![ZIM AFRO T10 2023: Mohammad Hafeez Scripts History In T10 Format - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/Untitled-2.jpg.webp?itok=bHZF62lx)
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ టీ10 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ పాక్ మాజీ పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో భాగంగా బులవాయో బ్రేవ్స్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌల్ చేసిన హఫీజ్ (జోబర్గ్ బఫెలోస్).. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ట్రిపుల్ వికెట్ మొయిడిన్ ఓవర్ ఉంది.
హఫీజ్ వేసిన 12 బంతుల్లో కేవలం ఒకే ఒక బౌండరీ ఇచ్చి 11 డాట్ బాల్స్ వేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్‌లో హాఫీజ్‌వే అత్యుత్తమ గణాంకాలు. అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 400 మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 250కిపైగా వికెట్లు తీసినప్పటికీ, ఒక్కసారి కూడా 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టలేకపోయాడు. టెస్ట్‌ల్లో 4/16, వన్డేల్లో 4/41, టీ20ల్లో 4/10 హఫీజ్ అత్యుత్తమ గణాంకాలు.
Pakistan Chief Selector Got Six Wickets for four runs in his two overs T10 Match. Professor Mohammad Hafeez at his Best🔥♥️.#MohammadHafeez #ZimAfroT10 pic.twitter.com/bOzfgQyguE
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 21, 2023
ఇదిలా ఉంటే, బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (23 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) చెలరేగగా.. ఓపెనర్ టామ్ బాంటన్ (18 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్రేవ్స్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫరాజ్, వెబ్‌స్టర్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన బ్రేవ్స్.. మహ్మద్ హఫీజ్ (2-1-4-6) ధాటికి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. హఫీజ్ బ్రేవ్స్ పతనాన్ని శాశిస్తే.. వెల్లింగ్టన్ మసకద్జ (2-0-11-3) మరో ఎండ్ నుంచి అతనికి సహకరించాడు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్ (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ మెక్‌డెర్మాట్ (13), ర్యాన్ బర్ల్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్ డకౌట్లు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment