Ravi bopara
-
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ! వీడియో వైరల్
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్పకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ఉతప్ప.. తన ఓవర్లో ఏకంగా 6 సిక్స్‌లు సమర్పించుకున్నాడు.ఇంగ్లండ్ కెప్టెన్ రవి బొపారా ఉతప్ప బౌలింగ్‌ను ఊతికారేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఉతప్ప బౌలింగ్‌లో బొపారా వరుసగా 6 సిక్స్‌లు బాది ఔరా అన్పించాడు. ఆ ఓవర్లో మొత్తం ఆరు డెలివరీలను లాంగాఫ్, లాంగాన్, డీప్ మిడ్ వికెట్ల దిశగా బొపారా సిక్సర్లగా మలిచాడు. 6 సిక్స్‌లతో పాటు ఊతప్ప ఓ వైడ్ కూడా వేయడంతో ఆ ఓవర్లో ఏకంగా 37 పరుగులు వచ్చాయి.బొపారా విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో బొపారా కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 14 బంతుల్లో 8 సిక్స్‌లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా అతడు వెనుదిరిగాడు.టీమిండియా మరో ఓటమి..ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బొపారాతో పాటు సమిత్ పటేల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఆ ఒక్క వికెట్ కూడా రనౌట్ రూపంలో టీమిండియాకు లభించింది. అనంతరం లక్ష్య చేధనలో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 15 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బ్యాటర్లలో కేదార్ జాదవ్(15 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావగడం గమనార్హం.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు' -
ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 35 బంతుల్లో..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంప్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రవి బొపారా (3/9), ఓవైస్ షా (3/23), అజ్మల్ షహజాద్ (2/17), ర్యాన్ సైడ్‌బాటమ్ (1/16), స్కోఫీల్డ్ (1/22) ధాటికి 19.2 ఓవర్లలో 137 పరుగలకే కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెర్షల్ గిబ్స్ (26), మెక్లారెన్ (22), క్లెయిన్వెల్డ్ట్ (21) మాత్రమే 20 పరుగుల స్కోర్‌ను దాటగలిగారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు కెవిన్ పీటర్సన్ (11 బంతుల్లో 28; ఫోర్, 4 సిక్సర్లు), ఫిల్ మస్టర్డ్ (35 బంతుల్లో 84 నాటౌట్; 35 బంతుల్లో 84; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోవడంతో 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. ఇంగ్లండ్ కోల్పోయిన ఏకైక వికెట్ క్లెయిన్వెల్డ్ట్కు (పీటర్సన్) దక్కింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా రెండో విజయం.ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా ఇవాళ (జులై 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఐసీసీ సభ్య దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
ICC Rankings: అక్షర్ పటేల్ తొలిసారి.. మనోడే మళ్లీ నంబర్ వన్!
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్‌లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.మనోడే మళ్లీ నంబర్ వన్ బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్ మెరుపులు
జింబాబ్వే టీ10 లీగ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు, హరారే హరికేన్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్ ఖలందర్స్‌తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఖలందర్స్ బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్ (25 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్ బౌలర్ లూక్ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు. మెరిసిన కాలా.. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్.. జోబర్గ్ బఫెలోస్పై కేప్‌టౌన్ విజయాలు సాధించాయి. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. ఇన్నోసెంట్ కాలా (52 నాటౌట్), వెబ్‌స్టర్ (23 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇచ్చిన కేప్‌టౌన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది. రాణించిన హఫీజ్, బొపారా.. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ (40 నాటౌట్), రవి బొపారా (30 నాటౌట్) రాణించడంతో జోబర్గ్ బఫెలోస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్, బొపారా రాణించడంతో బఫెలోస్ టీమ్ 6.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు
హొబర్ట్: టెస్ట్, వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఉతికి ఆరేసిన ఆస్ట్రేలియా టీ20లోనూ సత్తా చూపుతోంది. ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లీషు జట్టును 13 పరుగులతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. వైట్(75), ఫించ్(52) అర్థ సెంచరీలతో చెలరేగారు. మ్యాక్స్‌వెల్ 20, బెయిలీ 14, లియాన్ 33 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, డెర్న్‌బ్యాచ్, బొపారా, రైట్ తలో వికెట్ తీశారు. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. రవి బొపారా అర్థ సెంచరీలో చెలరేగినా విజయాన్ని అందించలేకపోయాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రూట్ 32, హేల్స్ 22 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నైల్ 4, హెన్రీక్స్ 2 వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్‌వెల్, ముయిర్‌హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వైట్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ఫిక్సింగ్ స్కాంలో బొపారా!
లండన్: భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ రవి బొపారాపై మ్యాచ్ ఫిక్సింగ్ నీడలు కమ్ముకుంటున్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో వెలుగుచూసిన ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా యూనిట్ అధికారులు రెండు గంటల పాటు విచారించారని సమాచారం. 12 నెలల బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మూడేళ్లకు సంబంధించిన మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను ఇవ్వాలని క్రికెటర్‌ను కోరారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల బొపారా వాటిని సకాలంలో సమర్పించలేకపోయాడు. బీపీఎల్‌లో చిట్టగాంగ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన బొపారా... ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ టి20 టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లాడు. అయితే ఇలాంటి అంశాలను తెలుసుకునేందుకు సంబంధించిన ఐసీసీ నియమావళిపై సంతకం చేయకపోవడంతో బొపారాపై మరో వారం రోజుల్లో వేటు పడే అవకాశాలున్నాయి.