27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు | Ravi Bopara smashed seven sixes and two fours | Sakshi
Sakshi News home page

27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు

Published Wed, Jan 29 2014 8:24 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు

27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు

హొబర్ట్: టెస్ట్, వన్డే సిరీస్లో ఇంగ్లండ్ను ఉతికి ఆరేసిన ఆస్ట్రేలియా టీ20లోనూ సత్తా చూపుతోంది. ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లీషు జట్టును 13 పరుగులతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. వైట్(75), ఫించ్(52) అర్థ సెంచరీలతో చెలరేగారు. మ్యాక్స్వెల్ 20, బెయిలీ 14, లియాన్ 33 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, డెర్న్బ్యాచ్, బొపారా, రైట్ తలో వికెట్ తీశారు.

214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. రవి బొపారా అర్థ సెంచరీలో చెలరేగినా విజయాన్ని అందించలేకపోయాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రూట్ 32, హేల్స్ 22 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నైల్ 4, హెన్రీక్స్ 2 వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్వెల్, ముయిర్హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వైట్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement