టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట కోహ్లి(Virat Kohli)పై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తన అంతర్జాతీయ కెరీర్‌ను ముందుగానే ముగించడానికి విరాట్ కోహ్లినే కారణమని ఉతప్ప ఆరోపించాడు.
అదేవిధంగా యువరాజ్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ఎలా కమ్‌బ్యాక్ ఇచ్చాడో ఓ ఇంటర్వ్యూలో రాబిన్ వివరించాడు. కానీ రీ ఎంట్రీలో యువీకి అప్పటి కెప్టెన్‌గా ఉన్న కోహ్లి నుంచి ఎటువంటి సపోర్ట్ లభించలేదని ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ వెల్లడించాడు.
"యువరాజ్ భాయ్ జర్నీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకం. అతడు ఏకంగా క్యాన్సర్‌ను జయించి, తిరిగి అంతర్జాతీయ క్రికెట్ వైపు రావడానికి ప్రయత్నించాడు. భారత్‌కు ఒంటి చేత్తో వరల్డ్‌కప్ అందించిన వ్యక్తి. అంతేకాకుండా తన కెరీర్‌లో రెండు ప్రపంచకప్‌లను సొంతం చేసుకున్నాడు. అటువంటి ఆటగాడికి మనం చాలా గౌరవం ఇవ్వాలి. కానీ విరాట్ కోహ్లి నుంచి మాత్రం అతడికి ఎటువంటి మద్దతు లభించలేదు.
కెప్టెన్ అయ్యాక కోహ్లి మారిపోయాడు. యువీ ఎలాంటి గడ్డు పరిస్థితుల నుంచి కోలుకున్నాడో దగ్గరుండి చూసిన వ్యక్తులలో కోహ్లి ఒకడు. అలాంటిది ఫిట్‌నెస్ లేదని యువీని పక్కన పెట్టడం సరికాదు. నాకు ఈ విషయాలు ఎవరూ చెప్పలేదు. నేను అన్ని విషయాలను గమనించాను. కెప్టెన్‌గా ఫిట్‌నెస్ లెవల్స్‌ను పరిగణలోకి తీసుకోవడాన్ని నేను తప్పుబట్టడం లేదు.
కానీ ప్రతీ రూల్‌కు కొన్ని మినహాయింపులు ఉంటాయి. తను సాధించిన విజయాలకు కాదు, క్యాన్సర్‌ను ఓడించినందుకైనా యువీని జట్టులో కొనసాగించాల్సింది. ఆ సమయంలో అతడు నిజంగా కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా యువీ ఫిట్‌నెస్ టెస్టులో రెండు పాయింట్లు తనకు తగ్గించమని కూడా అభ్యర్ధించాడు.
అందుకు కూడా జట్టు మేనెజ్‌మెంట్ సానుకూలంగా స్పందించలేదు. దీంతో అతడు ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమకావడంతో జట్టులోకి తీసుకోలేదు. ఆ తర్వాత ఏదో విధంగా ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేసి జట్టులోకి వచ్చాడు.
కానీ పేలవ ఫామ్‌ను కలిగి ఉన్నాడని పూర్తిగా పక్కన పెట్టేశారు. కనీసం ఆ తర్వాత అయినా అతడికి ఛాన్స్ ఇవ్వలేదు. విరాట్ కోహ్లి సైతం యువీని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. దీంతో అతడు తన కెరీర్‌ను ముగించాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా 2000లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువరాజ్.. తన కెరీర్‌లో మొత్తంగా 402 మ్యాచ్‌లు ఆడాడు. 402 మ్యాచ్‌ల్లో ఈ పంజాబ్ ఆటగాడు 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడంలో యువీది కీలక పాత్ర.
చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment