ఢాకా : ప్రపంచంలోనే ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో పాకిస్తాన్ ఒకటని విండీస్ స్టార్ బ్యాట్సమెన్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రసుత్తం పాకిస్తాన్‌లో సిరీస్ ఆడేందుకు వచ్చే జట్టులోని ఆటగాళ్లకు ఆ దేశ ప్రభుత్వం ఒక అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో గేల్ ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఆడేందుకు వచ్చాడు. ప్రాక్టీస్ సందర్భంగా 'పాకిస్తాన్ క్రికెట్ ఆడేందుకు అనువైన ప్రదేశం అవునా కాదా ' అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు గేల్ స్పందిస్తూ... ' ఇప్పుడు ప్రపంచంలోనే పాకిస్తాన్ దేశం అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు వస్తున్న ఆటగాళ్లకు అధ్యక్షస్థాయి భద్రతను కల్పిస్తున్నారు. ఒక ఆటగాడిగా ఇంతకన్నా కావలిసిందేముంటుంది' అంటూ పేర్కొన్నాడు. కాగా దశాబ్దం తర్వాత శ్రీలంక జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లకు పాక్ ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. కాగా రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ 1-0 తేడాతో గెలుచుకుంది. అయితే గేల్ ఈ మధ్యనే 40లోకి ఎంటరవ్వడంతో అతని రిటైర్మంట్‌పై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వాటన్నింటికి తెరదించుతూ ఇంకో ఐదేళ్ల పాటు తనకు క్రికెట్ ఆడే శక్తి ఉన్నట్లు గేల్ ఇప్పటికే ప్రకటించాడు.
Chris Gayle "Pakistan is one of the safest places right now in the world" #Cricket pic.twitter.com/CNZaBNCSuu
— Saj Sadiq (@Saj_PakPassion) January 9, 2020
Comments
Please login to add a commentAdd a comment