హారిస్ మ్యాజిక్; ఆసీస్ విన్ | Australia crush England to seal 5-0 whitewash | Sakshi
Sakshi News home page

హారిస్ మ్యాజిక్; ఆసీస్ విన్

Published Sun, Jan 5 2014 12:00 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

హారిస్ మ్యాజిక్; ఆసీస్ విన్

హారిస్ మ్యాజిక్; ఆసీస్ విన్

సిడ్నీ: యాషెస్ సిరీస్ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరి టెస్టులో ఇంగ్లండ్ను 281 పరుగులతో చిత్తు చేసి సంపూర్ణ విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 448 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 166 పరుగులకే కుప్పకూలింది. 31.4 ఓవర్లలో చాప చుట్టేసింది. 52 నిమిషాల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి బొక్కబోర్లా పడింది.

ఆసీస్ బౌలర్ హారిస్ మ్యాజిక్కు ఇంగ్లీషు ఆటగాళ్లు దాసోసమయ్యారు. కార్బెరీ(43), బెల్(16), స్టోక్స్(32), బ్రాడ్(42) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇద్దరు డకౌటయ్యారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. హారిస్ 5 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్ 3, లియాన్ 2 వికెట్లు తీశారు.

అంతకుముందు 140/4 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌటయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 326, ఇంగ్లండ్ 155 పరుగులు చేశాయి. హారిస్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement