అమెరికాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో అప్పుడప్పుడు చోటుచేసుకునే కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తుంటాయి. గత సంవత్సరం అంటే 2024లో అమెరికాలోని పలు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాదిలో 80కి పైగా అమెరికన్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు నమోదుకాగా, పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు.
ఇటువంటి కాల్పుల ఘటనల కారణంగానే తమ పిల్లలను అమెరికాలో చదువుకునేందుకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. 2025లో భారతదేశం నుండి వేలాది మంది విద్యార్థులు అమెరికన్ కళాశాలలు(American colleges), విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రల్లో ప్రశాంతమైన వాతావరణం(Calm atmosphere) ఉంది. అక్కడ విద్యార్థులు చదువుకునేందుకు పలు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలోని 10 రాష్ట్రాలివే..
అమెరికాలోని 10 సురక్షితమైన రాష్ట్రాలు
వ్యోమింగ్
నార్త్ డకోటా
సౌత్ డకోటా
హవాయీ
వెర్మోంట్
మెయిన్
అలాస్కా
వెస్ట్ వర్జీనియా
రోడ్ ఐలాండ్
న్యూ హాంప్‌షైర్
అమెరికాలోని అత్యంత సురక్షితమైన ఈ రాష్ట్రాల జాబితాను ఇక్కడ జరిగిన కాల్పుల సంఘటనల ఆధారంగా తయారు చేశారు. 1966 నుండి 2024 వరకు పాఠశాలల్లో కాల్పుల సంఘటనలు అతి తక్కువగా జరిగిన రాష్ట్రాలను ఈ జాబితాలో చేర్చారు. 1966- 2024 మధ్య వ్యోమింగ్‌లో రెండు పాఠశాలల్లో మాత్రమే కాల్పులు జరిగాయి. నార్త్ డకోటా(North Dakota), సౌత్ డకోటాలలో మూడు సంఘటనలు, హవాయిలో నాలుగు, వెర్మోంట్‌లో ఐదు, మెయిన్, అలాస్కాలో ఏడు, వెస్ట్ వర్జీనియాలో ఎనిమిది, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్‌షైర్‌లో ఇప్పటివరకు ఎనిమిది సంఘటనలు నమోదయ్యాయి.
అమెరికాలోని ఈ రాష్ట్రాలు అత్యంత సురక్షితమైనవిగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో తక్కువ నేరాల రేట్లు, తక్కువ జనాభా, పటిష్టమైన భద్రతా విధానాలు ఉన్నాయి. వెర్మోంట్, న్యూ హాంప్‌షైర్ వంటి రాష్ట్రాలు కమ్యూనిటీ పోలీసింగ్‌తో పాటు ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. ఇది ప్రజలకు మరింత భద్రతా భావాన్ని అందిస్తుంది. ఈ రాష్ట్రాల్లో పెద్ద నగరాలు తక్కువగా ఉండటం వల్ల నేరాల సంఖ్య కూడా తక్కువే. పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రల్లో నేరాలను అరికట్టడంతో ముందుంది.
ఇది కూడా చదవండి: బోర్డింగ్ స్కూల్‌పై దాడి.. రష్యా- ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment