ఎలక్ట్రానిక్స్ సంస్థ బీపీఎల్ (బ్రిటిష్ ఫిజికల్ లేబొరేటరీస్ ఇండియా ) గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎమిరిటస్ చైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ (94) గురువారం కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 10.15 గంటల ప్రాంతంలో మరణించారు.
టీపీజీగా ప్రసిద్ధి చెందిన ఆయన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కి మామగారు. ఈ వార్తను ధ్రువీకరిస్తూ చంద్రశేఖర్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “బీపీఎల్ గ్రూప్ చైర్మన్, నా మామగారు టీపీజీ నంబియార్ మరణించడం గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం శాంతి.." రాసుకొచ్చారు.
నంబియార్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేశారు. “టీపీజీ నంబియార్ భారతదేశ ఆర్థిక బలోపేతాన్ని బలంగా కాంక్షించిన మార్గదర్శక ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త. ఆయన మృతి బాధ కలిగింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment