టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.
వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్‌లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5
1. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు
2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు
3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు
4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు
5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.
మనోడే మళ్లీ నంబర్ వన్
బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.
ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5
1. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు
2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు
3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు
4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు
5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.
చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment