ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ! వీడియో వైర‌ల్‌ | Robin Uthappa Concedes 37 Runs In One Over In the Hong Kong Sixes tournament | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ! వీడియో వైర‌ల్‌

Published Sat, Nov 2 2024 4:22 PM | Last Updated on Sat, Nov 2 2024 5:26 PM

Robin Uthappa Concedes 37 Runs In One Over In  the Hong Kong Sixes tournament

హాంకాంగ్  సిక్సెస్  టోర్న‌మెంట్‌లో టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉత‌ప్ప‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ఉతప్ప.. తన ఓవర్‌లో ఏకంగా 6 సిక్స్‌లు సమర్పించుకున్నాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ రవి బొపారా ఉతప్ప బౌలింగ్‌ను ఊతికారేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 4 ఓవ‌ర్ వేసిన ఉత‌ప్ప బౌలింగ్‌లో బొపారా వ‌రుస‌గా 6 సిక్స్‌లు బాది ఔరా అన్పించాడు. ఆ ఓవ‌ర్‌లో మొత్తం ఆరు డెలివ‌రీల‌ను లాంగాఫ్‌, లాంగాన్‌, డీప్‌ మిడ్ వికెట్‌ల‌ దిశ‌గా బొపారా సిక్స‌ర్ల‌గా మ‌లిచాడు. 6 సిక్స్‌లతో పాటు ఊతప్ప ఓ వైడ్ కూడా వేయడంతో ఆ ఓవ‌ర్‌లో ఏకంగా 37 ప‌రుగులు వ‌చ్చాయి.

బొపారా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ఈ క్ర‌మంలో బొపారా కేవ‌లం 14 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీని అందుకున్నాడు. 14 బంతుల్లో 8 సిక్స్‌ల‌తో 53 ప‌రుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా అత‌డు  వెనుదిరిగాడు.

టీమిండియా మ‌రో ఓట‌మి..
ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్  నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో బొపారాతో పాటు సమిత్ పటేల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు.  భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. 

ఆ ఒక్క వికెట్ కూడా రనౌట్ రూపంలో టీమిండియాకు ల‌భించింది. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో టీమిండియా 15 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కేదార్ జాదవ్(15 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కాగా ఈ టోర్నీలో భార‌త్‌కు ఇది వ‌రుస‌గా మూడో ఓట‌మి కావ‌గడం గ‌మ‌నార్హం.
చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్‌, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు'


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement