క్రిస్‌గేల్ రికార్డు బద్దలైంది! | Sabbir Rahman sets highest score and breaks gayle record | Sakshi
Sakshi News home page

క్రిస్‌గేల్ రికార్డు బద్దలైంది!

Published Thu, Nov 17 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

క్రిస్‌గేల్ రికార్డు బద్దలైంది!

క్రిస్‌గేల్ రికార్డు బద్దలైంది!

మిర్పూర్: వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. బంగ్లాదేశ్ ప్లేయర్ షబ్బీర్ రహమాన్ అద్భుత శతకంతో పాటు గేల్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అదిగమించాడు. బంగ్లా ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా  షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరిసాల్ బుల్స్ ప్రత్యర్థి జట్టు రాజ్‌షాహి కింగ్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

లక్ష్యఛేదనకు దిగిన రాజ్‌షాహి కింగ్స్ ఆటగాడు, షబ్బీర్ రహమాన్ 9 సిక్సర్లు, 4 ఫోర్లతో  కేవలం 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. గతంలో బీపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్  (112 పరుగులు) పేరిట ఉండేది. ఈ మ్యాచ్ ద్వారా గేల్ రికార్డును అధిగమించిన షబ్బీర్ మాట్లాడుతూ.. తనశైలికి టీ20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుందన్నాడు. త్వరలోనే తన రికార్డును మరో క్రికెటర్ బ్రేక్ చేస్తాడని షబ్బీర్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement