bowling records
-
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అరుదైన ఘనత.. రికార్డు గణాంకాలు నమోదు
విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా నిన్న (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ప్రధాన రికార్డులు నమోదయ్యాయి. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు టోర్నీ మూడో అత్యధిక స్కోర్ (427) నమోదు చేయగా.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్ అర్పిత్ గులేరియా 8 వికెట్ల ప్రదర్శనతో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. అర్పిత్ నమోదు చేసిన ఈ గణాంకాలు (9-0-50-8) లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే 11వ అత్యుత్తమ గణాంకాలుగా రికార్డు కాగా.. భారత్ తరఫున 8 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అర్పిత్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల అర్పిత్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అర్పిత్‌కు ముందు షాబాజ్ నదీం (8-10), రాహుల్ సింఘ్వి (8-15) లిస్ట్-ఏ క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లుగా ఉన్నారు. ఓవరాల్‌గా కూడా లిస్ట్-ఏ క్రికెట్లో వీరిద్దరివే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. అర్పిత్ గులేరియా 8 వికెట్లతో విజృంభించినా హిమాచల్ ప్రదేశ్ ఓటమిపాలైంది. గుజరాత్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో హిమాచల్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గులేరియా ధాటికి 49 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో అద్బుతంగా పోరాడిన హిమాచల్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (49.5 ఓవర్లలో 319 ఆలౌట్) నిలిచిపోయింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఉర్విల్ పటేల్ (116) సీజన్ రెండో సెంచరీతో విజృంభించగా.. మరో ఓపెనర్ ప్రయాంక్ పంచల్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హిమాచల్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ చోప్రా (96) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. ఆఖర్లో సుమీత్ వర్మ (47 బంతుల్లో 82; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో హిమాచల్ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. -
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్‌కు 7 వికెట్లు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..!
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్‌లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇద్రుస్తో పాటు పవన్‌దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్‌లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం. అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్‌దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6) జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6) ఓబెడ్ మెక్కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6) లాంగట్ (కెన్యా) (4-1-17-6) ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6) -
చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్.. పొట్టి క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ టీ10 క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ పాక్ మాజీ పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో భాగంగా బులవాయో బ్రేవ్స్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌల్ చేసిన హఫీజ్ (జోబర్గ్ బఫెలోస్).. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ట్రిపుల్ వికెట్ మొయిడిన్ ఓవర్ ఉంది. హఫీజ్ వేసిన 12 బంతుల్లో కేవలం ఒకే ఒక బౌండరీ ఇచ్చి 11 డాట్ బాల్స్ వేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో హాఫీజ్‌వే అత్యుత్తమ గణాంకాలు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 400 మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 250కిపైగా వికెట్లు తీసినప్పటికీ, ఒక్కసారి కూడా 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టలేకపోయాడు. టెస్ట్‌ల్లో 4/16, వన్డేల్లో 4/41, టీ20ల్లో 4/10 హఫీజ్ అత్యుత్తమ గణాంకాలు. Pakistan Chief Selector Got Six Wickets for four runs in his two overs T10 Match. Professor Mohammad Hafeez at his Best🔥♥️.#MohammadHafeez #ZimAfroT10 pic.twitter.com/bOzfgQyguE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 21, 2023 ఇదిలా ఉంటే, బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (23 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) చెలరేగగా.. ఓపెనర్ టామ్ బాంటన్ (18 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్రేవ్స్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫరాజ్, వెబ్‌స్టర్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బ్రేవ్స్.. మహ్మద్ హఫీజ్ (2-1-4-6) ధాటికి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. హఫీజ్ బ్రేవ్స్ పతనాన్ని శాశిస్తే.. వెల్లింగ్టన్ మసకద్జ (2-0-11-3) మరో ఎండ్ నుంచి అతనికి సహకరించాడు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్ (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ మెక్‌డెర్మాట్ (13), ర్యాన్ బర్ల్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్ డకౌట్లు కావడం విశేషం. -
#SRH: ఒకప్పుడు బలం.. ఇప్పుడదే బలహీనత
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్కు మరో పరాజయం ఎదురైంది. శనివారం సొంతమైదానంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 182 పరుగులు భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అందుకు బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణం. కానీ ఒకప్పుడ ఇదే బౌలింగ్‌తో ఎస్ఆర్హెచ్ సంచలన విజయాలు సాధించింది. గతంలో వార్నర్ నాయకత్వంలోని ఎస్ఆర్హెచ్ చాలాసార్లు లోస్కోరింగ్ మ్యాచ్‌లను కూడా నెగ్గింది. బ్యాటింగ్‌లో వీక్‌గా కనిపించినా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం బలంగా ఉండేది. బౌలింగ్‌తో బలంతోనే 2016లో సగం మ్యాచ్‌లు నెగ్గిన ఎస్ఆర్హెచ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత సీజన్లలోనూ బౌలింగ్‌తోనే లోస్కోరింగ్ మ్యాచ్‌లను కాపాడుకోగలిగింది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఏదైతే బలమని భావించామో అదే బలహీనతగా మారింది. ఇదే హైదరాబాద్‌లో తక్కువ స్కోర్లను కాపాడుకొని మ్యాచ్‌లు గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈ సీజన్లో దారుణంగా తయారైంది. ఒకటి అరా మ్యాచ్‌లు తప్ప ఏ బౌలర్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. ఇక లక్నోతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకప్పుడు స్వింగ్ కింగ్‌గా పేరు పొందిన భువనేశ్వర్ పూర్తిగా విఫలం కాగా.. యార్కర్ల నటరాజన్ ఘోరంగా ఫెయిలవుతున్నాడు. మయాంక్ మార్కండే తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇలా ఈ సీజన్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో నాసిరకం ప్రదర్శన చేస్తూ పరాజయాలను మూటగట్టుకుంటుంది ఎస్ఆర్హెచ్. చదవండి: అది నోబాల్.. థర్డ్ అంపైర్ చీటింగ్ -
మొయిన్ అలీ అరుదైన రికార్డు; టీమిండియాపై ఆరో స్పిన్నర్‌గా
లార్డ్స్: ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ టీమిండియాపై టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్‌గా మొయిన్ అలీ నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో షమీ వికెట్ తీయడం ద్వారా అలీ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా భారత్‌పై టెస్టుల్లో మురళీధరన్(శ్రీలంక) 105 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. నాథన్ లియాన్(ఆస్ట్రేలియా) 94 వికెట్లతో రెండో స్థానంలో, 63 వికెట్లతో లాన్స్ గిబ్స్(వెస్టిండీస్) మూడో స్థానంలో, అండర్వుడ్(ఇంగ్లండ్) 62 వికెట్లతో నాలుగు.. 52 వికెట్లతో బెనాడ్(ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో చేరిన మొయిన్ అలీ ఇంగ్లండ్ తరపున 62 టెస్టుల్లో 2831 పరుగులు.. 190 వికెట్లు, 112 వన్డేల్లో 1877 పరుగులు.. 87 వికెట్లు, 38 టీ20ల్లో 437 పరుగులు.. 21 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా రెండో రోజు ఆటలో లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 31, ఇషాంత్ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 278/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, జడేజాలు ఇన్నింగ్స్‌కు కొనసాగించారు. అయితే 37 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. -
వందేళ్లలోనే అశ్విన్ అరుదైన అద్భుత రికార్డు!
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలికాలంలో బంతిని అద్భుతంగా గింగిరాలు తిప్పుతూ.. ప్రత్యర్థులను చిత్తుచేసిన ఈ మేటి బౌలర్ తాజాగా న్యూజిల్యాండ్ సిరీస్‌లోనూ సత్తా చాటాడు. ఇండోర్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఏకంగా 13వికెట్లు పడగొట్టి.. కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు (13/140) నమోదు చేశాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో చివరి వికెట్ రూపంలో ట్రెంట్ బౌల్ట్‌ను ఔట్ చేయడం ద్వారా ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అశ్విన్ సాధించిన అరుదైన రికార్డు ఏమిటంటే.. గత వందేళ్లలో ఏ బౌలర్ సాధించిన స్ట్రైక్ రేట్‌ను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 100 వికెట్లకుపైగా పడగొట్టిన బౌలర్లలో ఈ 30 ఏళ్ల ఇంజినీర్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. టెస్టుల్లో అశ్విన్ స్ట్రైక్ రేట్ 49.4 కావడం గమనార్హం. ఒక వికెట్ పడగొట్టడానికి బౌలర్ వేసే బంతులను బట్టి అతని స్ట్రైక్ రేట్‌ను నిర్ధారిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. తాను వేసిన ప్రతి 50 (49.4) బంతులకు అశ్విన్ ఒక వికెట్ పడగొడుతూ వచ్చాడు. టెస్టుల్లో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే గత వందేళ్లలో అశ్విన్ టాప్ స్థానంలో నిలువగా.. అతని తదుపరి స్థానంలో మెక్‌గిల్ (ఆస్ట్రేలియా) 54 స్ట్రైక్ రేటుతో, ఆ తర్వాతిస్థానంలో మురళీధరన్ 55 స్ట్రైక్‌రేటుతో ఉన్నారు. టాప్-10లో ఉన్న శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియన్ మాత్రమే ప్రస్తుతం ఆడుతున్న అశ్విన్ సమీకాలికులు. ఈ జాబితాలో భారత బౌలర్ బీఎస్ చంద్రశేఖర్ 13వ స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నారు. ఇక ఆల్‌టైమ్ టెస్టు చరిత్ర ప్రకారం చూసుకుంటే 1910లో క్రికెట్ ఆడిన ఇంగ్లిష్ బౌలర్లు జానీ బ్రిగ్స్, కొలిన్ బ్లైత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడో స్థానంలో అశ్విన్ నిలిచాడు. ఇక టెస్టు క్రికెట్లో బౌలింగ్ దిగ్గజాలుగా భావించే మురళీధరన్, షేన్ వార్న్ ఈ జాబితాలో ఐదు, ఆరు స్థానాల్లో ఉండగం గమనార్హం.