ఆసియాకప్-2022లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరుస్తున్నాడు. రోహిత్ కెప్టెన్‌గా సఫలం అవుతున్నప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన రోహిత్.. హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.
కాగా సారథ్య బాధ్యతలు చేపట్టాక హిట్‌మ్యాన్ దూకుడు తగ్గింది అనే చేప్పుకోవాలి. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ రోహిత్ అంతగా రాణించలేకపోయాడు. అదే విధంగా ఇంగ్లండ్, విండీస్ టీ20 సిరీస్‌లోనూ చేప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా లేవు.
ఇక రోహిత్ ఇదే ఫామ్‌ను కోనసాగిస్తే రానున్న రోజుల్లో జట్టుపై ఒత్తిడి పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో రోహిత్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సంచలన వాఖ్యలు చేశాడు. బుధవారం జరిగిన హాంకాంగ్-భారత్ మధ్య మ్యాచ్ అనంతరం పీటీవీ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో హఫీజ్ పాల్గొన్నాడు.
ఎక్కువ కాలం కెప్టన్‌గా ఉండకపోవచ్చు
ఈ క్రమంలో హఫీజ్ మాట్లాడూతూ.. "హాంగ్ కాంగ్ భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ రోహిత్ ముఖంలో మ్యాచ్ గెలిచిన ఆనందం కనిపించలేదు. రోహిత్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్సీ అతడికి భారంగా మారింది. అతడు హాంగ్‌కాంగ్ మ్యాచ్‌లో టాస్‌కు వచ్చిన సమయంలో రోహిత్ భయపడుతున్నట్లు, ఆయోమయంలో ఉన్నట్లు కన్పించాడు. గతంలో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
అటువంటి హిట్ మ్యాన్‌ను నేను ప్రస్తుతం చూడలేకపోతున్నాను. అతడు రోజు రోజుకి తన ఫామ్‌ను మరింత కోల్పోతున్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అతడు క్రికెట్ బ్రాండ్, మ్యాచ్‌లలో సానుకూలంగా ఆడటం కోసం మాట్లాడాతున్నాడు. అయితే అటువంటివి మాట్లాడటం తేలికే కానీ సాధ్యం చేసుకోవడం చాలా కష్టం. నా అభిప్రాయం ప్రకారం ఇదే ఫామ్‌ను అతడు కొనసాగిస్తే.. ఎక్కువ రోజులు భారత కెప్టెన్‌గా కొనసాగలేడు అని హాఫీజ్ పేర్కొన్నాడు.
చదవండి: Rohit Sharma: కొత్త అవతారంలో రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 4న డబుల్ ధమాకా!
Comments
Please login to add a commentAdd a comment