51 బంతుల్లో 126 నాటౌట్‌ | Chris Gayle blasts 45-ball 100 in Bangladesh Premier League | Sakshi
Sakshi News home page

51 బంతుల్లో 126 నాటౌట్‌

Published Sat, Dec 9 2017 1:01 AM | Last Updated on Sat, Dec 9 2017 10:23 AM

Chris Gayle blasts 45-ball 100 in Bangladesh Premier League - Sakshi

ఢాకా: ఐపీఎల్‌ సహా చాలా కాలంగా టి20ల్లో విఫలమవుతూ స్తబ్దుగా ఉన్న ‘యూనివర్సల్‌ బాస్‌’ క్రిస్‌ గేల్‌ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. స్థాయికి తగినట్లుగా విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన వెస్టిండీస్‌ స్టార్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మెరుపు సెంచరీ చేశాడు. గేల్‌ (51 బంతుల్లో 126 నాటౌట్‌; 6 ఫోర్లు, 14 సిక్సర్లు) జోరుతో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రంగ్‌పూర్‌ రైడర్స్‌ జట్టు 8 వికెట్లతో ఖుల్నా టైటాన్స్‌ను ఓడించింది. ముందుగా ఖుల్నా 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేయగా... రైడర్స్‌ 15.2 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మూడో బంతినే సిక్సర్‌గా మలచిన గేల్‌ ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. 23 బంతుల్లో అర్ధ సెంచరీ, 45వ బంతికి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

19 టి20 ఫార్మాట్‌లో గేల్‌కు ఇది 19వ సెంచరీ. మెకల్లమ్, ల్యూక్‌ రైట్, క్లింగర్‌(7 శతకాలు) తర్వాతి స్థానంలో ఉన్నారు.14 ఒక టి20 ఇన్నింగ్స్‌లో గేల్‌ 10కి పైగా సిక్సర్లు బాదడం ఇది 14వసారి. మిగతావారెవరూ 2 సార్లకు మించి నమోదు చేయలేదు.   800 ఈ మ్యాచ్‌తో గేల్‌ టి20ల్లో 800 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. పొలార్డ్‌ (506) రెండో స్థానంలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement