చట్టోగ్రామ్: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఎంత చురగ్గా ఉంటాడో అందరికీ విదితమే. ప్రపంచ క్రికెట్‌లో ధోనిలా ఫీల్డింగ్ చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ధోనికి పెద్ద అభిమాని అయిన అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ షెహజాద్ వికెట్ల వెనుక మెరుపులు మెరిపిస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా చిట్టగాంగ్ వికింగ్స్‌తో తరఫున ఆడుతున్న షెహజాద్ కనీసం వికెట్లవైపు చూడకుండా ఢాకా డైనమెట్స్ ఓపెనర్ రెహ్మాన్‌ను ఔట్ చేసి తీరు ధోనిని గుర్తు చేసింది. ఈ మ్యాచ్ బుధవార జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
నయీమ్ హసన్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి క్రీజ్ బయటకకు వచ్చి షాట్ ఆడబోయిన రెహ్మాన్ బంతిని హిట్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తాకిన బంతి క్రీజుకి సమీపంలో నిలిచిన క్రమంలో రెహ్మన్ పరుగు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో వికెట్ల వెనుక నుంచి దూసుకొచ్చిన షెహజాద్.. బంతిని అందుకున్న మరుక్షణమే వికెట్లను గిరటేశాడు. బ్యాట్ గాల్లో ఉండగానే స్టంప్స్ పడిపోవడంతో రెహ్మాన్ రనౌట్‌గా నిష్క్రమించక తప్పలేదు. దాంతో వికెట్ల వైపు చూడకుండానే బంతిని నేరుగా స్టంప్స్‌పైకి వేయడంలో దిట్ట అయిన ధోనిని గుర్తు చేసుకోవడం అభిమానుల వంతైంది.
Comments
Please login to add a commentAdd a comment