గ్రౌండ్‌లోనే సిగరెట్‌ కాల్చిన అఫ్గన్‌ క్రికెటర్‌.. ఫ్యాన్స్‌ ఆగ్రహం | BPL 2022 Mohammad Shahzad Caught Smoking On Field Gets Demerit Points | Sakshi
Sakshi News home page

Mohammad Shehzad: గ్రౌండ్‌లోనే సిగరెట్‌ కాల్చిన అఫ్గన్‌ క్రికెటర్‌.. ఫ్యాన్స్‌ ఆగ్రహం

Published Sat, Feb 5 2022 5:33 PM | Last Updated on Sat, Feb 5 2022 9:49 PM

BPL 2022 Mohammad Shahzad Caught Smoking On Field Gets Demerit Points - Sakshi

అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ షెహజాద్‌ గ్రౌండ్‌లో సిగరెట్‌ కాలుస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవడంతో అతని ప్రవర్తనపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌ 2022)లో  భాగంగా ఫిబ్రవరి 4న మినిస్టర్‌ గ్రూఫ్‌ ఢాకా, కొమిల్లా విక్టోరియన్స్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇది చోటుచేసుకుంది. మ్యాచ్‌ కొద్దినిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా.. మైదానంలోకి వచ్చిన మహ్మద్‌ షెహజాద్‌ సిగరెట్‌ కాల్చాడు. అతని నోటి నుంచి సిగరెట్‌ పొగను వదలడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇది చూసిన షెహజాద్‌ జట్టు కోయ్‌ మిజానుర్‌ రెహ్మన్‌, తమీమ్‌ ఇక్బాల్‌లు వెంటనే గ్రౌండ్‌కు వచ్చి షెహజాద్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కు తరలించారు.

చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్‌ వర్షం

కాగా షెహజాద్‌ చర్యపై బీసీబీ చీఫ్‌ మ్యాచ్‌ రిఫరీ తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల ప్రకారం గ్రౌండ్‌లో స్మోక్‌ చేయడం నిషేధం. ఆ రూల్‌ మరిచి షెహజాద్‌ గ్రౌండ్‌లోనే సిగరెట్‌ కాల్చడం తప్పు. ఒకవేళ షెహజాద్‌కు ఈ విషయం తెలియకపోతే.. మ్యాచ్‌ అఫీషియల్స్‌ అతనికి సమాచారం అందించాల్సింది. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీబీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద ఆర్టికల్‌ 2.20 కింద నిబంధనలు ఉల్లఘించిన కారణంగా షెహజాద్‌కు పెనాల్టీతో పాటు డీమెరిట్‌ పాయింట్స్‌ ఇచ్చారు. దీనిపై స్పందించిన మహ్మద్‌ షెహజాద్‌ తన ప్రవర్తనపై క్షమాపణ కోరాడు. తాను చేసింది తప్పేనని.. ఫైన్‌ కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఫ్యాన్స్‌ నాపై కోపం వ్యక్తం చేయడంలో అర్థం ఉందని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement