ప్రధాన ఆయిల్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త శ్రీనివాస్
ప్రధాన ఆయిల్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ఆయిల్ కంపెనీలైన బీపీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ పెట్రోల్ బంకులు, సీఎన్‌జీ స్టేషన్లలో ఈనెల 11వ తేది అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి పెట్రోల్, డీజల్ కొనుగోలు చేయవచ్చని ప్రధాన ఆయిల్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త, చీఫ్ రీజినల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన ఆయిల్ కంపెనీల గ్యాస్ వినియోగదారులు ఈనెల 11వ తేది అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి ఎల్పీజీ సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదని, అవసరమైన మేరకు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు.