Sana Javed
-
క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి.. మ్యారేజ్ డే పిక్స్ షేర్ చేసిన నటి సనా జావెద్ (ఫోటోలు)
-
ఇటీవలే మూడో పెళ్లి.. అప్పుడే మరో నటిపై కన్నేసిన స్టార్ క్రికెటర్!
పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా మాజీ భర్త ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నారు. పాక్ నటి సనా జావెద్‌ను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడారు. 2010లో సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ గతేడాది ఆమెతో విడిపోయారు. ఇటీవలే సనా జావెద్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే అంతలోనే షోయబ్ మరో నటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌కే చెందిన స్టార్ నటి నవల్ సయీద్ ఇటివలే లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనకు పాకిస్థానీ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా మేసేజేస్ వస్తున్నాయని చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని హోస్ట్ ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ అతని పేరు మరచిపోయినట్లు చెప్పడం గమనార్హం. దీంతో ఆ పెళ్లయిన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు అభిమానులు ఫిక్సయిపోయారు. అలా చేయడం కరెక్ట్ కాదు.. మరి ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారు అని అడగ్గా..' తాను వాటి గురించి చెప్పదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే క్రికెటర్లు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. యాక్టర్స్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, క్రీడాకారులనే చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారని" నవల్ సయీద్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
PSL 2024 తొలిసారిగా అలా షోయబ్ మాలిక్ జంట: సనాపై నెటిజన్ల ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో భార్య నటి సనా జావేద్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న మాలిక్, సనా జావేద్ జంటగా కలిసి తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ముల్తాన్ విమానాశ్రయం హోటల్‌కు వెళుతున్న దృశ్యాలు హల్చల్ చేశాయి. దీనిపై కొంతమంది ఫ్యాన్స్ సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందమంది మాత్రం నెగిటివ్‌గా కమెంట్స్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తొమ్మిదో ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మ్యాచ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్బంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా కనిపించింది. భర్త షోయబ్‌ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ గా మారాయి. మాజీ జీవిత భాగస్వాములను మోసం చేసిన ఈ జంటకు సిగ్గూ, శరం లేదంటూ కమెంట్ చేశారు. కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు షోయబ్ త్వరలో తన నాల్గవ భార్యను ఇంటికి తీసుకువస్తాడు, నిన్ను కూడా వదిలివేస్తాడంటూ విరుచుకుపడ్డారు. కాగా భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు విడాకులిచ్చిన షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అలాగే 'ఖులా' ద్వారా విడిపోయారని సానియా మీర్జా తండ్రి స్వయంగా వెల్లడించారు. సనాకు ఇది రెండో పెళ్లికాగా, మాలిక్‌కు మూడో పెళ్లి. కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 52 పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో కరాచీ వరుసగా వికెట్లు కోల్పోయింది.అయితే నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన మాలిక్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కానీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.మరోవైపు షోయబ్ మాలిక్ స్వార్థపరుడంటూ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఆరోపించడం గమనార్హం.. -
ఆమె పట్ల ఎందుకింత ద్వేషం.. ఇంతకు దిగజారుతారా?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సంబంధించిన పాత వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ అభిమానులు సానియాకు మద్దతుగా నిలుస్తున్నారు. పనిలో పనిగా సానియా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు. కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరగగా.. అప్పటికి ఇద్దరూ కెరీర్లో మంచి స్థాయిలో ఉన్నారు. దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ జంటకు 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అన్యోన్య దంపతులుగా పేరొందిన సానియా- షోయబ్ విడిబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ షోయబ్ మాలిక్ తన కొత్త భార్యను పరిచయం చేశాడు. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. సానియా తనకు తానుగా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సానియా మీర్జాకు షోయబ్ వివాహేతర సంబంధాల గురించి తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన నచ్చక అతడి నుంచి విడిపోయిందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక షోయబ్ పెళ్లి తర్వాత సానియా మీర్జా వరుస ఫొటోషూట్లు, ప్రొఫెషన్‌కు సంబంధించిన పనులతో బిజీ అయింది. అయితే, కొంతమంది ఆకతాయిలు మాత్రం.. సానియా రెండో పెళ్లి అంటూ తప్పుడు కథనాలు అల్లుతున్నారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తాను పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫొటోను షేర్ చేయగా.. వక్రభాష్యాలు చెబుతూ ఈ టెన్నిస్స్టార్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సానియా అభిమానులు.. ‘‘సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి ఇంతకు దిగజారుతారా? ఓ మహిళ గురించి ఇంత నీచంగా అబద్దాలు వ్యాప్తి చేస్తారా? ఆమె పట్ల ఎందుకింత ద్వేషం’’ అంటూ మండిపడుతున్నారు. వైవాహిక బంధం గురించి సానియా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. షోయబ్ లాంటి వ్యక్తిని విడిచిపెట్టి ఆమె మంచి పనిచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. పాత వీడియోలో ఏముంది? కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు మీరిచ్చే సలహా ఏమిటని గతంలో ఓ మహిళ సానియా మీర్జాను ప్రశ్నించింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘పెళ్లికి ముందు మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. జీవిత భాగస్వామి చెప్పారని మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మీలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని చూసే కదా వాళ్లు మీతో ప్రేమలో పడతారు’’ అని సానియా పేర్కొంది. Advice of Sania Mirza for Shoaib Malik ❤️#ShoaibMalik | #SanaJaved #SaniaMirza | #ShoaibMalikMarriage pic.twitter.com/9NxodlKidd — Sehrish Javed (@sehrish_javed18) January 21, 2024 -
‘మూడేళ్లుగా ఆమెతో రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా అలా’
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. విడాకులు- మూడో పెళ్లి- అద్భుత టీ20 రికార్డు- మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా వరుస ఘటనలతో అతడి పేరు పాక్ మీడియాలో మారుమ్రోగి పోతోంది. తాజాగా ఈ ఆల్‌రౌండర్ గురించి స్థానిక టీవీ చానెల్ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ సంగతేంటి??... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010లో షోయబ్ మాలిక్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా అప్పటికే డివోర్సీ అయిన షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హైదరాబాదీ 2018లో కుమారుడు ఇజహాన్‌కు జన్మనిచ్చింది. ఈ జంట దుబాయ్‌లో నివాసం ఉండేది. ఇక గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కుటుంబానికే సమయం కేటాయించిందట సానియా. ఈ క్రమంలో తన భర్త గురించి కొన్ని చేదు నిజాలు ఆమెకు తెలిశాయని.. అందుకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. వాటినే నిజం చేస్తూ ఇటీవలే తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు షోయబ్ మాలిక్. తానే విడాకులు ఇచ్చింది పాక్ నటి, మోడల్ సనా జావేద్‌ను వివాహమాడిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. తమ కూతురు ఏకపక్షంగా భర్తకు విడాకులిచ్చిందని ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత సానియా కూడా ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో.. ‘‘తనపై వస్తున్న విమర్శలను లెక్కచేయక షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియాకు అతడు ద్రోహం చేసినా.. ఆమె ఎవరిపైనా నిందలు వేయకుండా హుందాగా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ పాక్ మీడియా సానియా మీర్జాకు మద్దతుగా నిలవడం విశేషం. భర్తకు తెలియకుండా మూడేళ్లుగా ఈ క్రమంలో సామా టీవీ షోయబ్ మాలిక్- సనా జావేద్ బంధంపై సంచలన ఆరోపణలు చేస్తూ పాడ్‌కాస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘గత మూడేళ్లుగా వాళ్లిద్దరు సంబంధం కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల బంధంలో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. కానీ ఈ విషయాలు ఉమైర్(సనా మొదటిభర్త)కు తెలియదు. అయితే, సానియా.. ఆమె కుటుంబానికి గతేడాదే షోయబ్- సనాల గురించి తెలిసింది. మాలిక్ ఫ్యామిలీకి కూడా విషయం తెలిసింది. అంతా కలిసి పరిస్థితిని చక్కదిద్ది షోయబ్- సానియాల బంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ.. షోయబ్ ఎవరి మాటా వినేందుకు ఇష్టపడలేదు’’ అంటూ సామా టీవీ పేర్కొంది. అదే విధంగా.. తనను ఏ టీవీ షోకు ఆహ్వానించినా.. సనాను కూడా పిలవాలని షోయబ్ మాలిక్ కండిషన్లు పెట్టేవాడని ఆరోపించింది. కాగా సనా జావెద్‌కు గతంలో సింగర్ ఉమైర్తో పెళ్లైంది. అతడితో విడాకులు తీసుకున్న మూడు నెలల్లోపే ఆమె షోయబ్‌ను రెండో వివాహం చేసుకోవడం గమనార్హం. వరుస సంఘటనలు ఇక వ్యక్తిగతంగా షోయబ్ పరిస్థితి ఇలా ఉంటే.. కెరీర్ పరంగా ఇటీవలే అతడు అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆసియా తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్-2024 లీగ్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఈ ఘనత సాధించాడు. అయితే, ఆ మైల్‌స్టోన్‌ను ఎంజాయ్ చేసేలోపే షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని షోయబ్ మాలిక్ ఖండించాడు. చదవండి: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? సానియా హృదయం ముక్కలు -
షోయబ్ మాలిక్‌తో ఎఫైర్? ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన పాక్ నటి
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. రీసెంట్ టైంలో సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే గతకొన్నాళ్ల నుంచి షోయబ్-సానియా విడాకులపై వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పెళ్లితో అది నిజమేనని తేలిపోయింది. షోయబ్.. పాక్ నటి సనా జావేద్‌ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల ముందు మరో పాక్ నటి.. ఈ ఆటగాడితో ఎఫైర్ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఆ బ్యూటీ సదరు పుకార్లపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో తను ఎంతగా బాధపడ్డాననేది బయటపెట్టింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. చాలా ఏళ్ల నుంచి జట్టులో ఉన్నాడు. 2002లో ఆయేషా సిద్ధిఖీని, 2010లో సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే 2024లో పాక్ నటి సనా జావేద్‌తో ఒక్కటయ్యాడు. అయితే కొన్నాళ్లముందు ఆయేషా ఒమర్ అనే నటితో షోయబ్.. ఓ మ్యాగజైన కవర్ పేజీ కోసం ఫొటో షూట్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ వేరే లెవల్ కెమిస్ట్రీ పండించారు. సరిగ్గా అదే టైంలో సానియా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఆయేషా బలైపోయింది. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) షోయబ్.. సానియాకు విడాకులు ఇచ్చేశాడని, దానికి ఆయేషా ఒమర్ కారణమని తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర ఊరికే మాట్లాడుకున్నారు. పాక్ మీడియాలో అయితే ఇష్టమొచ్చినట్లు రాసిపడేశారు. అయితే ఆ సమయంలో తను చాలా ఆందోళనకు గురయ్యానని ఆయేషా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎఫైర్ రూమర్స్ వల్ల తాను ఎంతలా మానసిక వేదన అనుభవించాననేది బయటపెట్టింది. 'ఆ దశ మొత్తం నాకు ఓ పీడకల లాంటిది. షోయబ్‌తో నాకు ఎఫైర్ సృష్టించడంతో పాటు పెళ్లి కూడా చేసేశారు. ఇంకా చెప్పాలంటే నాకు అతడితో సీక్రెట్‌గా పెళ్లయిపోయిందని నా బంధువులే చాలామంది నమ్మేంతలా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే నాకు ఈ పుకార్లు చదివినప్పుడు.. అలానే నా గురించి జనాలు మాట్లాడుకునేప్పుడు చాలా అంటే చాలా భయమేసేది. తెగ ఆందోళనపడేదాన్ని' అని ఆయేషా ఒమర్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
క్రికెటర్‌తో పెళ్లి.. వెంటనే పేరు మార్చేసుకున్న నటి
ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. అయితే సెలబ్రిటీల సినిమాలు, ఈవెంట్లు.. లేదంటే వారి ప్రేమ ముచ్చట్లు, పెళ్లి విశేషాలు, విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటాయి. అలా ఈరోజు పాకిస్తాన్ నటి పెళ్లి చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను రెండో పెళ్లి చేసుకుంది పాక్ నటి సనా జావెద్. గతకొంతకాలంగా షోయబ్‌తో సన్నిహితంగా మెదులుతున్నా ఇలా సడన్‌గా నిఖా చేసుకుని షాకిస్తారని ఎవరూ ఊహించలేదు. సానియాకు విడాకులు..! ఎందుకంటే షోయబ్ తన భార్య సానియా మీర్జాకు విడాకులిచ్చినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఏదో చిన్న సమస్యలు అనుకున్నారే తప్ప నిజంగానే విడిపోయి ఇంత త్వరగా మరో అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభిస్తాడని ఎవరూ అనుకోలేదు. చివరకు శనివారం (జనవరి 20)నాడు షోయబ్- సనా జావెద్ షాదీ చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తన పేరును కూడా మార్చేసుకుంది సనా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నటి తన పేరును సనా షోయబ్ మాలిక్‌గా మార్చుకుంది. ఎవరీ సనా జావెద్? కాగా సనా జావెద్.. సుఖూన్, షేర్ ఇ జాత్, ఇంతేజార్ వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఈమె గతంలో పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను పెళ్లాడింది. 2020లో నిఖా చేసుకున్న వీరు మొదట్లో బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఇద్దరి మధ్య పొరపచ్చాలు మొదలయ్యాయి. గతేడాది ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలను తొలగించడంతో విడాకులు తీసుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడదే నిజమని నిరూపిస్తూ క్రికెటర్‌ను పెళ్లాడింది. View this post on Instagram A post shared by Shoaib Malik (@realshoaibmalik)