స్టోక్స్ 'సిక్సర్'... స్మిత్ సెంచరీ
సిడ్నీ: యాషెస్ సిరీస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటయింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 76 ఓవర్లలో 326 పరుగులు చేసింది. స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు.154 బంతుల్లో 17 ఫోర్లు, సిక్సర్తో 115 పరుగులు చేశాడు. హాడిన్(75) అర్థ సెంచరీతో రాణించాడు. వాట్సన్ 43, హరీస్ 22, రోజర్స్ 11, వార్నర్ 16, క్లార్క్ 10, జాన్సన్ 12 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చాడు. బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్, బోర్త్విక్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 6 పరుగులకే వికెట్ నష్టపోయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8/1 స్కోరుతో ఉంది.