పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. రీసెంట్ టైంలో సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే గతకొన్నాళ్ల నుంచి షోయబ్-సానియా విడాకులపై వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పెళ్లితో అది నిజమేనని తేలిపోయింది. షోయబ్.. పాక్ నటి సనా జావేద్‌ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల ముందు మరో పాక్ నటి.. ఈ ఆటగాడితో ఎఫైర్ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఆ బ్యూటీ సదరు పుకార్లపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో తను ఎంతగా బాధపడ్డాననేది బయటపెట్టింది.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. చాలా ఏళ్ల నుంచి జట్టులో ఉన్నాడు. 2002లో ఆయేషా సిద్ధిఖీని, 2010లో సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే 2024లో పాక్ నటి సనా జావేద్‌తో ఒక్కటయ్యాడు. అయితే కొన్నాళ్లముందు ఆయేషా ఒమర్ అనే నటితో షోయబ్.. ఓ మ్యాగజైన కవర్ పేజీ కోసం ఫొటో షూట్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ వేరే లెవల్ కెమిస్ట్రీ పండించారు. సరిగ్గా అదే టైంలో సానియా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఆయేషా బలైపోయింది.
(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
షోయబ్.. సానియాకు విడాకులు ఇచ్చేశాడని, దానికి ఆయేషా ఒమర్ కారణమని తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర ఊరికే మాట్లాడుకున్నారు. పాక్ మీడియాలో అయితే ఇష్టమొచ్చినట్లు రాసిపడేశారు. అయితే ఆ సమయంలో తను చాలా ఆందోళనకు గురయ్యానని ఆయేషా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎఫైర్ రూమర్స్ వల్ల తాను ఎంతలా మానసిక వేదన అనుభవించాననేది బయటపెట్టింది.
'ఆ దశ మొత్తం నాకు ఓ పీడకల లాంటిది. షోయబ్‌తో నాకు ఎఫైర్ సృష్టించడంతో పాటు పెళ్లి కూడా చేసేశారు. ఇంకా చెప్పాలంటే నాకు అతడితో సీక్రెట్‌గా పెళ్లయిపోయిందని నా బంధువులే చాలామంది నమ్మేంతలా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే నాకు ఈ పుకార్లు చదివినప్పుడు.. అలానే నా గురించి జనాలు మాట్లాడుకునేప్పుడు చాలా అంటే చాలా భయమేసేది. తెగ ఆందోళనపడేదాన్ని' అని ఆయేషా ఒమర్ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment