టీవీ పేర్కొంది.

అదే విధంగా.. తనను ఏ టీవీ షోకు ఆహ్వానించినా.. సనాను కూడా పిలవాలని షోయబ్‌ మాలిక్‌ కండిషన్లు పెట్టేవాడని ఆరోపించింది. కాగా సనా జావెద్‌కు గతంలో సింగర్‌ ఉమైర్‌తో పెళ్లైంది. అతడితో విడాకులు తీసుకున్న మూడు నెలల్లోపే ఆమె షోయబ్‌ను రెండో వివాహం చేసుకోవడం గమనార్హం.

వరుస సంఘటనలు
ఇక వ్యక్తిగతంగా షోయబ్‌ పరిస్థితి ఇలా ఉంటే.. కెరీర్‌ పరంగా ఇటీవలే అతడు అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆసియా తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌-2024 లీగ్‌లో ఫార్చ్యూన్‌ బరిషల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఈ ఘనత సాధించాడు. అయితే, ఆ మైల్‌స్టోన్‌ను ఎంజాయ్‌ చేసేలోపే షోయబ్‌ మాలిక్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని షోయబ్‌ మాలిక్‌ ఖండించాడు.

చదవండి: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? సానియా హృదయం ముక్కలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement