ఇటీవలే మూడో పెళ్లి.. అప్పుడే మరో నటిపై కన్నేసిన స్టార్ క్రికెటర్! | Pakistan Actress Comments On Cricketer Shoaib Malik Goes Viral | Sakshi
Sakshi News home page

Shoaib Malik: పెళ్లై మూణ్నేళ్లు కాలేదు.. అప్పుడే మరో నటిపై కన్నేసిన క్రికెటర్!

Published Thu, Apr 4 2024 8:27 PM | Last Updated on Thu, Apr 4 2024 9:51 PM

Pakistan Actress Comments On Cricketer Shoaib Malik Goes Viral - Sakshi

పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా మాజీ భర్త ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నారు. పాక్ నటి సనా జావెద్‌ను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడారు. 2010లో సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్న షోయబ్‌ గతేడాది ఆమెతో విడిపోయారు. ఇటీవలే సనా జావెద్‌ బర్త్‌ డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.


అయితే అంతలోనే షోయబ్‌ మరో నటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌కే చెందిన స్టార్ నటి నవల్ సయీద్ ఇటివలే లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనకు పాకిస్థానీ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా మేసేజేస్‌ వస్తున్నాయని చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్లు నెటిజన్స్‌ భావిస్తున్నారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని హోస్ట్ ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ అతని పేరు మరచిపోయినట్లు చెప్పడం గమనార్హం. దీంతో ఆ పెళ్లయిన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు అభిమానులు ఫిక్సయిపోయారు.

అలా చేయడం కరెక్ట్‌ కాదు..

మరి ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారు అని అడగ‍్గా..' తాను వాటి గురించి చెప్పదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే క్రికెటర్లు అలా చేయడం కరెక్ట్‌ కాదని చెప్పింది. యాక్టర్స్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, క్రీడాకారులనే చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారని"  నవల్ సయీద్ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement