వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంప్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రవి బొపారా (3/9), ఓవైస్ షా (3/23), అజ్మల్ షహజాద్ (2/17), ర్యాన్ సైడ్‌బాటమ్ (1/16), స్కోఫీల్డ్ (1/22) ధాటికి 19.2 ఓవర్లలో 137 పరుగలకే కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెర్షల్ గిబ్స్ (26), మెక్‌లారెన్ (22), క్లెయిన్‌వెల్డ్ట్ (21) మాత్రమే 20 పరుగుల స్కోర్‌ను దాటగలిగారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు కెవిన్ పీటర్సన్ (11 బంతుల్లో 28; ఫోర్, 4 సిక్సర్లు), ఫిల్ మస్టర్డ్ (35 బంతుల్లో 84 నాటౌట్; 35 బంతుల్లో 84; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోవడంతో 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. ఇంగ్లండ్ కోల్పోయిన ఏకైక వికెట్ క్లెయిన్‌వెల్డ్ట్‌కు (పీటర్సన్) దక్కింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా రెండో విజయం.
ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా ఇవాళ (జులై 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఐసీసీ సభ్య దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment