safest place
-
పాకిస్తాన్ ఇప్పుడు సురక్షితమైన ప్రదేశం : గేల్
ఢాకా : ప్రపంచంలోనే ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో పాకిస్తాన్ ఒకటని విండీస్ స్టార్ బ్యాట్సమెన్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రసుత్తం పాకిస్తాన్లో సిరీస్ ఆడేందుకు వచ్చే జట్టులోని ఆటగాళ్లకు ఆ దేశ ప్రభుత్వం ఒక అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్లో జరుగుతున్న బంగ్లా ప్రీమియర్ లీగ్లో గేల్ ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఆడేందుకు వచ్చాడు. ప్రాక్టీస్ సందర్భంగా 'పాకిస్తాన్ క్రికెట్ ఆడేందుకు అనువైన ప్రదేశం అవునా కాదా ' అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు గేల్ స్పందిస్తూ... ' ఇప్పుడు ప్రపంచంలోనే పాకిస్తాన్ దేశం అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు వస్తున్న ఆటగాళ్లకు అధ్యక్షస్థాయి భద్రతను కల్పిస్తున్నారు. ఒక ఆటగాడిగా ఇంతకన్నా కావలిసిందేముంటుంది' అంటూ పేర్కొన్నాడు. కాగా దశాబ్దం తర్వాత శ్రీలంక జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లకు పాక్ ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. కాగా రెండు టెస్టుల సిరీస్ను పాకిస్తాన్ 1-0 తేడాతో గెలుచుకుంది. అయితే గేల్ ఈ మధ్యనే 40లోకి ఎంటరవ్వడంతో అతని రిటైర్మంట్పై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వాటన్నింటికి తెరదించుతూ ఇంకో ఐదేళ్ల పాటు తనకు క్రికెట్ ఆడే శక్తి ఉన్నట్లు గేల్ ఇప్పటికే ప్రకటించాడు. Chris Gayle "Pakistan is one of the safest places right now in the world" #Cricket pic.twitter.com/CNZaBNCSuu — Saj Sadiq (@Saj_PakPassion) January 9, 2020 -
ఇంటికన్నా జైలే పదిలం
పుళల్ సెంట్రల్ జైల్లోకి చుక్క వరదనీరు రాని వైనం చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరాన్ని నిలువునా ముంచేసిన వర్షాలు, వరదలతో ఆవేదన చెందిన వారే కాదు ఆనందించిన వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. వర్షాలు, వరదలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసినవారంతా క్రిమినల్స్ కావడం విశేషం. ఇంటికన్నా జైలు పదిలం అంటూ పుళల్ సెంట్రల్జైలు ఖైదీలు చెబుతున్నారు. చెన్నై సెంట్రల్ ఎదురుగా, కూవం కాలువ గట్టుకు ఆనుకునే చెన్నై సెంట్రల్ జైలు ఉండేది. కొన్నేళ్ల క్రితం ఇక్కడి జైలును నగర శివార్లులోని పుళల్కు మార్చారు. 213 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో జైలు నిర్మాణం జరిగింది. ఈ జైలులో 3100 మందికి పైగా ఖైదీలు ఉంటున్నారు. నగరంలో 20 రోజులపాటు కురిసిన వర్షాలతో మునిగి పోని ప్రాంతం అంటూలేదు. అయితే భారీ వర్షాల కారణంగా జైలుకు సమీపంలోనే పుళల్ చెరువు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహించినా పక్కనే ఉన్న జైలులోకి వరదనీరు చుక్క కూడా ప్రవహించలేదు. నగర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నా తాము వేళకు భోజనం, కంటి నిండా నిద్రతో సుఖంగా ఉన్నామని ఖైదీలేకాదు, అక్కడి జైలు అధికారులు ఆనందంగా చెబుతున్నారు. పైగా ముంపు ప్రాంతాల్లో తమ కుటుంబాల వారు ఎలా ఉన్నారనే సమాచారాన్ని సైతం జైలు అధికారులు ఎప్పటికప్పుడు తెలపడంతో ఖైదీలు మరింత హాయిగా కాలం గడిపారు. గిండి క్రైం పోలీస్ స్టేషన్లో రికార్డులు గల్లంతు చెన్నై నగరంలోని గిండి క్రైం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో 30 అడుగులమేర వరదనీరు ప్రవహించడంతో స్టేషన్లోని క్రిమినల్ రికార్డులన్నీ గల్లంతయ్యాయి. ఇందులో అనేకరకాల నేరగాళ్లకు సంబంధించిన రికార్డులుండడంతో పోలీసులు తలలు పట్టుకోగా, నిందితులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.