
దేశం పరువు తీసిన వారితో ఆడను!
కరాచీ: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడేందుకు భారీ మొత్తానికి వచ్చిన ఆఫర్‌ను పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ తిరస్కరించాడు. ఆ జట్టులో గతంలో నిషేధానికి గురైన మొహమ్మద్ ఆమిర్ ఉండటమే అందుకు కారణం. దేశం పరువు తీసిన ఆటగాడితో తాను డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనని అతను ప్రకటిం చాడు.
పాకిస్తాన్ ప్రధాన ఆటగాడు ఒకరు ఆమిర్‌ను ఇలా బహిరంగంగా విమర్శించడం ఇదే మొదటిసారి. ఐసీసీ నిషేధం ఎత్తివేయడంతో ఇటీవలే ఆమిర్ పోటీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.