ఆనంద్ గ్రూప్ ఫౌండర్‌ కన్నుమూత | Deep C Anand, Founder Of Anand Group Passes Away At Age Of 91 | Sakshi
Sakshi News home page

ఆనంద్ గ్రూప్ ఫౌండర్‌ కన్నుమూత

Published Sat, Oct 26 2024 2:14 PM | Last Updated on Sat, Oct 26 2024 2:50 PM

Deep C Anand Founder of Anand Group passes away

ఆనంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు దీప్ సి ఆనంద్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. అక్టోబరు 27న హౌజ్ ఖాస్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అంతిమ ప్రార్థనలు నిర్వహించనున్నారు.

ఆనంద్ సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లో చదువుకున్నారు. యూకేలోని చిపెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నారు.  ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ప్లాంట్ మేనేజర్‌గా 1954లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆనంద్ 27 ఏళ్ళ వయసులో తన మొదటి వ్యాపార వెంచర్‌, గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ గాబ్రియేల్ ఇండియాను ప్రారంభించారు. షాక్ అబ్జార్బర్‌లను తయారు చేసే ఈ కంపెనీని అమెరికాకు చెందిన మేర్‌మాంట్ కార్పొరేషన్‌తో కలిసి ఆయన స్థాపించారు.

తరువాతి దశాబ్దాలలో వివిధ దేశాలకు చెందిన అగ్ర ఆటోమోటివ్‌ సంస్థలు ఎన్నింటితోనో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆనంద్‌ గ్రూప్ భారతదేశంలోని అనేక సంస్థలకు విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను సరఫరా చేస్తుంది. అలాగే తమ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 2017లో ఆనంద్‌ గ్రూప్‌ టర్నోవర్‌ రూ. 9,000 కోట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement