జింబాబ్వే టీ10 లీగ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు, హరారే హరికేన్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్ ఖలందర్స్‌తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఖలందర్స్ బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్ (25 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్ బౌలర్ లూక్ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు.
మెరిసిన కాలా..
నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్.. జోబర్గ్ బఫెలోస్‌పై కేప్‌టౌన్ విజయాలు సాధించాయి. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. ఇన్నోసెంట్ కాలా (52 నాటౌట్), వెబ్‌స్టర్ (23 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇచ్చిన కేప్‌టౌన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది.
రాణించిన హఫీజ్, బొపారా..
కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ (40 నాటౌట్), రవి బొపారా (30 నాటౌట్) రాణించడంతో జోబర్గ్ బఫెలోస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్, బొపారా రాణించడంతో బఫెలోస్ టీమ్ 6.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment