ఢాకా : టీ20 క్రికెట్‌లో విధ్వంస బ్యాటింగ్‌తో చెలరేగే ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో తన రికార్డు తనే అధిగమించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున పుణే వారియర్స్‌పై గేల్ బాదిన 17 సిక్సర్లే అత్యధిక సిక్సర్ల రికార్డుగా ఉంది. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ ఫైనల్లో రంగపూర్ రైడర్స్ జట్టు తరుపున ఢాకా డైనమైట్స్‌పై 18 సిక్సులు బాది పాత రికార్డును అధిగమించాడు.
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గేల్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రంగపూర్ రైడర్స్ ఐదు పరుగలకే తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్‌గా ఉన్న గేల్ కీవీస్ బ్యాట్స్‌మన్ మెకల్లమ్‌తో కలిపి మైదానంలో పరుగుల తుఫాన్‌ను సృష్టించాడు. ఇక రెండో వికెట్‌కు ఈ జోడి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే తొలి అత్యధిక భాగస్వామ్యం.
69 బంతులు ఆడిన గేల్ 18 సిక్సర్లు, 5 ఫోర్లతో 146 పరుగుల చేసి బీపీఎల్ చరిత్రలో రికార్డు సెంచరీ నమోదు చేశాడు. మెకల్లమ్ 43 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు. దీంతో ఢాకా డైనమెట్స్‌కు రంగపూర్ రైడర్స్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి క్రికెట్‌లో ఓవరాల్‌గా గేల్‌కు ఇది 20వ సెంచరీ కాగా.. బీపీఎల్‌లో రెండోది. ఇక ఈ సెంచరీతో ఓవరాల్ టీ20ల్లో గేల్ 11 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment